| 1. పూర్వకాలంలో గ్రామ స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిన రాజవంశం ఏది? |
| జ: చోళులు |
| 2. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, సమాజ వికాస కార్యక్రమాల సక్రమ నిర్వహణకు పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ? |
| జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ |
| 3. 'స్థానిక ప్రభుత్వం స్వేచ్ఛగా ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా నిర్వహించేదే ప్రజల ప్రభుత్వం' అని అన్నదెవరు? |
| జ: మాంటేగ్ హారిస్ |
| 4. స్థానిక స్వపరిపాలన గురించి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉన్న జాతీయ నాయకుడు ఎవరు? |
| జ: మహాత్మాగాంధీ |
| 5. కిందివాటిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన చట్టం ఏది? |
| 1) 1919 చట్టం 2) 1909 చట్టం 3) 1835 చట్టం 4) 1773 చట్టం |
| జ: 1 (1919 చట్టం) |
| 6. 'స్థానిక ప్రభుత్వం అంటే ఒక గ్రామం లేదా ఒక రాష్ట్రం కంటే చిన్న ప్రాంతంలో గణనీయమైన స్వయం ప్రతిభ కలిగిన ప్రజా ప్రతినిధులు స్థానిక పన్నుల ద్వారా సేకరించిన ఆదాయంతో స్థానిక సేవలకోసం నిర్వహించే పాలన' అని నిర్వచించినవారు? |
| జ: మామిడిపూడి వెంకట రంగయ్య |
| 7. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏమిటి? |
| జ: గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులతో కూడిన గ్రామీణ స్వపరిపాలనా వ్యవస్థ |
| 8. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| జ: 1959 |
| 9. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న స్థానిక సంస్థలేవి? |
| 1) గ్రామ ప్రాంత స్థానిక సంస్థలు 2) పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు |
| 3) పై రెండు సంస్థలు 4) ఏదీకాదు |
| జ: 3 (పై రెండు సంస్థలు) |
| 10. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్రామ ప్రాంత స్థానిక సంస్థలేవి? |
| 1) గ్రామ పంచాయతీ 2) మండల ప్రజా పరిషత్తు |
| 3) జిల్లా ప్రజా పరిషత్తు 4) పైవన్నీ |
| జ: 4 (పైవన్నీ) |
| 11. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రాంత స్థానిక సంస్థలేవి? |
| 1) మున్సిపాలిటీలు 2) కార్పొరేషన్లు 3) పై రెండూ 4) ఏదీకాదు |
| జ: 3 (పై రెండూ) |
| 12. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్దేశించే రాజ్యాంగ నిబంధన ఏది? |
| జ: 40వ నిబంధన |
| 13. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏది? |
| జ: గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులతో కూడిన మూడంచెల వ్యవస్థ |
| 14. పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించిన రెండో కమిటీ ఏది? |
| జ: అశోక్ మెహతా కమిటీ |
| 15. అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది? |
| జ: మండల పంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్తుతో కూడిన రెండంచెల వ్యవస్థ |
| 16. గ్రామ పంచాయతీలో ఎన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి? |
| జ: 4 |
| 17. గ్రామ పంచాయతీలోని ప్రధాన విభాగాలు ఏవి? |
| 1) గ్రామసభ 2) గ్రామ పంచాయతీ 3) సర్పంచ్, ఉపసర్పంచ్ 4) పైవన్నీ |
| జ: 4 (పైవన్నీ) |
| 18. గ్రామ సభ అంటే ఏమిటి? |
| జ: గ్రామ ఓటర్లందరితో కూడిన సభ |
| 19. గ్రామసభ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? |
| జ: 2 |
| 20. గ్రామ పంచాయతీలో ఎంత మంది సభ్యులు ఉంటారు? |
| జ: 5-31 |
| 21. గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? |
| జ: సర్పంచ్ |
| 22. గ్రామ పంచాయతీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? |
| జ: గ్రామ ఓటర్లు |
| 23. గ్రామ పంచాయతీ ఎన్నికలకోసం గ్రామాన్ని ఏవిధంగా విభజిస్తారు? |
| జ: వార్డులు |
| 24. గ్రామ సర్పంచ్‌ను ఎవరు ఎన్నుకుంటారు? |
| జ: గ్రామ ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు |
| 25. గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం ఎంత? |
| జ: 5 సంవత్సరాలు |
| 26. గ్రామ సర్పంచ్ పదవీ కాలం ఎంత? |
| జ: 5 సంవత్సరాలు |
| 27. గ్రామ ఉప సర్పంచ్‌ను ఎవరు ఎన్నుకుంటారు? |
| జ: గ్రామ పంచాయతీ సభ్యులు |
| 28. పంచాయతీ సిబ్బందిపై ఎవరికి నియంత్రణ ఉంటుంది? |
| జ: కార్యనిర్వహణాధికారి |
| 29. గ్రామ కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు? |
| జ: రాష్ట్ర ప్రభుత్వం |
| 30. గ్రామ పంచాయతీ సమావేశానికి ఎంత 'కోరం' అవసరం? |
| జ: మొత్తం సభ్యుల సంఖ్యలో మూడో వంతు |
| 31. గ్రామ పంచాయతీ విధించాల్సిన తప్పనిసరి పన్నులేవి? |
| జ: ఇంటిపన్ను, వ్యాపార పన్ను |
| 32. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? |
| జ: రాష్ట్ర ప్రభుత్వం |
| 33. కొన్ని గ్రామాలను కలిపి ఏర్పరిచిన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏమంటారు? |
| జ: పంచాయతీ సమితి |
| 34. పంచాయతీ సమితిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? |
| జ: మండల ప్రజా పరిషత్ |
| 35. ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ చట్టాలను ఎప్పుడు రూపొందించారు? |
| జ: 1986 జనవరి 13 |
| 36. మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? |
| జ: మండల ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు |
| 37. జిల్లా స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది? |
| జ: జిల్లా ప్రజా పరిషత్ |
| 38. ప్రాచీనకాలంలో స్థానిక సంస్థలను ఏమని పిలిచేవారు? |
| జ: శ్రేణులు |
| 39. ప్రాచీనకాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? |
| జ: గ్రామణి |
| 40. దేశంలో గ్రామస్థాయిలో పాలనా వ్యవస్థ పటిష్టంగా ఉందని వివరించిన శాస్త్రం - |
| జ: అర్థ శాస్త్రం |
| 41. స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించాలని సూచించిన తీర్మానం ఏది? |
| జ: లార్డ్ మేయో తీర్మానం |
| 42. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం'ను ఎప్పుడు ప్రవేశపెట్టింది? |
| జ: 1952 అక్టోబరు 2 |
| 43. గ్రామీణ రైతులకు సాంకేతిక సహకారం, చిన్న పెట్టుబడిదారులకు సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది? |
| జ: నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ |
| 44. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మొదటి స్థాయి పంచాయతీ ఏది? |
| జ: గ్రామ పంచాయతీ |
| 45. గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని గ్రామ ఓటర్ల జాబితాలో రిజిస్టరైన సభ్యుల సమూహం ఏది? |
| జ: గ్రామ సభ |
| 46. 'పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీ' గ్రంథకర్త ఎవరు? |
| జ: పి.సి.మాథూర్ |
| 47. సర్పంచ్ పదవి ఏదైనా కారణం వల్ల ఖాళీ ఏర్పడితే దాన్ని ఎన్ని రోజుల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది? |
| జ: 120 |
| 48. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎన్ని జిల్లా పరిషత్‌లు ఉన్నాయి? |
| జ: 22 |
| 49. మన రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ మండలాలు ఉన్నాయి? |
| జ: 1128 |
| 50. స్థానిక సంస్థల పనితీరును సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్/కమిటీ ఏది? |
| జ: రాయల్ కమిషన్ |
| 51. కిందివాటిలో గ్రామ పంచాయతీలకు సంబంధించని పన్ను ఏది? |
| 1) ప్రభుత్వ గ్రాంట్లు 2) ఇంటిపన్ను |
| 3) వ్యవసాయపు పన్ను 4) భూమిపై స్థానిక పన్నులు |
| జ: 3 (వ్యవసాయపు పన్ను) |
| 52. 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం'ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? |
| జ: 1952 |
| 53. 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం' ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? |
| జ: జనాభా |
| 54. 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం' అత్యధికంగా దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? |
| జ: సంక్షేమ కార్యక్రమాలు |
| 55. 'కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం' ప్రధానంగా ఎక్కడ అమలుచేస్తారు? |
| జ: మండల స్థాయిలో |
| 56. ఏ పంచాయతీ రాజ్ సంస్థలు దేశ రాజకీయ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఉన్నాయి? |
| 1) గ్రామ పంచాయతీలు 2) మండల పరిషత్ |
| 3) జిల్లా పరిషత్ 4) పైవన్నీ |
| జ: 4 (పైవన్నీ) |
| 57. మన దేశంలో బౌద్ధం వెల్లివిరిసిన కాలంలోనే స్థానిక సంస్థలు ఉండేవని పేర్కొన్నవారెవరు? |
| జ: అంబేద్కర్ |
| 58. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆదేశానుసారం ఎవరి అధ్యక్షతన సంఘం ఏర్పాటై పంచాయతీరాజ్ సంస్థలో రావలసిన మార్పులను సూచించింది? |
| జ: ఇందిరా గాంధీ |
| 59. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ సంస్థల తీరుతెన్నులు పరిశీలించడానికి ఉన్నతాధికార సంఘాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? |
| జ: 1971 |
| 60. రాష్ట్రాల్లోని పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఎవరిని ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు? |
| జ: పంచాయతీ సమితి ఛైర్మన్ |
| 61. ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి సర్వీసును ఆవిష్కరించింది? |
| జ: రాజస్థాన్ |
| 62. పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లోని లోటుపాట్లను ఏ కమిటీ తీవ్రంగా విమర్శించింది? |
| జ: సంతానం కమిటీ |
| 63. పంచాయతీ పదవీకాలం ముగిసేలోపే రద్దయితే ఎంత కాలంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి? |
| జ: 6 నెలలు |
| 64. పంచాయతీ ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? |
| జ: రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నియమించే అధికారిక సంఘం |
| 65. పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి వి.పి.నాయక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది? |
| జ: మహారాష్ట్ర |
| 66. పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఆర్.యు.పరేక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది? |
| జ: గుజరాత్ |
| 67. పంచాయతీ రాజ్ సంస్థలు నిధుల కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి? |
| జ: ప్రభుత్వ సహాయం |
| 68. పంచాయతీ రాజ్ సంస్థల రాబడి, వ్యయాలపై ఆడిటింగ్‌లకు సంబంధించిన నిబంధనలు రూపొందించేది- |
| జ: పార్లమెంట్ |
| 69. మండల పరిషత్‌లు ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీ సమితులు ఉండేవి? |
| జ: 330 |
| 70. ఆంధ్రప్రదేశ్‌లో 'బోర్డ్ ఆఫ్ రెవెన్యూ' ఎప్పుడు రద్దు అయ్యింది? |
| జ: 1967 |
| 71. మానవ వనరుల పరస్పర సహకారం ద్వారా అభివృద్ధి సాధించడానికి దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు? |
| జ: గ్రామం |
| 72. 1971లో నియమించిన ఉన్నతాధికార సంఘం అధ్యక్షుడు ఎవరు? |
| జ: సి.నరసింహం |
| 73. మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్‌ల నిర్మాణానికి ప్రత్యేక చట్టం ఎప్పుడు చేశారు? |
| జ: 1986 |
| 74. ప్రస్తుత స్థానిక స్వపరిపాలన సంస్థల ఆవిర్భావం, అభివృద్ధి స్వాతంత్య్రానికి ముందు ఎన్ని భాగాలుగా ఉండేది? |
| జ: మూడు |
| 75. ఏ సంవత్సరంలో రూపొందించిన రెగ్యులేషన్ చట్టం నెం.29 ప్రవేశంతో పంచాయతీ విధానం ప్రారంభమైంది? |
| జ: 1802 |
| 76. స్థానిక బోర్డుల చట్టం కింద ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సంఘాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| జ: 1884 |
| 77. మద్రాసు పంచాయతీల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? |
| జ: 1920 |
| 78. 'ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1986' ఎప్పుడు అమల్లోకి వచ్చింది? |
| జ: 1987 జనవరి 15 |
| 79. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని సూచించిన కమిటీ ఏది? |
| జ: దంతవాలా కమిటీ |
| 80. పంచాయతీ రాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి సంతానం కమిటీని ఎప్పుడు నియమించారు? |
| జ: 1963 |
| 81. ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన పథకాల పాలనా ఏర్పాట్ల కోసం జి.వి.కె. రావు కమిటీని ఎప్పుడు నియమించింది? |
| జ: 1985 |
| 82. ఏ నిబంధనను అనుసరించి 21 ఏళ్లు ఉన్నవారు పంచాయతీ ఎన్నికలకు అర్హత పొందుతారు? |
| జ: 243 (ఎఫ్) |
| 83. పంచాయతీల కాలపరిమితిని గురించి వివరించే నిబంధన ఏది? |
| జ: 243 (ఇ) |
| 84. పంచాయతీరాజ్ సంస్థలపై ఎల్.ఎమ్.సింఘ్వీ కమిటీని ఎవరి ప్రభుత్వ హయాం (1986)లో నియమించారు? |
| జ: రాజీవ్ గాంధీ |
| 85. మనదేశంలో పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? |
| జ: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ |
| 86. గ్రామీణ ప్రాంతాల్లో 243 (బి) నిబంధన కింద ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థ ఏది? |
| జ: గ్రామ పంచాయతీ |
| 87. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు గౌరవ వేతనం (రూపాయల్లో) ఎంత ఉంటుంది? |
| జ: 1000 |
| 88. మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు గౌరవ వేతనం (రూపాయల్లో) ఎంత ఉంటుంది? |
| జ: రూ. 600 |
| 89. ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుంది? |
| జ: 243 (కె) |
| 90. పంచాయతీ సంస్థల అధికారాలు, విధులను తెలియజేసే నిబంధనలు ఏవి? |
| జ: 243 (జి), 243 (హెచ్) |
| 91. పంచాయతీ రాజ్ వ్యవస్థలోని పంచాయతీ సమితి కంటే జిల్లా పరిషత్తుకే ప్రధాన కార్యనిర్వాహక శాఖ అధికారాలు ఉండాలని సూచించింది- |
| జ: పాలనా సంస్కరణల సంఘం 1969 |
| 92. కిందివాటిలో పంచాయతీ రిజర్వేషన్లు లేని రాష్ట్రం? |
| 1) నాగాలాండ్ 2) కర్ణాటక 3) జమ్మూకాశ్మీర్ 4) గుజరాత్ |
| జ: 3 (జమ్మూకాశ్మీర్) |
| 93. పంచాయతీ రాజ్ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనలు ఏవి? |
| జ: 243 (డి) |
| 94. పంచాయతీ రాజ్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? |
| జ: బి.పి.ఆర్.విఠల్ కమిటీ |
| 95. పంచాయతీ రాజ్ సంస్థల ఆడిటింగ్‌ను ఎవరు నిర్వహిస్తారు? |
| జ: లోకల్ ఫండ్ ఆడిటర్స్ |
| 96. రాయల్ వికేంద్రీకరణ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| జ: 1907 |
| 97. రాయల్ కమిషన్ సిఫార్సు మేరకు స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తెలియజేసే చట్టం |
| జ: మింటో మార్లే చట్టం 1909 |
| 98. 1986లో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్తుల సంఖ్య |
| జ: 1104 |
| 99. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ |
| జ: గ్రామ సభ |
| 100. 'గ్రామ సభ సంవత్సరం'గా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు? |
| జ: 1999 |
| 101. గ్రామాధికారుల నిర్వహణ కోసం గ్రామ పన్ను చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? |
| జ: 1967 |
| 102. పంచాయతీ సంస్థల్లో 'అంచల్ కమిటీ' వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది? |
| జ: అరుణాచల్ ప్రదేశ్ |
| 103. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వివాదాలను పరిష్కరించే కోర్టు |
| జ: మున్సిఫ్ కోర్టులు |
| 104. స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీల బడ్జెట్‌ను కిందివాటిలో ఎవరికి సమర్పించరు? |
| 1) మండల పంచాయతీ అధికారి 2) జిల్లా పంచాయతీ అధికారి |
| 3) జిల్లా కలెక్టరు 4) ఎవరూ కాదు |
| జ: జిల్లా పంచాయతీ అధికారి |
| 105. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు ఎంత కాలానికి ఒకసారి సమావేశం కావాలి? |
| జ: రెండు నెలలు |
| 106. ఏ రాష్ట్ర పంచాయతీకి జ్యుడీషియల్ అధికారాలు ఉన్నాయి? |
| జ: బీహార్ |
| 107. మండల వ్యవస్థకు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎప్పుడు ఆమోదించింది? |
| జ: 1987 జులై |
| 108. పంచాయతీ సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు? |
| జ: బి.డి.ఒ. |
| 109. గ్రామ పంచాయతీలను విధిగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు? |
| జ: చతుర్థ భాగం |
| 110. పంచాయతీరాజ్ సంస్థల పద్దులను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో ఆడిట్ చేయించాలని ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించింది? |
| జ: 64వ సవరణ |
| 111. గ్రామ సభలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని సూచించిన రాజ్యాంగ నిబంధన ఏది? |
| జ: 243 (ఎ) |
| 112. గ్రామ స్వరాజ్య సాధనలో తొలి ప్రయత్నంగా మన దేశంలో దేన్ని పేర్కొంటారు? |
| జ: కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం |
| 113. మన గ్రామసభను పోలిన స్థానిక స్వపరిపాలనా సంస్థ ఏ దేశంలో ఉంది? |
| జ: స్విట్జర్లాండ్ |
| 114. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ సామాజిక ఉద్యమంలో ఒక భాగంగా ఉంది? |
| జ: సర్వోదయ |
| 115. లోకల్ ఫండ్ ఆడిటర్ తమ ఆడిట్ నివేదికను ఎవరికి పంపిస్తారు? |
| జ: జిల్లా అభివృద్ధి అధికారి |
| 116. గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి మధ్య ఎవరు అనుసంధానకర్తగా పనిచేస్తారు? |
| జ: పంచాయతీ కార్యనిర్వహణాధికారి |
| 117. ఆంధ్రప్రదేశ్‌లో మూడంచెల పద్ధతిలో పరోక్షంగా ఎన్నికలు జరిగిన సంవత్సరం? |
| జ: 1964 - 1981 |
| 118. గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు? |
| జ: మహాత్మాగాంధీ |
| 119. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను ఎవరు నియమిస్తారు? |
| జ: రాష్ట్ర గవర్నర్ |
| 120. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా ప్రణాళికా కమిటీ ఏర్పాటుకు వీలు కల్పించారు? |
| జ: 73వ రాజ్యాంగ సవరణ |
| 121. రాష్ట్ర సచివాలయ వ్యవస్థ విధులను ఎవరు నిర్ణయిస్తారు? |
| జ: రూల్స్ ఆఫ్ బిజినెస్ |
| 122. 1947వ సంవత్సరానికి కిందివాటిలో కార్పొరేషన్ కానిదేది? |
| 1) మద్రాసు 2) కలకత్తా 3) ఢిల్లీ 4) ముంబయి |
| జ: మద్రాసు |
| 123. కింది వాటిలో స్థానిక ప్రభుత్వాలు విధించే పన్ను కానిదేది? |
| 1) ఆక్ట్రాయ్ 2) ఆస్తి పన్ను 3) వృత్తి పన్ను 4) స్టాంప్ డ్యూటీ |
| జ: స్టాంప్ డ్యూటీ |
| 124. సూపర్ సెషన్‌కి అవకాశం లేని మున్సిపల్ కార్పొరేషన్ ఏది? |
| జ: ఢిల్లీ |
| 125. మేయర్ ఇన్ కౌన్సిల్ వ్యవస్థ ఎక్కడ ఉంది? |
| జ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ |
| 126. కింది వాటిలో పట్టణ స్థానిక సంస్థల తప్పనిసరి విధి కానిదేది? |
| 1) సామాజిక సదుపాయాల కల్పన |
| 2) నీటి సరఫరా, శానిటేషన్ (పరిశుభ్రత) |
| 3) రిక్రియేషన్ సదుపాయాల కల్పన |
| 4) శాంతి భద్రతల నిర్వహణ |
| జ: శాంతి భద్రతల నిర్వహణ |
| 127. మున్సిపల్ సంస్థల్లో అన్ని రకాల కార్యనిర్వహణాధికారాలను ఎవరికి ఇవ్వాలని స్థానిక ప్రభుత్వ సంస్థలు కోరుతున్నాయి? |
| జ: మున్సిపల్ కమిషన్ |
| 128. బ్రిటిష్ పాలనలో స్థానిక ప్రభుత్వాలు దేనిపై ఆధారపడ్డాయి? |
| జ: వికేంద్రీకరణ |
| 129. బ్రిటిష్ ప్రజలు వ్యతిరేకించిన పన్ను ఏది? |
| జ: పోల్ టాక్స్ |
| 130. మున్సిపాలిటీ అయ్యేందుకు పూర్తి అర్హత సాధించని, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఏర్పాటు చేసే స్థానిక ప్రభుత్వం ఏది? |
| జ: పట్టణ ప్రాంత కమిటీ |
| 131. బ్రిటన్‌లోని స్థానిక ప్రభుత్వాలను వేటి ఆధారంగా నిర్వహిస్తారు? |
| జ: జాతీయ ప్రభుత్వ నిబంధనల ఆధారంగా |
| 132. రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఏ నిబంధనలో వివరించారు? |
| జ: 243 (ఎ) - 243 (ఒ) నిబంధనలు |
| 133. 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా దేన్ని ప్రవేశపెట్టారు? |
| జ: 51 (ఎ) భాగం |
| 134. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ నగరంలో స్థాపించారు? |
| జ: మద్రాసు |
| 135. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ ప్రధాన ఉద్దేశమేంటి? |
| జ: నగరాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేయడం |
| 136. ఒక చిన్న పట్టణాన్ని పరిపాలించడం కోసం ఏర్పాటు చేసే సెమీ మున్సిపల్ అథారిటీ ఏది? |
| జ: టౌన్ ఏరియా కమిటీ |
| 137. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా ఏ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు? |
| జ: శ్రీకాకుళం |
| 138. పట్టణాలను మున్సిపల్ ఎన్నికలకు ఎలా విభజిస్తారు? |
| జ: వార్డులు |
| 139. మున్సిపల్ కౌన్సిల్‌లోని సభ్యులను ఏమని పిలుస్తారు? |
| జ: కౌన్సిలర్ |
| 140. మున్సిపల్ కౌన్సిల్‌లోని సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? |
| జ: వార్డులోని ఓటర్లు |
| 141. మున్సిపల్ ఛైర్మన్‌ను ఎవరు ఎన్నుకుంటారు? |
| జ: మున్సిపల్ పరిధిలోని ఓటర్లు (ప్రత్యక్ష పద్ధతిలో) |
| 142. నగర పాలక సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ వ్యవహారాలను ఎవరు చూస్తారు? |
| జ: రాష్ట్ర శాసన వ్యవస్థ నిర్ణయించిన సంస్థ |
| 143. నగరపాలక సంస్థలు చేసే అన్ని రకాల రుణ ప్రతిపాదనలను ఎవరు ఆమోదిస్తారు? |
| జ: భారతీయ రిజర్వు బ్యాంకు |
| 144. పట్టణ స్థాయి వ్యవస్థ గురించి దేనిలో వివరించారు? |
| జ: కౌటిల్యుడి అర్థశాస్త్రం |
| 145. మద్రాసు నగరపాలక సంస్థ ఎప్పుడు ఏర్పడింది? |
| జ: 1688 |
| 146. మున్సిపల్ పాలనలో నూతన మార్పులను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? |
| జ: 1973 |
| 147. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? |
| జ: మున్సిపల్ ఛైర్మన్ |
| 148. మున్సిపల్ కార్యాలయ నిర్వహణాధికారి ఎవరు? |
| జ: మున్సిపల్ కమిషనర్ |
| 149. మున్సిపల్ కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు? |
| జ: రాష్ట్ర ప్రభుత్వం |
| 150. మున్సిపాలిటీలకు ఉన్న ప్రధాన ఆర్థిక వనరులు ఏవి? |
| 1) పన్నులు 2) రుణాలు 3) ప్రభుత్వ గ్రాంట్లు |
| జ: పైవన్నీ |
| 151. మున్సిపాలిటీలు విధించే ప్రధాన పన్నులు ఏవి? |
| 1) ఇంటిపన్ను 2) ఆస్తిపన్ను 3) వృత్తిపన్ను |
| జ: పైవన్నీ |
| 152. పెద్ద నగరాల స్వపరిపాలనా సంస్థలను ఏమని పిలుస్తారు? |
| జ: వార్డులు |
| 153. మన రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు ఏవి? |
| 1) కార్పొరేషన్ 2) స్థాయీ సంఘాలు 3) కమిషనర్, మేయర్ |
| జ: పైవన్నీ |
| 154. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? |
| జ: 1966 |
| 155. విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? |
| జ: 1979 |
| 156. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? |
| జ: 1981 |
| 157. కార్పొరేషన్లను ఏవిధంగా విభజిస్తారు? |
| జ: డివిజన్లు |
| 158. డివిజన్ ప్రతినిధి ఎవరు? |
| జ: కార్పొరేటర్ |
| 159. బొంబాయి నగరపాలక సంస్థ కార్యకలాపాలను నిర్వహించేందుకు న్యాయాధికారుల స్థానంలో ఒక కన్జర్వెన్సీ బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు? |
| జ: 1845 |
| 160. బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ పాలనా నిర్వహణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌ను ఏ సంవత్సరం నియమించింది? |
| జ: 1914 |
| 161. మున్సిపాలిటీలను పటిష్ఠపరిచేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేశారు? |
| జ: 74వ సవరణ |
| 162. పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఏ నిబంధన ద్వారా రాజ్యాంగ హోదాను కల్పించారు? |
| జ: 40వ నిబంధన |
| 163. మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎందుకు స్థాపించారు? |
| జ: బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక అవసరాలు |
| 164. బ్రిటిష్‌వారు ప్రజల నుంచి పన్నులను వసూలు చేసేందుకు వేటిని నియమించారు? |
| జ: కార్పొరేషన్ |
| 165. పంచాయతీరాజ్, నగరపాలక సంస్థలకు సంబంధించిన 11, 12 షెడ్యూళ్లను రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు? |
| జ: 1993 |
| 166. ''ద రూరల్-అర్బన్ రిలేషన్‌షిప్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? |
| జ: 1963-66 |
| 167. నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు ఎవరు? |
| జ: మేయర్ |
| 168. మన రాష్ట్రంలో ఎన్ని రకాల పురపాలక సంఘాలున్నాయి? |
| జ: 5 |
| 169. మన రాష్ట్రంలో పురాతనమైన మున్సిపాలిటీ ఏది? |
| జ: రాజమండ్రి |
| 170. మున్సిపల్ కార్పొరేటర్‌ను ఎవరు ఎన్నుకుంటారు? |
| జ: మున్సిపల్ డివిజన్‌లోని ఓటర్లు |
| 171. కార్పొరేషన్ పాలనలో ప్రధాన పాత్ర వహించేది ఎవరు? |
| జ: స్థాయీ సంఘం |
| 172. స్థాయీ సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? |
| జ: స్థాయీ సంఘం అధ్యక్షుడు |
| 173. కార్పొరేషన్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? |
| జ: మేయర్ |
| 174. కార్పొరేషన్ నిధులన్నింటినీ కలిపి ఏమంటారు? |
| జ: మున్సిపల్ ఫండ్ |
| 175. రాష్ట్రంలోని స్థానిక సంస్థలపై పూర్తి నియంత్రణ ఎవరికి ఉంటుంది? |
| జ: రాష్ట్ర ప్రభుత్వం |
| 176. కార్పొరేషన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎవరు? |
| జ: కమిషనర్ |
| 177. నగర మేయర్‌ను ఎవరు ఎన్నుకుంటారు? |
| జ: ప్రజలు |
| 178. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించాలంటే కనీస వార్షికాదాయం ఎంత ఉండాలి? |
| జ: 10 లక్షలు |
| 179. 1906-1909 వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ సిఫార్సుల్లో ఒకటి? |
| జ: మున్సిపాలిటీలకు పన్నులు విధించే అధికారం |
| 180. నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్ అధ్యక్షులు ఎవరు? |
| జ: చార్సెస్ కొరియా |
| 181. ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా స్థానిక ప్రభుత్వాల కేంద్రమండలి ఏర్పాటైంది? |
| జ: 263 |
| 182. వార్డు కమిటీలను ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా ఏర్పాటు చేస్తారు? |
| జ: 243 ఎస్ |
| 183. హైదరాబాద్ పట్టణాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? |
| జ: 1589 |
| 184. భారతదేశంలోని మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది? |
| జ: ఢిల్లీ |
| 185. పంచాయతీ యూనియన్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రం ఏది? |
| జ: తమిళనాడు |