| 1. అంటరానితనం నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? |
| జ: 1955 |
| 2. 'అంటరానితనం నిషేధం' గురించి రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలుపుతుంది? |
| జ: 17 |
| 3. ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఏ ప్రయోజనాలను కాపాడాలని ఆదేశిక సూత్రాలు తెలుపుతాయి? |
| జ: విద్యా, ఆర్థిక ప్రయోజనాలు |
| 4. డా. అంబేద్కర్ అభిప్రాయంలో రిజర్వేషన్లు ఎన్నేళ్లపాటు కొనసాగాలి? |
| జ: 10 |
| 5. రిజర్వేషన్‌కు సంబంధించిన చట్టాలను న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించడానికి తీసుకున్న చర్య- |
| జ: 9వ షెడ్యూల్డ్‌లో చేర్చడం |
| 6. వెనుకబడిన కులాలకు వేటిలో రిజర్వేషన్లను కల్పించారు? |
| జ: విద్యాలయాలు, ప్రభుత్వోద్యోగాలు |
| 7. వెనుకబడిన తరగతుల మొదటి కమిషన్ అధ్యక్షులు? |
| జ: కేల్కర్ |
| 8. షెడ్యూల్డ్ తెగల నిర్వచనం రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో ఉంది? |
| జ: 366 (25) |
| 9. షెడ్యూల్డ్ కులాన్ని- |
| జ: రాజ్యాంగంలో నిర్వచించారు |
| 10. 'పౌరహక్కుల చట్టం - 1955'ను దేనికోసం ఉద్దేశించారు? |
| జ: అస్పృశ్యత నివారణకు |
| 11. కేవలం దళితుల కోసమే డా. బి.ఆర్. అంబేద్కర్ ఎప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌ను స్థాపించారు? |
| జ: 1942 |
| 12. వెనుకబడిన తరగతుల గుర్తింపు ఆధారం? |
| 1) ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిథ్యం 2) కులంలో విద్యాస్థాయి |
| 3) కులక్రమ శ్రేణిలో తక్కువస్థాయి సామాజిక వర్గం 4) పైవన్నీ |
| జ: పైవన్నీ |
| 13. సమాజంలో స్త్రీల స్థితిని మార్చే సామాజిక ఉద్యమం? |
| జ: ఫెమినిజం |
| 14. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములను ఇతరులు కొనకుండా 'భూ బదలాయింపు నిషేధం చట్టం'ను ఎప్పుడు రూపొందించారు? |
| జ: 1970 |
| 15. 50% మించి ఆదివాసులున్న ప్రాంతం ఏది? |
| జ: దాద్రానగర్ హవేలీ |
| 16. గిరిజన ఉపప్రణాళికను అమలు చేయడానికి ఏ వ్యవస్థలను ఏర్పాటు చేశారు? |
| 1) ఐటీడీఏ 2) ఐటీడీపీ 3) ఎంఏడీఏ 4) పైవన్నీ |
| జ: పైవన్నీ |
| 17. 'గిరిజన సహకార మార్కెంటింగ్ అభివృద్ధి సమాఖ్య'ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| జ: 1987 |
| 18. భారత రాజ్యాంగం 'అల్పసంఖ్యాక వర్గాల'ను ఏ ప్రాతిపదికన గుర్తించింది? |
| జ: భాష, మత |
| 19. 'జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ చట్టం' ఎప్పుడు ఏర్పాటైంది? |
| జ: 1992 |
| 20. ప్రభుత్వ ధన సహాయంతో నడిచే విద్యాసంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించే రాజ్యాంగ ప్రకరణ? |
| జ: 28 |
| 21. చట్టం ముందు అందరూ సమానం అనే రాజ్యాంగ నిబంధన? |
| జ: 14 |
| 22. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా స్థాపించారు? |
| జ: 89 |
| 23. మైనార్టీ సంక్షేమం కోసం 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? |
| జ: మన్మోహన్ సింగ్ |
| 24. మైనార్టీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? |
| జ: ప్రభుత్వం |
| 25. జాతీయ మైనార్టీ కమిషన్‌లో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు? |
| జ: 5 |
| 26. మైనార్టీలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగ అవకాశాల్లో 15% రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? |
| జ: రంగనాథ్ మిశ్రా |
| 27. 1978లో మైనారిటీ కమిషన్‌ను ఎలా ఏర్పాటు చేశారు? |
| జ: కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వు ద్వారా |
| 28. ఐ.రా.స. మానవహక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? |
| జ: 1946 |
| 29. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలో వెనుకబడిన తరగతుల ప్రస్తావన ఉంది? |
| జ: 340 |
| 30. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులను తొలగించే అధికారం ఎవరికి ఉంది? |
| జ: రాష్ట్రపతికి |
| 31. కేంద్రంలో స్త్రీ సంక్షేమ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| జ: 1985 |
| 32. గ్రామీణ మహిళలు, పిల్లల అభివృద్ధికి 'డ్వాక్రా' పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం? |
| జ: ఇందిరా గాంధీ ప్రభుత్వం |
| 33. మహిళా సంక్షేమంతో సంబంధం ఉన్న నిబంధన ఏది? |
| 1) 15 2) 23 3) 42 4) పైవన్నీ |
| జ: పైవన్నీ |