|
1. 2001 - 02తో పోలిస్తే
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని సహకార సంఘాల సంఖ్య - |
జ: తగ్గింది |
2. ఆంధ్రప్రదేశ్‌లో సహకార
రంగాల వ్యవస్థీకరణ ఎన్ని అంచెల్లో ఉంది? |
జ: 3 |
3. 2001లో ఆంధ్రప్రదేశ్ సహకార
చట్టానికి చేసిన సవరణలు? |
జ: 42 |
4. పరస్పర సహాయ సహకార సంఘాల
చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఆమోదించిన సంవత్సరం? |
జ: 1995 |
5. రాష్ట్రంలో అమల్లో ఉన్న
ఇంటిగ్రేటెడ్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ధ్యేయాలు? |
1) ప్రత్యేక బ్యాంకింగ్ కౌంటర్ల ఏర్పాటుకు ఆర్థిక
సహాయం |
2) వ్యవసాయ రంగంలో స్టోరేజి సదుపాయాలు ఏర్పాటు చేయడం |
3) భూములను కొనుగోలు
చేయడం |
4) 1, 3 |
జ: 4 (ప్రత్యేక బ్యాంకింగ్
కౌంటర్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం, భూముల కొనుగోలు చేయడం) |
6. భారతదేశంలో సహకార
వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు? |
జ: నవంబరు 14 నుంచి |
7. కిందివాటిలో ఎ.పి.
మార్క్‌ఫెడ్ ధ్యేయం కానిది ఏది? |
1) వ్యవసాయ ఉత్పత్తుల
సేకరణ
2) వ్యవసాయ పనిముట్లు, ఎరువులు కొనుగోలు చేయడం |
3) వ్యవసాయ
రుణాలివ్వడం
4) ఏదీకాదు |
జ: వ్యవసాయ రుణాలివ్వడం |
8. సహకార చట్టం మొదట
భారతదేశంలో ఎప్పుడు ఏర్పడింది? |
జ: 1904 |
9. సహకార చట్టం ప్రధాన
ఉద్దేశం? |
జ: వడ్డీ వ్యాపారస్తుల
ప్రాబల్యం తగ్గించి రైతులను ఆదుకోవడం |
10. సహకార పరపతి వికేంద్రీకరణ
ఎన్ని అంచెల విధానంగా ఉంది? |
జ: 3 |
11. రాష్ట్ర సహకార బ్యాంకు
విధి ఏమిటి? |
1) డీసీసీబీలకు నిధులను అందిస్తుంది |
2) నాబార్డు ద్వారా 50 నుంచి 90 శాతం వరకు నిధులు
సమకూరుస్తుంది |
3) ఆర్‌బీఐ నుంచి నేరుగా రుణ సౌకర్యం పొందుతుంది |
4) పైవన్నీ |
జ: 4 ( పైవన్నీ) |
12. జిల్లా కేంద్ర సహకార
బ్యాంకు - |
జ: ప్రాథమిక వ్యవసాయ సహకార
సంఘానికి, రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘానికీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. |
13. ఎక్కువ సంఖ్యలో ప్రాథమిక
వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మూతపడటానికి కారణం ఏమిటి? |
జ: బాకీల వసూళ్లు
ప్రతిబంధకంగా మారడం |
14. సహకార, వ్యవసాయ
గ్రామీణాభివృద్ధి బ్యాంకులను మొదట్లో ఏమని పిలిచేవారు? |
జ: భూమి అభివృద్ధి బ్యాంకులు |
15. సహకార పత్రికను
స్థాపించినదెవరు? |
జ: బి. పట్టాబి సీతారామయ్య |
16. మొత్తం వ్యవసాయ రంగానికి
అందుతున్న పరపతుల్లో సహకార సంఘాల వాటా? |
జ: 19.68% |
17. సకాలంలో రుణాలను తిరిగి
చెల్లించిన రైతులకు సహకార శాఖ ప్రకటించిన వడ్డీ రాయితీ ఎంత? |
జ: 6% |
18. వ్యవసాయ పరపతికి
సంబంధించి లీడ్ బ్యాంక్ విధానం ద్వారా ప్రాంతీయ దృక్పథం ఏర్పాటు చేయాలని
సూచించిన కమిటీ ఏది? |
జ: నారీమన్ కమిటీ |
19. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల
నిబంధనల చట్టం - 1964 అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు ఏవి? |
1) 1932 మద్రాస్ కో - ఆపరేటివ్ సొసైటీ
చట్టం 2) 1952
హైదరాబాదు కో - ఆపరేటివ్ సొసైటీ చట్టం |
3) 1,
2
4) ఏదీకాదు |
జ: 3 ( 1932 మద్రాస్ కో -
ఆపరేటివ్ సొసైటీ చట్టం, 1952 హైదరాబాదు కో - ఆపరేటివ్ సొసైటీ చట్టం) |
20. వ్యవసాయ రంగానికి అత్యధిక
పరపతులు అందిస్తున్న బ్యాంకులు వరుసగా? |
జ: వాణిజ్య బ్యాంకులు, సహకార
బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు |
21. ''గ్రామీణ పరపతి విస్తరణ
జరిగేలా సహకార ఉద్యమం తప్పని సరిగా జరగాలి, ఒకవేళ సహకార రంగం విఫలమైతే గ్రామీణ
భారతదేశం అనే గొప్ప ఆశ కూడా విఫలమవుతుంది." అని చెప్పింది - |
జ: రాయల్ కమిషన్ |
22. ప్రజల్లో బ్యాంకింగ్
అలవాట్లను పెంపొందించడానికి 1968లో ఎవరి ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో పరపతి
సౌకర్యాలు అందించడానికి అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు? |
జ: గాడ్గిల్ |
23. కిందివాటిలో వైద్యనాథన్
సిఫారసులకు సంబంధించినవి? |
కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ |
ప్రాథమిక సంఘాలకు అధిక నిధులు సమకూర్చడం |
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్
వ్యవస్థీకరణ |
జ: ప్రాథమిక వ్యవసాయ సహకార
సంఘాల పునర్ వ్యవస్థీకరణ |
24. ఆంధ్రప్రదేశ్‌లో సహకార
బ్యాంకింగ్ వ్యవస్థ 1918 డిసెంబరు 2న ప్రారంభమైందని ఎలా చెప్పవచ్చు? |
జ: విజయవాడలో కో - ఆపరేటివ్
సెంట్రల్ బ్యాంకు 1918లో స్థాపించడం |
25. రాష్ట్రంలో ప్రస్తుతం
ఉన్న ప్రాథమిక సహకార సంఘాల సంఖ్య? |
జ: 2940 |
26. ఆప్కాబ్ ఆధ్వర్యంలో పని
చేస్తున్న జిల్లా సహకార బ్యాంకుల సంఖ్య? |
జ: 22 |
27. నాబార్డు నేరుగా ఎవరికి
అప్పు ఇస్తుంది? |
1)
చిన్నరైతులకు 2)
గ్రామ చేతిపని
వారికి 3)
చిన్న
వ్యాపారులకు
4) ఏదీకాదు |
జ: ఏదీకాదు |
28. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు
రుణ సహాయం అందిస్తున్న సంస్థలు ఏవి? |
1) వాణిజ్య
బ్యాంకులు
2) ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు |
3) 1,
2
4) ఏదీకాదు |
జ: ఏదీకాదు |
29. వ్యవసాయ రుణాలు
అందించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం? |
జ: ప్రథమ |
30. నాబార్డు ప్రత్యేకత
ఏమిటి? |
1) ఇది జాతీయ స్థాయిలో వ్యవసాయ, గ్రామీణభివృద్ధికి తోడ్పడే
అపెక్స్ బ్యాంకు |
2) వ్యవసాయ పరపతిని ఇచ్చే బ్యాంకులకు రీఫైనాన్స్ చేయడం |
3) 1, 2 |
4) ఆర్‌బీఐకి రుణాలిస్తుంది. |
జ: 3 (ఇది జాతీయ స్థాయిలో
వ్యవసాయ, గ్రామీణభివృద్ధికి తోడ్పడే అపెక్స్ బ్యాంకు, వ్యవసాయ పరపతిని ఇచ్చే
బ్యాంకులకు రీఫైనాన్స్ చేయడం) |
31. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న
గ్రామీణ బ్యాంకుల శాఖలు? |
జ: 2829 |
32. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ
పరపతి కోసం సహకార రంగంలో ఏర్పాటు చేసిన బ్యాంకు? |
జ: ఆంధ్రప్రదేశ్ కో -
ఆపరేటివ్ బ్యాంకు |
33. గ్రామస్థాయిలో ఉండే సహకార
బ్యాంకులను ఏమంటారు? |
జ: ప్రైమరీ అగ్రికల్చరల్ కో -
ఆపరేటివ్ సొసైటీలు |
34. మూడంచెల సహకార పరపతి
వ్యవస్థలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన బ్యాంకు? |
జ: జిల్లా కో - ఆపరేటివ్
కేంద్ర బ్యాంకు |
35. మద్రాసు ప్రొవెన్షియల్ కో
ఆపరేటివ్ యూనియన్‌కు 1926లో అధ్యక్షుడిగా పనిచేసినదెవరు? |
జ: రామదాసు పంతులు |