రైతు ఉద్యమాలు - కుల ఉద్యమాలు



 

1. బెంగాల్‌లో కౌలుదార్ల చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
జ: 1883

2. దక్కన్ రైతుల తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది?
జ: వడ్డీ వ్యాపారస్తులకు

3. శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
జ: కారన్ వాలిస్

4. బ్రిటిష్‌వారు ఏకపక్ష స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
జ: 1813

5. 19వ శతాబ్దంలో చెలరేగిన రైతు ఉద్యమాలన్నిటిలో అత్యంత ముఖ్యమైంది?
జ: నీలిమందు రైతుల తిరుగుబాటు

6. నీలిమందు రైతుల తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
జ: బెంగాల్ 

7. దీనబంధు మిత్ర ప్రసిద్ధ నాటకం?
జ: నీల్ దర్పన్

8. నీలిమందు కమిషన్ సంవత్సరంలో ఏర్పాటైంది?
జ: 1860

9. పాబ్నా రైతుల ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
జ: తూర్పుబెంగాల్

10. బెంగాల్ కౌలుదార్ల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1883

11. 1879లో మహారాష్ట్రలో రామోషీ పేద రైతులు ఎవరి నాయకత్వంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు?
జ: వాసుదేవ బల్వంతపాడ్కే

12. మోప్లా రైతు తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
జ: కేరళ

13. మోప్లా రైతులు మతస్థులు?
జ: ముస్లిం 

14. గాంధీజీ చేపట్టిన ఉద్యమంలో రైతులు ఎక్కువగా పాల్గొన్నారు?
జ: సహాయ నిరాకరణోద్యమం