| 1. 'బ్రిటిష్ పాలన, భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర' అని వ్యాఖ్యానించింది ఎవరు? |
| జ: దాదాభాయ్ నౌరోజీ |
| 2. బ్రిటిష్‌వారు చేసిన ఏ చట్టాన్ని 'నవ్వుతూ చేసిన మోసం'గా మితవాదులు అభివర్ణించారు? |
| జ: 1892 చట్టం |
| 3. 'ఇండియా విన్స్ ఫ్రీడం' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: మౌలానా అబుల్‌కలాం అజాద్ |
| 4. 'దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ'ని స్థాపించింది ఎవరు? |
| జ: మహదేవ గోవిందరనడే |
| 5. 'బాంబే క్రానికల్' స్థాపకుడెవరు? |
| జ: ఫిరోజ్‌షా మెహతా |
| 6. 'గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా' అనే బిరుదు ఎవరిది? |
| జ: దాదాభాయ్ నౌరోజీ |
| 7. 'ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: వి.డి. సావర్కర్ |
| 8. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? |
| జ: సరోజినీనాయుడు |
| 9. భారత జాతీయ కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాక వర్గ ప్రాతినిథ్య సంస్థ అని వర్ణించిందెవరు? |
| జ: లార్డ్ డఫ్రిన్ |
| 10. 'ఇండియన్ అసోసియేషన్'ను స్థాపించిందెవరు? |
| జ: సురేంద్రనాథ్ బెనర్జీ |
| 11. 'పోరాడితేగానీ రాజకీయ హక్కులు లభించవు' అని పేర్కొన్నదెవరు? |
| జ: బాలగంగాధర తిలక్ |
| 12. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? |
| జ: 1905 |
| 13. 'విభజించి పాలించు' సూత్రాన్ని పాటించిందెవరు? |
| జ: లార్డ్ కర్జన్ |
| 14. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమమేది? |
| జ: వందేమాతర ఉద్యమం |
| 15. 'గీతా రహస్యం' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: బాలగంగాధర తిలక్ |
| 16. 'వందేమాతరం' గీతాన్ని రచించిందెవరు? |
| జ: బంకించంద్ర ఛటోపాధ్యాయ |
| 17. 'స్వరాజ్యం నా జన్మహక్కు' అని చాటిందెవరు? |
| జ: బాలగంగాధర తిలక్ |
| 18 'అన్‌హ్యాపీ ఇండియా' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: లాలాలజపతిరాయ్ |
| 19. 'టు ఆల్ ఫైటర్స్ ఆఫ్ ప్రీడం, వై సోషలిజం' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: జయప్రకాశ్ నారాయణ |
| 20. 'యుగాంతర్' వార్తా పత్రిక వ్యవస్థాపకుడెవరు? |
| జ: భూపేంద్రనాథ్ దత్త |
| 21. 'ఇండియన్ మిర్రర్' వార్తాపత్రిక వ్యవస్థాపకుడెవరు? |
| జ: దేవేంద్రనాథ్ టాగూర్ |
| 22. 'నీల్ దర్పణ్' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: దీనబంధుమిత్ర |
| 23. 'పంజాబ్ కేసరి' అనే బిరుదు ఎవరిది? |
| జ: లాలాలజపతిరాయ్ |
| 24. 'ఇండియా డివైడెడ్' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: రాజేంద్రప్రసాద్ |
| 25. 'భారత అశాంతి జనకుడు' అని ఎవరిని పిలుస్తారు? |
| జ: తిలక్ |
| 26. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? |
| జ: 1905 ఆగస్టు 7 |
| 27. 'అమర్ సోనార్ బంగ్లా' అనే గీతాన్ని రచించిందెవరు? |
| జ: రవీంద్రనాథ్ టాగూర్ |
| 28. 'ముస్లిం లీగ్'ను ఏర్పాటు చేసిన సంవత్సరం- |
| జ: 1906 |
| 29. 1911లో భారతదేశాన్ని సందర్శించిన బ్రిటిష్ చక్రవర్తి ఎవరు? |
| జ: జార్జి V |
| 30. 'ఇండియన్ డెమోస్థనీస్' బిరుదు ఎవరిది? |
| జ: సురేంద్రనాథ్ బెనర్జీ |
| 31. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించిన కలకత్తా విశ్వవిద్యాలయ మొదటి పట్టభద్రురాలు ఎవరు? |
| జ: కాదంబరి గంగూలి |
| 32. 'భారతదేశంలో విప్లవవాద భావాలకు పితామహుడు' అని ఎవరిని పిలుస్తారు? |
| జ: బిపిన్‌చంద్రపాల్ |
| 33. తిలక్ స్థాపించిన 'మరాఠా' పత్రిక ఏ భాషలో వెలువడింది? |
| జ: ఇంగ్లిష్ |
| 34. 1885-1905 మధ్యకాలాన్ని ఏ యుగంగా పేర్కొంటారు? |
| జ: మితవాద యుగం |
| 35. 'శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని వీపుమీద కొట్టండి కానీ, కడుపుమీద కొట్టకండి అని ప్రార్థించండి'- ఈ పిలుపునిచ్చినవారెవరు? |
| జ: దాదాభాయ్ నౌరోజీ |
| 36. రాజకీయ సన్యాసం చేసి, యోగిగా మారిన జాతీయ నాయకుడెవరు? |
| జ: అరబిందఘోష్ |
| 37. 1907-సూరత్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? |
| జ: రాస్ బిహారీ బోస్ |
| 38. 1904లో 'అభినవ భారత్' అనే విప్లవ సంఘాన్ని స్థాపించిందెవరు? |
| జ: దామోదర్ సావర్కర్ |
| 39. నాసిక్ హత్యకేసులో ప్రధాన నిందితుడెవరు? |
| జ: దామోదర్ సావర్కర్ |
| 40. 1902లో బెంగాల్‌లో 'అనుశీలత సమితి'ని ఏర్పాటు చేసిందెవరు? |
| జ: ప్రమతామిత్రా |
| 41. 'బెంగాల్ డాంటన్' అని ఎవరిని కీర్తించారు? |
| జ: బిపిన్ చంద్రపాల్ |
| 42. 'ది డివైన్ లైఫ్' గ్రంథ రచయిత ఎవరు? |
| జ: అరబిందఘోష్ |
| 43. 'లోకమాన్య' అనే బిరుదు ఎవరిది? |
| జ: బాలాగంగాధర తిలక్ |
| 44. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ నాయకులు 1905 అక్టోబరు 16ను ఏమని ప్రకటించారు? |
| జ: జాతీయ శోక దినం |
| 45. ముస్లింలీగ్ తొలి అధ్యక్షుడు ఎవరు? |
| జ: ఆగాఖాన్ |
| 46. ఏ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరచారు? |
| జ: 1909 చట్టం |
| 47. 'ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి' అని పేర్కొన్నదెవరు? |
| జ: లాలాలజపతిరాయ్ |
| 48. బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామన్స్‌కు దాదాభాయ్ నౌరోజీ ఏ పార్టీ టిక్కెట్ మీద ఎన్నికయ్యాడు? |
| జ: లిబరల్ పార్టీ |
| 49. 'బావిలో కప్పలాగా సంవత్సరానికి ఒకసారి బెకబెకమని అరిస్తే స్వరాజ్యం సాధించలేం' అని అన్నదెవరు? |
| జ: తిలక్ |
| 50. 'లోక్‌నాయక్' అని ఎవరిని పిలుస్తారు? |
| జ: జయప్రకాష్‌నారాయణ |