| 1. భారత రెడ్‌క్రాస్ సంస్థను ఏ సంవత్సరంలో నెలకొల్పారు? |
| జ:1920 |
| 2. 'ఆరోగ్య సర్వీసుల ఏకీకరణ' కమిటీ అని దేనికి పేరు? |
| జ: జంగల్‌వాలా కమిటీ |
| 3. భారత వైద్య పరిశోధన మండలి ఎప్పుడు ఏర్పాటైంది? |
| జ: 1911 |
| 4. భారతదేశం నుంచి పూర్తిగా ఏ వ్యాధిని నిర్మూలించినట్లు డబ్ల్యూహెచ్ఓ (WHO) ప్రకటించింది? |
| జ:మశూచి |
| 5. జనన మరణాల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? |
| జ: 1873 |
| 6. అంటువ్యాధుల చట్టాన్ని ఎప్పుడు చేశారు? |
| జ: 1897 |
| 7. 'కలరా' నివారణకు సంచార వైద్య యూనిట్లను ఏ ప్రణాళికలో ప్రారంభించారు? |
| జ: నాలుగో ప్రణాళిక |
| 8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింది ఏ సంక్షేమ పథకానికి 2013 జూన్‌లో చట్టబద్ధత కల్పించింది? |
| 1) జలప్రభ 2) బంగారుతల్లి 3) రాజీవ్ యువకిరణాలు 4) బాల కిశోరాలు |
| జ: బంగారుతల్లి |
| 9. జాతీయ పోషకాహార సంస్థను ఎక్కడ నెలకొల్పారు? |
| జ: హైదరాబాద్ |
| 10. గాంధీగ్రామ్ గ్రామీణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థను ఏ రాష్ట్రంలో స్థాపించారు? |
| జ: తమిళనాడు |
| 11. క్షయవ్యాధి నివారణకు శిక్షణా కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? |
| 1) ముంబయి 2) బెంగళూరు 3) పై రెండూ 4) ఏదీకాదు |
| జ: 3 (ముంబయి, బెంగళూరు ) |
| 12. కుష్ఠుకారక బ్యాక్టీరియాను మొదట గుర్తించినవారు ఎవరు? |
| జ: హెన్‌సన్ |
| 13. జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని పరిశీలించడానికి నియమించిన కమిటీ ఏది? |
| జ: చెడ్డా కమిటీ |
| 14. ఆరోగ్యవంతుడైన శిశువు పుట్టిన వెంటనే ఉండే సాధారణ బరువు ఎంత? |
| జ: 3.0 కి.గ్రా. |
| 15. మాతాశిశు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మొదటి ఆసుపత్రి ఏది? |
| జ: డఫ్రిన్ ఆసుపత్రి |
| 16. మాతాశిశు సంక్షేమం కోసం ఉద్దేశించిన డఫ్రిన్ ఆసుపత్రిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| జ: 1885 |
| 17. 1939లో గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారు? |
| జ: కలకత్తా |
| 18. 'ప్రాణి గణాంక పితామహుడు' అని ఎవరిని అంటారు? |
| జ: జాన్ గ్రాంట్ |
| 19. ఎ.ఎన్.ఎమ్.ను విస్తరించండి. |
| జ: ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫ్స్ |
| 20. ఏటా సుమారు ఎంతమంది చిన్నారులు పోషకాహార లోపం వల్ల మృత్యువాత పడుతున్నారు? |
| జ: 13 లక్షల మంది |
| 21. శిశువు పుట్టిన తర్వాత మొదట వేసే కంటిచుక్కల్లో ఉండేరసాయనాలు ఏవి? |
| 1) సిల్వర్ నైట్రేట్ 2) టెట్రా సైక్లిన్ 3) సిల్వర్ అయోడైడ్ 4) 1, 2 |
| జ: 4 (సిల్వర్ నైట్రేట్, టెట్రా సైక్లిన్) |
| 22. ఎంతమంది జనాభాకు ఒక సాముదాయక ఆరోగ్య కార్యకర్తను నియమిస్తారు? |
| జ: 1000 |
| 23. ఏ కమిటీ ప్రతి 40 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది? |
| జ: మొదలియార్ కమిటీ |
| 24. బహుళార్థక ఆరోగ్య కార్యకర్తలను ఏ పంచవర్ష ప్రణాళికలో నియమించారు? |
| జ: అయిదో ప్రణాళిక |
| 25. క్షయ రోగులకు చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం? |
| జ: నేషనల్ రివైజ్డ్ టి.బి. కంట్రోల్ ప్రోగ్రాం |
| 26. గ్రామీణ ప్రజలకు నాణ్యతాపరమైన ఆరోగ్య సేవలు అందించడానికి 'జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్'ను ఎప్పుడు ప్రారంభించారు? |
| జ: 2005 |
| 27. జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే అంటువ్యాధులను ఏమంటారు? |
| జ: జూనోసిస్ |
| 28. గాలి ద్వారా సంక్రమించే అంటువ్యాధులు ఏవి? |
| 1) క్షయ 2) మశూచి 3) చిన్న ఆటలమ్మ 4) పైవన్నీ |
| జ: 4 (పైవన్నీ) |
| 29. అప్పుడే పుట్టిన శిశువుల కోసం ఏర్పాటు చేసిన పథకమేది? |
| జ: న్యూ బోర్న్ బేబీ కార్నర్స్ |
| 30. 'ఎన్విరాన్‌మెంటల్ హైజీన్' కమిటీ నివేదికను ఎప్పుడు ప్రచురించారు? |
| జ: 1948 |
| 31. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని 1949లో ఎక్కడ నెలకొల్పారు? |
| జ: ఢిల్లీ |
| 32. దేశంలో ఎన్ని జిల్లాల్లో ఫైలేరియాను పూర్తిగా నిర్మూలించారు? |
| జ: 250 |
| 33. జాతీయ మశూచి నిర్మూలన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? |
| జ: 1962 |
| 34. జాతీయ గాయిటర్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? |
| జ: 1962 |
| 35. కిందివాటిలో 1954లో ఆమోదించిన చట్టం ఏది? |
| 1) గాయిటర్ చట్టం 2) పార్లమెంట్ కల్తీ నివారణ చట్టం 3) క్షయవ్యాధి చట్టం 4) ఏదీకాదు |
| జ: పార్లమెంట్ కల్తీ నివారణ చట్టం |
| 36. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? |
| జ: జులై 11 |
| 37. శిశువుల్లో పుట్టుకతో వచ్చే లోపాల చికిత్సకు 2013, ఫిబ్రవరి 6న ప్రారంభించిన పథకం ఏది? |
| జ: రాష్ట్రీయ బాల స్వాస్థ్య యోజన |
| 38. ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియా వ్యాధి సంభవించే దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించింది? |
| జ: 2012, ఫిబ్రవరి 24 |
| 39. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంను ఎప్పుడు ప్రవేశపెట్టారు? |
| జ: 1985 |
| 40. 1959లో జాతీయ క్షయవ్యాధి సంస్థను ఎక్కడ నెలకొల్పారు? |
| జ: బెంగళూరు |
| 41. గర్భస్రావాలను చట్టబద్ధం చేసేందుకు వీలుగా 1964లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? |
| జ: శాంతీలాల్ షా కమిటీ |
| 42. జాతీయ అంధత్వ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించారు? |
| జ: 1976 |
| 43. జలభయ (రేబిస్) వ్యాధి దేని వల్ల వస్తుంది? |
| జ: కుక్కకాటు |
| 44. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను 2005, ఏప్రిల్ 12న ఎవరు ప్రారంభించారు? |
| జ: మన్మోహన్‌సింగ్ |
| 45. గర్భధారణ సమస్యల మూలంగా దేశంలో ఏటా ఎంతమంది మహిళలు మృతి చెందుతున్నారు? |
| జ: 56,000 |
| 46. నీటి ద్వారా సంక్రమించే అంటువ్యాధి ఏది? |
| జ: కలరా |
| 47. డబ్ల్యుహెచ్‌వో ప్రమాణాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఎంత శాతం మంది బాలురకు మాత్రమే పోషకాహారం లభిస్తోంది? |
| జ: 7% |