ఏ రాజు 108 యుద్ధాలు చేసి పాపపరిహారంగా 108 శివాలయాలు నిర్మించాడు ? - A.P. TET - తెలుగుబిట్స్


ఆలిండియా ఇండిపెండెంట్స్‌ లీగ్స్‌ ఏర్పడిన సంవత్సరం ? 
- 1928

ఏ తెలుగు ప్రతినిధి ప్రసంగాన్ని మహారాష్ట్రులు అడ్డుకున్నారు ? 
-ఆలంపల్లి వెంకటరామారావు

 చాముండీ విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలు రచించిన కవి ? 
- నన్నయ


ఉద్యోగ నియామకాల్లో స్థానాల ప్రాధాన్యం కోసం నిజం ప్రజల సంఘం స్థాపించింది ఎవరు ? 
- నిజామత్‌ జంగ్‌

నవఖండవాడ గ్రామాన్ని విరాళంగా పొందింది ? 
- పావులూరి మల్లన

అత్తిలి గ్రామాన్ని చెల్లవ్వకు దానంగా ఇచ్చిన రాజు ? 
- చాళుక్య భీముడు

1937 అక్టోబరులో ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు ఎక్కడ జరిగాయి ? 
- విజయవాడ

నాచన సోముడు ఎవరి ఆస్థానంలోనివాడు ? 
- మొదటి బుక్కరాయులు 

ఏ ఆంధ్ర మహాసభలో స్త్రీలు, చైతులు పాల్గొన్నారు ? 
- 1937, విజయవాడ మహాసభలో

హనుమకొండ రాజధానిని నిర్మించింది ? 
- పోలరాజు-2

 ఓరుగల్లు అనే రాజధానిని నిర్మించింది ? 
-రుద్రదేవుడు (ప్రతాపరుద్ర-1)

 హైదరాబాద్‌లో తెలుగు విజ్ఞాన పీఠాన్ని ఏర్పాటు చేసింది
-ఎన్‌టి రామారావు

మొట్ట మొదట ఢిల్లీ సుల్తాన్‌ సైనికులను కాకతీయులు ఎక్కడ ఓడించారు ? 
- ఉప్పరపల్లి

కాకతీయుల కాలంలో రాజోద్యోగులను ఎన్ని తరగతులుగా విభజించారు ? 
-72

 దేవాలయాల్లో పంచముల ప్రవేశాన్ని ప్రోత్సహించి, వైష్ణవ మతవ్యాప్తికి కృషిచేసింది ? 
- బ్రహ్మనాయుడు

 వైతాళిక సమితిని స్థాపించిన వారు ? 
- రావి నారాయణరెడ్డి

కమ్యూనిస్ట్‌ ఫార్టీ గిరిజన సంఘం స్థాపించి వెట్టిచాకిరీ కి వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో పోరాటం చేసింది ? 
-1959

తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడు ? 
-కె.అచ్యుతరెడ్డి

 కుల ప్రాతిపదిక, విద్యలో వెనుకబాటుతనం, వృత్తుల ఆధారంగా వెనుకబడిన తరగతులను నిర్ధారించిన కమిషన్‌ ఏది ? 
- అనంతరామన్‌ కమిషన్‌

 1947 మే 7న సికింద్రాబాద్‌లో హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజల నిజాంను ఎదుర్కొని, భారత యూనియన్‌లో చేరాలని తన ప్రసంగంలో ఉద్భోదించిన జాతీయ నాయకుడు ? 
- జయప్రకాశ్‌నారాయణ్‌

 ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది ? 
-1983

నిజాం సంస్థానంలో ఖల్సా ఆధీనంలో ఉన్న భూమి శాతం ఎంత ? 
-58%

పెద్ద మనుషులు ఒడంబడికపై సంతకం చేసిన సభ్యుల సంఖ్య ? 
- ఎనిమిది

 జోగల్‌ తంబిలోని శాతకర్ణి నాణేలు ఏ లోహంతో తయారు చేశారు ? 
-వెండి

 1857 తిరుగుబాటులో కడపప్రాంతం నుంచి పాల్గొన్న నాయకుడు ? 
- పీర్‌సాహెబ్‌

నిమ్నజాతుల చరిత్ర రాసింది ?
-జాలా రంగస్వామి

ముత్యాలశాఖ సభా భవనం ఎవరిది ? 
-దేవరాయలు-2

 ప్రతి సంవత్సరం భద్రాచలం రాముని కళ్యాణ మహోత్సవానికి కానుకలు (తలంబ్రాలు) పంపే సంప్రదాయాన్ని ఏ నిజాం ప్రవేశపెట్టాడు ? 
-నసీరుద్దౌలా

 పంచతంత్రం తెలుగులో రచించింది ? 
-దూబగుంట నారాయణ

 శ్రీనాథునికి కనకాభిషేకం చేసిన విజయనగర రాజు ఎవరు ? 
- రెండో దేవరాయులు

తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో పట్టాభిషేకం చేసుకొన్నది ? 
- అచ్యుతరాయలు

 తిలక్‌ స్వరాజ్యనిధికి తన నగలనిచ్చి, విదేశీ వస్త్రాలను త్యజించి, ఖద్దరు ధరించి జాతీయోద్యంలో పాల్గొన్న తొలి మహిళ ? 
- మాగంటి అన్నపూర్ణమ్మ

రాష్ట్రంలో ప్రాచీన శివలింగం ఎక్కడ ఉంది ? 
-గుడిమల్లం

నరపతుల కెల్ల ఘోర దానవుడు వీడు అని నిజాంపై అగ్ని ధార కురిపించింది ? 
-దాశరథి

. ఏ సంవత్సరంలో ఆంధ్ర జన సంఘం పేరు నిజాం రాజ్య ఆంధ్రజన సంఘంగా మార్చారు ?
- 1922

పాలేరు నుంచి పద్మశ్రీ వరకూ అన్న పేరుతో తన జీవిత చరిత్ర రాసుకున్నది ?
- బోయి భీమన్న

 కుతుబ్‌షాహీల కాలంలో శిస్తు వసూలుకు ప్రమాణం ? 
- సర్కార్లు (జిల్లాలు)

మహాతలవరి బిరుదుతో వ్యవహారం పొందిన ఇక్ష్వాక వంశ స్త్రీ ? 
- శాంతిశ్రీ

. ఏ రాజు 108 యుద్ధాలు చేసి పాపపరిహారంగా 108 శివాలయాలు నిర్మించాడు ? 
- విజయాధిత్యుడు

రాష్ట్ర స్థాయిలో లోక్‌దళ్‌ పార్టీని ఏర్పాటు చేసిన వారు ? 
- గౌతు లచ్చన్న

.స్వారాజ్య సంపాదన కరపత్రం ఎవరిది ? 
- లక్కరాజు బసవయ్య

 కాకతీయుల కాలంలో నియోగులు అంటే ఎవరు ? 
- గ్రామాధికారులు

. పాశ్చాత్య యాత్రికులు దేన్ని రెండో ఈజిప్ట్‌గా కీర్తించారు ? 
- గోల్కొండ

 ఆంధ్రలో జైనపంచలోహ విగ్రహాలు లభించిన ప్రదేశం ? 
- బాపట్ల

 వజ్ర కరూర్‌ బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి ? 
- అనంతపురం

స్వాతంత్య్రం లేని జీవనం జీవచ్చవం లాంటిది అని చాటి చెప్పింది ? 
- అనిబిసెంట్‌

 విద్యానాధుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ? 
- రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో

 సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించింది ఎవరు ? 
- రుద్రదేవుడు

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment