డిసెంబరు - 3
|
¤ న్యూయార్క్ టైమ్స్ రూపొందించిన '100 నోటబుల్ బుక్స్ - 2014' జాబితాలో ఆరుగురు భారత, భారత సంతతి రచయితల పుస్తకాలకు చోటు దక్కింది. » భారతీయ అమెరికన్ వైద్యుడు అతుల్ గవాందే రాసిన 'బీయింగ్ మోర్టల్ : మెడిసిన్ అండ్ వాట్ మ్యాటర్ ఇన్ ఎండ్' పుస్తకం జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. » భారత చరిత్ర పరిశోధకుడు రామచంద్ర గుహ పుస్తకం 'గాంధీ బిఫోర్ ఇండియా', దిల్లీలో జన్మించిన అఖిల్ శర్మ నవల 'ఫ్యామిలీ లైఫ్', భారత అమెరికన్ విక్రమ్‌చంద్ర 'గీక్ సబ్‌లైమ్ : ది బ్యూటీ ఆఫ్ కోడ్' అఫ్ఘాన్ యుద్ధంపై గోపాల్ శర్మ 'నో గుడ్ మెన్ అమాంగ్ లివింగ్', ఆనంద్ గిరిధర్ దాస్ 'ద ట్రూ అమెరికన్ : మర్డర్ అండ్ మెర్సీ ఇన్ టెక్సాస్' పుస్తకాలు ఈ జాబితాలో చోటు పొందాయి.
|
డిసెంబరు - 11
|
¤ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన 'ది డ్రమాటిక్ డికేడ్: ది ఇందిరా గాంధీ ఇయర్స్' పుస్తకం విడుదలైంది. పుస్తకంలో స్వాతంత్య్రానంతర భారత్‌లో ఆనాటి గందరగోళ దశ గురించి తన ఆలోచనలను వివరించారు. దేశంలో 1975లో విధించిన అత్యయికస్థితిని 'పరిహరించదగిన ఘటన' అని పుస్తకం విడుదల సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. » తన మూడు పుస్తకాల క్రమంలో 'ది డ్రమాటిక్ డికేడ్: ది ఇందిరాగాంధీ ఇయర్స్' మొదటిదని, ఇందులో 1969-1980 మధ్యకాలం గురించి ప్రస్తావించానని ప్రణబ్ పేర్కొన్నారు. రెండో పుస్తకంలో 1980-1998 మధ్య పరిస్థితులను, మూడో పుస్తకంలో 1998-2012 కాలంలో అనుభవాలను వివరిస్తానని ఆయన ప్రకటించారు. » 321 పేజీలతో కూడిన తొలి పుస్తకంలో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం, జేపీ ఎదురుదాడి, 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, కాంగ్రెస్‌లో చీలిక, 1980లో తిరిగి అధికారంలోకి రావడం లాంటి వివిధ విభాగాలున్నాయి.
|
డిసెంబరు - 12
|
¤ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ వికలాంగ మహిళ అరుణిమా సిన్హా రచించిన 'బోర్న్ అగైన్ ఆన్ ది మౌంటేన్' పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఆవిష్కరించారు. » కాలు తొలిగించిన తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా అరుణిమా గతంలో రికార్డు సృష్టించారు.¤ 'ఐయాం నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్' (నేను అలాంటి అమ్మాయిని కాదు) పేరిట అమెరికాలోని ప్రముఖ టీవీ నటి లీనా, అత్యాచార ఘటనలపై పుస్తకాన్ని రాసింది. » పదేళ్ల కిందట విద్యార్థినిగా ఉన్నపుడు తను అత్యాచారానికి గురైన విషయాన్ని ఆమె ఈ పుస్తకంలో వెల్లడించింది. » ఈ పుస్తకం అమ్మాయిల హక్కులకు సంబంధించి అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. వేసుకున్న దుస్తులు, అలవాట్లన్నీ వారి వ్యక్తిగత విషయాలని, వాటిని కారణంగా చూపి ఓ అత్యాచారాన్ని సమర్థిస్తారా...! అని లీనా సూటిగా ప్రశ్నించింది.
|
డిసెంబరు - 26
|
¤ 'ఇండియన్ బటర్ ఫ్లైస్ ఒరిగామి' పేరిట పుస్తకాన్ని కోల్‌కతకు చెందిన పీటర్ స్మెటాసెక్ రచించారు. » ఈ పుస్తకం సాయంతో ఎవరికి వారే వర్ణ సోయగంతో హొయలు పోయే సీతాకోకచిలుకలను తయారు చేసుకోవచ్చు. కాగితాన్ని నిర్దేశిత క్రమంలో మడతలు వేయడం ద్వారా చక్కటి అలంకరణ వస్తువులకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఒరిగామి కళా ప్రక్రియలో సీతాకోక చిలుకలను సృష్టించుకోవచ్చు అని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. » సీతాకోక చిలుకలు, ఇతర కీటకాల మీద విస్తృత పరిశోధనలు నిర్వహించే పీటర్ ఉత్తరాఖండ్‌లోని భీమ్‌టాల్‌లో సీతాలకోక చిలుకల పరిశోధనా కేంద్రాన్ని నడుపుతున్నారు.
|
|
|