డిసెంబరు - 2014 సదస్సులు - సమావేశాలు


డిసెంబరు - 1
¤ 'వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సదస్సు' పెరూ రాజధాని లిమాలో ప్రారంభమైంది.     » 12 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు భారత్ సహా 190 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.    »  బొగ్గు, గ్యాసోలిన్ వాడకంతో ఎదురవుతున్న నష్టాలను నివారించుకోవడంలో సభ్య దేశాలను ఒక్కతాటి పైకి తీసుకొచ్చేందుకు ఐరాస గత 20 ఏళ్లుగా సంప్రదింపులు జరుపుతోంది.    » ఇంధన సమర్థ వినియోగం, కాలుష్యాన్ని నియంత్రించడం లాంటి అంశాలపై ఆయా రంగాల వారీగా చేయాల్సిన వాటి గురించి ప్రస్తుత సదస్సులో చర్చిస్తారు.    » ఐరాస సదస్సులో భారత్ తరఫున పాల్గొంటున్న 17 మందికి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నాయకత్వం వహిస్తున్నారు.
డిసెంబరు - 7 
¤ రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, ప్రణాళిక బాధ్యతలను కల్పించే విషయంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రుల సదస్సును దిల్లీలో నిర్వహించారు.    » ప్రణాళిక సంఘానికి కొత్త రూపం ఇవ్వాలనే ప్రతిపాదనపై ఈ సదస్సులో రాష్ట్రాల నుంచి స్థూలంగా సానుకూలత వ్యక్తమైంది. అయితే దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నెలకొల్పిన 65 ఏళ్ల నాటి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసే ప్రతిపాదనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.    » పశ్చిమ్ బంగ, మిజోరాం ముఖ్యమంత్రులు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ రెండు రాష్ట్రాల నుంచి సీఎం తరఫున ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు.
డిసెంబరు - 14
¤ వాతావరణ మార్పులపై పెరూ  రాజధాని లిమాలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు.    » ఈ సదస్సులో ఓ రాజీ ముసాయిదా ఆమోదం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాల నియంత్రణ అంశంపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో 193 దేశాల ప్రతినిధులు ఈ రాజీ ముసాయిదాను ఆమోదించారు. ప్రపంచానికే పెను సవాలుగా తయారైన వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనే దిశగా వచ్చే ఏడాది ప్యారిస్‌లో జరిగే సదస్సులో సరికొత్త బృహత్తర ఒప్పందానికి ఈ రాజీ ముసాయిదా తొలి మెట్టవుతుంది.ముఖ్యాంశాలు    » భూతాపం పెరుగుదల దుష్ప్రభావానికి గురయ్యే వర్ధమాన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక చేయూతను ఇస్తాయి.    » దీనికి సంబంధించిన హామీల వివరాలను 2015 సంవత్సరంలో తొలి మూడు నెలల్లోనే ఆయా దేశాలు సమర్పిస్తాయి. ఈ మేరకు ఒక కార్యాచరణకు ఆయా దేశాలు ఆమోదం తెలిపాయి.    » ప్రస్తుతం ఇచ్చిన హామీలకు మించిన లక్ష్యాల నిర్ధారణ.    » ఆయా దేశాల హామీలు, వాగ్దానాలపై 2015 నవంబరుకు వాతావరణ మార్పులపై ఐరాస సంస్థ నివేదిక సమర్పిస్తుంది.
డిసెంబరు - 20 
¤ సత్యసాయి డీమ్డ్ విశ్వవిద్యాలయం (పుట్టపర్తి)లో అంతర్జాతీయ నానో సైన్సు సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది.