డిసెంబరు - 2014 వార్తల్లో ప్రదేశాలు


డిసెంబరు - 4 
¤ ఉత్తరప్రదేశ్‌లోని రాణీపూర్ ప్రాంతంలోని మహాసో వద్ద కాపలా లేని రైల్వేగేటును దాటుతున్న పాఠశాల వ్యాన్‌ను అజంగఢ్ నుంచి వారణాసి వెళుతున్న తమ్సా ప్యాసింజర్ రైలు ఢీకొట్టిన ఘటనలో అయిదుగురు ఎల్‌కేజీ చిన్నారులు మృతి చెందారు. 
డిసెంబరు - 7 
¤ 'పోలియోరహిత భారతదేశం' నినాదంతో రోటరీ జిల్లా 3230 ఆధ్వర్యంలో చెన్నైలోని నందనం మైదానంలో పలు కళాశాలలకు చెందిన 50 వేల మంది విద్యార్థులు జాతీయ పతాక ఆకృతిలో ఏర్పడి గిన్నిస్ రికార్డును సాధించారు. 
డిసెంబరు - 10
¤ అంతరించి పోయాయనుకున్న ఆకులాంటి ముక్కు ఉన్న గబ్బిలాన్ని కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగ బృందం గుర్తించింది.
       » ఒకప్పుడు కోలార్‌లో విస్తృతంగా కనిపించే ఈ గబ్బిలాలు 1983-85 ప్రాంతంలో ఓ వైరస్ ప్రబలడంతో చాలా వరకు మృతి చెందాయి. కొద్ది మొత్తంలో 1989 వరకు కనిపించాయి. దాని పుట్టుపుర్వోత్తరాల గురించి 1994లో శాస్త్రవేత్తలు వివరించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు అవి ఉండి ఉంటాయని అనుకుంటున్నా ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో తెలియదు.
       » తాజాగా ఉస్మానియా బృందం అధ్యయనంలో ఇవి మళ్లీ కనిపించాయి. దీనిపై ఇటీవల అంతర్జాతీయ జర్నల్ 'త్రెటెన్డ్ టాక్సా
'లో పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది.
డిసెంబరు - 13 
¤ పారిశ్రామిక దిగ్గజం హిందుజా గ్రూప్ లండన్‌లోని చరిత్రాత్మక ఓల్డ్‌వార్ హౌస్ భవంతిని 250 ఏళ్లకు లీజుపై తీసుకుంది. 1,100 గదులు ఉన్న ఈ భవంతిని 5 స్టార్ హోటల్, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లుగా మార్చాలని నిర్ణయించింది.       » బ్రిటిష్ పార్లమెంట్, ప్రధానమంత్రి నివాసానికి దగ్గరగా ఉన్న ఈ భవంతిలో 7 అంతస్తులు ఉన్నాయి.       » రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఈ బిల్డింగ్ నుంచే వ్యూహాలు రచించారు. 
డిసెంబరు - 17 
¤ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల గ్రామం దేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా అవతరించింది.       » ఈ గ్రామ జనాభా 11,334. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు శాఖలు 13. వాటిలో ప్రవాస భారతీయుల డిపాజిట్లు రూ.1000 కోట్లు. ఫలితంగా దేశంలో కెల్లా సంపన్న గ్రామంగా నిలించింది.       » ఈ గ్రామానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్ కూడా ఉంది. స్వామి వివేకానంద జయంతి (జనవరి 12)ని 'ది ధర్మాజ్ డే' గా ఇక్కడ జరుపుకుంటారు.       » గ్రామంలో 4,123 ఇళ్లు ఉంటే, అందులో భవనాలే 2,966 ఉన్నాయి.       » దాదాపు ఒక కుంటుంబం నుంచి ఒకరైనా విదేశాల్లో ఉన్నారు.       » కేరళ రూ.90,000 కోట్ల డిపాజిట్లతో దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా నిలిచింది.
డిసెంబరు - 20 
¤ పాత పట్టణాలను పునరుత్తేజితం చేసే, సంరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో వారసత్వ పట్టణాభివృద్ధి పథకాన్ని ఆరంభించాలని నిర్ణయించింది.       » మొదటి దశలో రూ.500 కోట్లతో చేపట్టే ఈ 'జాతీయ వారసత్వ పట్టణ అభివృద్ధి, పునరుత్తేజిత యోజన-హృదయ్‌'ను 12 పట్టణాల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.       » ఈ పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి; తెలంగాణలోని వరంగల్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లోని నగరాలు అమృత్‌సర్, వారణాసి, గయ, పూరీ, అజ్మీర్, వెలన్‌కన్ని, మథుర, కాంచీపురం, ద్వారక, బదామీ ఉన్నాయి.       » ఆయా పట్టణాల సంస్కృతి, మతపరమైన గుర్తింపుల రూపంలో వారసత్వ ప్రాబల్యంలో విస్తృత వైవిధ్యానికి సూచికగా వీటిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వం నిర్ణయించింది.       » ఈ పథకం కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యకళల శక్తిని వెలికితీస్తూ వారసత్వ, పర్యటక రంగంలో ఉన్న అపరిమిత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చర్యలు తీసుకుంటారు.
డిసెంబరు - 21
¤ రష్యాలోని ఉదచనయ గనుల్లో 30 వేల చిన్న వజ్రాలు పొదిగి ఉన్న అరుదైనా రాయి బయటపడింది. ఆ రాయి ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది.
       » ఆ రాయిలోని వజ్రాల గాఢత సాధారణ వజ్రపు గాఢత కంటే పదిలక్షల రెట్లు ఎక్కువగా ఉంది.
డిసెంబరు - 25
¤ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 
'వరల్డ్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంగ్రెస్ - 2018' సదస్సు నిర్వహణకు హైదరాబాద్ఎంపికైంది.
   » 
రెండేళ్లకోసారి జరిగే  సదస్సు నిర్వహణకు ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీఉంటుంది

యూరప్ దేశాలతో పోటీపడి  అవకాశాన్ని భారతదేశం దక్కించుకుంది.మన దేశంలో 
 సదస్సును ఎక్కడ నిర్వహించాలనే విషయంలో దిల్లీబెంగళూరుతోపోటీపడి హైదరాబాద్ 
 అవకాశాన్ని దక్కించుకుంది.
   » 
 సదస్సును ఆసియా ఖండంలో నిర్వహించడం ఇది రెండోసారి. 2008లోకౌలాలంపూర్‌లో  సదస్సు జరిగిందిపదేళ్ల తర్వాత 2018లో హైదరాబాద్‌లో

జరగనుంది.
   » 
ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ను 1978 నుంచి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. 2014లో మెక్సికోలో జరిగిన ఐటీ కాంగ్రెస్‌లో డిజిటల్ ప్రపంచంపైన ప్రత్యేకంగాచర్చించారు. 2016లో
బ్రెజిల్‌ లో  సదస్సు జరగనుందితర్వాత 2018లోహైదరాబాద్‌లో జరుగుతుంది.
డిసెంబరు - 26 
¤ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో హైదారాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ప్రారంభమైంది.   » కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిసెంబరు - 30
¤ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్యాలయ ప్రదేశాల్లో దిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఆరో స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు ఎనిమిదో స్థానంలో ఉండేది. స్థిరాస్తి సలహా సంస్థ సీబీఆర్ఈ ఈ విషయాన్ని వెల్లడించింది.
   » ప్రపంచంలో ఖరీదైన కార్యాలయ ఆస్తులకు సంబంధించిన మొదటి 50 స్థానాల్లో ముంబయిలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ 16వ, నారిమన్ పాయింట్ 32వ స్థానాల్లో ఉన్నాయి. లండన్‌లోని వెస్ట్ఎండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.