డిసెంబరు - 2014 మరణాలు


డిసెంబరు - 2
¤ కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర తొలి ముస్లిం ముఖ్యమంత్రి ఎ.ఆర్.అంతూలే (85) ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించారు.    » యూకేలో న్యాయ విద్యను అభ్యసించిన అంతూలే 1980 జులై నుంచి 1982 జనవరి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.    » మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.¤ అలనాటి హిందీ హాస్యనటుడు దేవేన్ వర్మ (78) పుణెలో మరణించారు.    » 1961లో వచ్చిన 'ధర్మపుత్ర' సినిమాతో నట జీవితాన్ని ప్రారంభించారు. కట్టామీటా, అంగూర్ లాంటి చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దిల్, జుదాయి, అందాజ్ అప్నా అప్నా, దిల్ తో పాగల్ హై తదితర 100కు పైగా చిత్రాల్లో నటించారు.
డిసెంబరు - 4 
¤ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయ కోవిదుడు, వామపక్ష భావజాలమున్న మేధావి, అణగారిన వర్గాల హక్కుల కోసం నిలబడిన వి.ఆర్.కృష్ణయ్యర్ కోచిలో మరణించారు.    » కృష్ణయ్యర్ 1914 నవంబరు 15న పాలక్కడ్ సమీపంలోని వైద్యనాథపురంలో ఒక సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.    » 1971 నుంచి 1973 వరకు ఆయన లా కమిషన్ సభ్యుడిగా వ్యవహరించారు. 2002లో ఆయన మాజీ న్యాయమూర్తి ఆర్.బి.సావంత్ తదితరులతో కలసి పౌర కమిటీగా ఏర్పడి గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపారు. 1987లో ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఆర్.వెంకట్రామన్ చేతిలో ఓటమి పాలయ్యారు.    » ఆయన దాదాపు 70 పుస్తకాలను రాశారు. 'వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్' ఆయన ఆత్మకథ.
డిసెంబరు - 6
¤ భారీ శరీరాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద స్థూల కాయుడిగా పేరొందిన బ్రిటన్ పౌరుడు కీత్ మార్టిన్ (44) మరణించాడు.    » 444.52 కేజీల బరువుతో ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. 
డిసెంబరు - 8
¤ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి (87) విశాఖపట్నంలో మరణించారు.
    » తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం తాలూక కొత్తపల్లిలో 1927 అక్టోబరు 10న ఈయన జన్మించారు. మనోధర్మ సంగీతంలో దిట్టగా, అన్నమయ్య కీర్తనలకు స్వరకర్తగా, సంగీత గ్రంథాల రచయితగా దేశ విదేశాల్లో ఈయన ఖ్యాతి గడించారు.
    » మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో 52 ఏళ్ల పాటు నిరాఘాటంగా సంగీత కచేరీలు చేసి అరుదైన గౌరవం దక్కించుకున్నారు.
    » ప్రఖ్యాత వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు రాసిన 200 కీర్తనలకు స్వరకల్పన చేశారు.
    » 1976లో చెన్నై శ్రీకృష్ణ గానసభ 'సంగీత చూడామనీ
', 1980లో విశాఖ మ్యూజిక్ అకాడమీ 'సంగీత కళాసాగర', 1991లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ 'సంగీత కళానిధి' బిరుదులతో సత్కరించాయి. 1986లో సంగీత నాటక అకాడమీ, 1995లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళానీరాజన, 1995లో ఉత్తర అమెరికాలోని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు 'అన్నమాచార్య విద్వన్మణి', 1999లో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక మండలి 'హంస', 2010లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం 'గౌరవ డాక్టరేట్' 2012లో కేంద్ర సంగీత నాటక అకాడమీ 'ఠాగూర్ అకాడమీ' పురస్కారాలను ఇచ్చి గౌరవించాయి.
డిసెంబరు - 15
¤ ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి (40) గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. ఈయన పూర్తి పేరు చక్రధర్.    » వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో చక్రి జన్మించారు. సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం 'బాచి', చివరి చిత్రం 'ఎర్రబస్సు'.
    » 'సత్యం' సినిమాలో పాడిన పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆయన ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. 'సింహా' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు
.
¤ తిరుపతి శాసనసభ్యుడు డాక్టర్ మన్నూరు వెంకటరమణ (67) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు
.
    » వెంకటరమణ రెండుసార్లు శాసనసభ్యుడిగా వ్యవహరించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2014లో తెదేపా తరఫున గెలుపొందారు
.
    » తుడా (TUDA - తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఆయన కొన్ని తెలుగు చలన చిత్రాల్లో కూడా నటించారు.
డిసెంబరు - 19 
¤ గాంధేయవాది, భూమి హక్కుల పోరాట యోధుడు చునీభాయ్ వైద్య (97) అనారోగ్యంతో అహ్మదాబాద్‌లో మరణించారు. ఈయన స్వాతంత్య్ర పోరాటంలోను, భూదాన్ ఉద్యమంలోను పాల్గొన్నారు.¤ తమిళనాట ప్రముఖ మ్యాగజీన్ 'ఆనంద వికటన్ ఛైర్మన్' (ఎమిరిటస్), సంపాదకుడు, ప్రముఖ పాత్రికేయుడు ఎస్.బాలసుబ్రమణియన్ (78) చెన్నైలో మరణించారు. 33 ఏళ్లుగా ఆయన ఈ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.    » ఈయన తండ్రి ఎస్.ఎస్.వాసన్ 1928లో వాసన్ పబ్లికేషన్ పేరుతో ఆనంద వికటన్‌ను ప్రారంభించారు. జెమినీ స్టూడియోనూ స్థాపించారు. ఆయన మరణం తర్వాత బాలసుబ్రమణియన్ పత్రిక, స్టూడియో బాధ్యతలను స్వీకరించి, వికటన్ గ్రూపుగా మార్చి 'ఆనంద వికటన్', 'అవళ్ వికటన్', 'జూనియర్ వికటన్' వారపత్రికలను తెచ్చారు.    » ఆనంద వికటన్ ప్రతివారం 5.80 లక్షల ప్రతులతో తమిళనాట అత్యధిక ఆదరణ పొందుతోంది.
డిసెంబరు - 22
¤ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తెలంగాణ ప్రజలకు 'కాకా'గా సుపరిచితులైన జి. వెంకటస్వామి (85 సంవత్సరాలు) హైదరాబాద్‌లో మరణించారు.
    » వెంకటస్వామి 1929 అక్టోబరు 5న హైదరాబాద్‌లో జన్మించారు
.
    » ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులైన వినోద్ రాష్ట్ర మంత్రిగా, డాక్టర్ వివేక్ ఎంపీగా పనిచేశారు
.
    » 1957లో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజక వర్గం నుంచి కాకా ఎమ్మెల్యేగా గెలుపొందారు
.
    » 1967, 1971, 1977ల్లో మెదక్ జిల్లా సిద్ధిపేట ఎంపీగా ఎన్నికయ్యారు. 1989, 1991, 1996, 2004 సంవత్సరాల్లో కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు
.
    » 1972 - 77 వరకు ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రిగా, 1978 - 82 వరకు రాష్ట్ర పౌర సరఫరాలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా, 1991 - 96 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు
.
    » కార్మికులు, పేదల అభ్యున్నతి కోసం యత్నించారు. కార్మిక సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దేశంలో తొలిసారిగా గుడిసెవాసుల సంఘాన్ని ఏర్పాటు చేశారు
.
    » తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
డిసెంబరు - 23
¤ ప్రఖ్యాత చలన చిత్ర దర్శకుడు కె.బాలచందర్ (84) చెన్నైలో కన్ను మూశారు. ఆయన పూర్తిపేరు కైలాసం బాలచందర్.
    » 1965లో ఎంజీఆర్ నటించిన 'దైవతాయ్' చిత్రానికి మాటల రచయితగా సినీరంగంలో ప్రవేశించారు. 1965లో 'నీర్ కుమిళి' చిత్రంతో దర్శకుడిగా మారారు
.
    » దక్షిణ తమిళనాడు తంజావూరు జిల్లాలోని, నన్నిలంలో 1930 జులై 9న బాలచందర్ జన్మించారు
.
    » రజినీకాంత్, కమల్‌హాసన్, సరిత, ప్రకాష్ రాజ్ లాంటి ఎందరో నటీనటులను ఆయన వెండితెరకు పరిచయం చేశారు
.
    » ఆయన దర్శకుడిగా 101 చిత్రాలను రూపొందించారు. వీటిలో సుమారు 80 తమిళ భాషా చిత్రాలే
.
    » ఎనిమిది జాతీయ పురస్కారాలను పొందారు. 1968, 1993లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. 12 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, 2 నంది అవార్డులు అందుకున్నారు. 1987లో పద్మశ్రీ, 2008లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 'జీవిత సాఫల్య పురస్కారం', 2011లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు.
డిసెంబరు - 29
¤ గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వాటి అభివృద్ధి కోసం శ్రమించిన గ్రంథాలయ ఉద్యమ గాంధీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య (88 సంవత్సరాలు) విజయవాడలో మరణించారు. ఈయన తెనాలి ప్రాంతానికి చెందినవారు.
    » గ్రంథాలయాలు, తెలుగు భాష అభివృద్ధికి తపించిన ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడిగా సుధీర్ఘ కాలం సేవలందించారు
.
    » వయోజన విద్య రచనలకు మూడు సార్లు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. బాల సాహిత్యంలో విశేష కృషికి 'బాల బంధు' గౌరవం దక్కింది.
డిసెంబరు - 30
¤ ప్రముఖ పాత్రికేయుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బి.జి.వర్గీస్ (87 సంవత్సరాలు) డెంగీ వ్యాధి సోకి గుడ్‌గావ్‌లో మరణించారు.
    » ఇండియన్ ఎక్స్ ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్ ఆంగ్లపత్రికల ఎడిటర్‌గా ఆయన పని చేశారు
.
    » వర్గీస్ 1966 నుంచి 1969 వరకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి సమాచార వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించారు. అయితే, 1975లో ఇందిరా గాంధీ అత్యయిక పరిస్థితి విధించడాన్ని ఆయన వ్యతిరేకించారు. పౌర హక్కుల రక్షణ కోసం ఆయన ఎంతో కృషి చేశారు
.
    » వాటర్స్ ఆఫ్ హోప్, ఇండియాస్ నార్త్ ఈస్ట్, ఫోర్త్ ఎస్టేట్ పుస్తకాలు రచించారు.