డిసెంబరు - 2014 దినోత్సవాలు


డిసెంబరు - 1
¤ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
డిసెంబరు - 3 
¤ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.       » ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో దిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
       » వికలాంగుల సంక్షేమం, పునరావాసానికి కృషి చేసిన హైదరాబాద్‌కు చెందిన నారా నాగేశ్వరావు (ఉత్తమ వ్యక్తిగత విభాగం), నాంచర్ల మల్లారెడ్డి (ఉత్తమ వ్యక్తిగత విభాగం), సి.హెచ్. రవిచంద్ర (రోల్ మోడల్ విభాగం)కు ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలను ప్రదానం చేశారు.
డిసెంబరు - 4 
¤ నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.       » పాకిస్థాన్ లోని కరాచీ హార్బర్‌పై భారత నౌకాదళం 1971లో విజయవంతంగా దాడులు నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
       » నౌకాదళ దినోత్సవం సందర్భంగా తూర్పు నౌకాదళం విశాఖపట్నం ఆర్.కె.బీచ్ వద్ద సాహసోపేతమైన విన్యాసాలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
       » తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని.
డిసెంబరు - 11 
¤ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు గొప్ప గౌరవం లభించింది. భారత్ నేతృత్వంలో చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఆమోదిస్తూ జూన్ 21ని 'అంతర్జాతీయ యోగా దినం'గా ప్రకటించింది.       » ఐరాసలో భారత రాయబారి అశోక్ ముఖర్జీ 'అంతర్జాతీయ యోగా దినం' తీర్మానాన్ని తాజాగా సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టారు. దీనికి 170కి పైగా దేశాలు సహప్రయోజకులుగా వ్యవహరించాయి. ఐరాస సర్వప్రతినిధి సభలో ఒక తీర్మానానికి ఇన్ని దేశాలు ప్రాయోజకత్వం వహించడం, అలాగే ఒక దేశం ప్రతిపాదించిన తీర్మానాన్ని 90 రోజులకు ముందే అమలు చేయడం కూడా ఇదే తొలిసారి.
       » 'ప్రపంచ ఆరోగ్య, విదేశీ విధానం' అజెండా కింద ఆమోదించిన ఈ తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినంగా పాటించాలని 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది.
       » యోగాను అంతర్జాతీయంగా విస్తరించాలనే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు శామ్ కె. కుటేసా అభినందించారు.
       » సూర్యుడు భూమధ్య రేఖకు దూరంగా వెళ్లే తేదీల్లో ఒకటైన జూన్ 21ని అంతర్జాతీయ యోగాదినంగా పాటించాలని మోదీ గతంలో సూచించారు. 
డిసెంబరు - 14
¤ జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దైనందిన జీవితంలో ఇంధన పొదుపు కోసం నిండు మనసుతో కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు.       » ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

డిసెంబరు - 16
¤ 'విజయ్ దివస్‌'ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
       »
 1971లో పాకిస్థాన్‌పై యుద్ధ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న 'విజయ్ దివస్‌'ను నిర్వహిస్తారు. ఈ యుద్ధ ఫలితంగానే బంగ్లాదేశ్ ఏర్పడింది.