డిసెంబరు - 1
|
¤ ఎయిర్ మార్షల్ జగ్‌జీత్ సింగ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా నాగపూర్ లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. » ఎయిర్ మార్షల్ పి. కనక్ రాజ్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
|
డిసెంబరు - 2
|
¤ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా (ఎ.కె.సిన్హా) నియమితులయ్యారు. 1979 బ్యాచ్‌కు చెందిన బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఈయన పదవీ కాలం రెండేళ్లు. » ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిన్హా పేరును ఖరారు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, లోక్‌సభలో పెద్ద విపక్ష పార్టీ (కాంగ్రెస్) నేత మల్లిఖార్జున్ ఖర్గే ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. » 2జీ కుంభకోణం కేసు దర్యాప్తులో వివాదాస్పద సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా పదవీ విరమణ చేశారు.
|
డిసెంబరు - 5
|
¤ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే నియమితులయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. » ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న భోస్లే ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు.
|
డిసెంబరు - 8
|
¤ కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రకాష్‌మిశ్రా దేశంలోనే పెద్ద పారామిలటరీ దళమైన సీఆర్‌పీఎఫ్‌కు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
|
డిసెంబరు - 10
|
¤ ప్రధానమంత్రితో పాటు పలువురు వీఐపీల భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధినేతగా వివేక్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. » 1989 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి వివేక్ శ్రీవాస్తవను ఎస్పీజీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. » ఎస్పీజీ అధినేతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి కె.దుర్గా ప్రసాద్ స్థానంలో ఈ నియామకం జరిగింది. ¤ భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ (46) నియామకంపై అమెరికా సెనెట్‌లో ఏకగ్రీవ నిర్ణయం జరిగింది. ఈ మేరకు అమెరికా సెనెట్ మూజువాణి ఓటుతో ఆయన పేరును ఖరారు చేసింది. » ఒక భారతీయ అమెరికన్ ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. » భారత దౌత్యాధికారి దేవయాని వీసా వివాదానికి సంబంధించిన పరిణామాలతో మార్చిలో రాజీనామా చేసిన రాయబారి న్యాన్సీ పావెల్ స్థానంలో వర్మ నియమితులయ్యారు. » అమెరికాలోని అత్యున్నత స్థాయి మేధో బృందం 'అమెరికా ప్రగతి కేంద్రం'లో ఇండియా-2020 కార్యక్రమానికి రాహుల్ వర్మ మద్దతుగా నిలిచారు. భారత్‌లో పౌర అణు ఒప్పందం ఆమోదం పొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
|
డిసెంబరు - 11
|
¤ తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణాధికారిగా డి.సాంబశివరావు నియమితులయ్యారు. » ఎం.జి.గోపాల్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
|
డిసెంబరు - 13
|
¤ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతిగా 1979 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి దినేశ్వర్ శర్మ నియమితులయ్యారు. » ఐబీ ప్రస్తుత అధినేత సయ్యద్ ఆసిఫ్ ఇబ్రహీం స్థానంలో ఈయన 2015 జనవరి 1న బాధ్యతలను స్వీకరించి, రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.¤ బ్రిటన్‌కు చెందిన అగ్రశేణి బ్యాంక్ శాంటడర్ యూకే ఛైర్‌పర్సన్‌గా భారత సంతతికి చెందిన శ్రితి వదేరా నియమితులయ్యారు. » బ్యాంక్ ప్రస్తుత ఛైర్మన్ టరెన్స్ బర్న్స్ 2015 మార్చిలో పదవీ విరమణ చేశాక, ఆమె బాధ్యతలను చేపట్టనున్నారు. » గతంలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ఆర్థిక మంత్రిత్వ శాఖలో మంత్రిగా, 2007-2009 మధ్య కాలంలో యూకే కార్మిక, వ్యాపార అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు.
|
డిసెంబరు - 15
|
¤ తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా తెరాస పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని నియమించారు. ఈయన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు.
|
డిసెంబరు - 17
|
¤ తెలంగాణ రాష్ట్ర తొలి పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఛైర్మన్‌గా ఆచార్య ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. » తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త మతీనుద్దీన్ ఖాద్రీలను పాలకమండలి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » వీరు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
|
డిసెంబరు - 20
|
¤ భారత గూఢచార సంస్థ 'రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ - రా' అధిపతిగా ప్రభుత్వం రాజిందర్ ఖన్నాను నియమించింది. ప్రస్తుతం ఆయన 'రా' ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.¤ హోంశాఖలోని ప్రత్యేక కార్యదర్శి ప్రకాశ్ మిశ్రాను ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది.
|
డిసెంబరు - 24
|
¤ కోల్ ఇండియా సీఎండీగా ఎస్.భట్టాచార్య నియమితులయ్యారు. ఆరు నెలల తర్వాత కోల్ ఇండియాకు పూర్తి స్థాయి సీఎండీని నియమించారు. గత మేలో నర్సింగ్‌రావు రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
|
డిసెంబరు - 27
|
¤ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ లింగాల నర్సింహ రెడ్డి పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమితులయ్యారు. » భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నియామకానికి ఆమోదముద్ర వేశారు. » జస్టిస్ నర్సింహారెడ్డి 1953లో వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో జన్మించారు. 2001 సెప్టెంబరు 10న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2002, జులై 31న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. » 2014 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. |
డిసెంబరు - 30
|
¤ సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరు నడిమట్ల శ్రీధర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. » సింగరేణి ప్రస్తుత సీఎండీ సుతీర్థ భట్టాచార్య కోల్ ఇండియా ఛైర్మన్‌గా ఎంపిక కావడంతో ఆయన స్థానంలో శ్రీధర్‌ను నియమించింది. |
డిసెంబరు - 31
|
¤ రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌గా ఎ.కె.మిత్తల్ నియమితులయ్యారు. |
|
|