డిసెంబరు - 2014 అవార్డులు


డిసెంబరు - 11 
¤ '2014 - చైనా శాంతి బహుమతి' క్యూబా కమ్యూనిస్టు దిగ్గజం ఫిడెల్ క్యాస్ట్రోకు లభించింది.      » నోబెల్ శాంతి పురస్కారానికి సమాంతరంగా 2010 నుంచి 'కన్ఫ్యూసియస్ శాంతి బహుమతి' పేరుతో దీన్ని ప్రకటిస్తున్నారు. 
డిసెంబరు - 12 
¤ వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న 'ఆరోగ్య శ్రీ' హెల్త్ కేర్ ట్రస్ట్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.      » వివిధ వర్గాలకు అందిస్తున్న వైద్య సేవల నేపథ్యంలో 2013-14 సంవత్సరానికి 'సీఎస్ఐ-నిహిలెంట్ ఈ గవర్నెన్స్ సస్టెయిన్‌బిలిటీ' అవార్డును 'ఆరోగ్య శ్రీ' హెల్త్ కేర్ ట్రస్ట్ గెలుచుకుంది. 
డిసెంబరు - 17 
¤ కృష్ణాజిల్లా గుడివాడ ఏఎన్నార్ జూనియర్ కళాశాలలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.      » శాస్త్రసాంకేతిక రంగంలో డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి; చట్టం, న్యాయం అంశంలో జస్టిస్ ఎస్.పర్వతరావు; సమాజ అభ్యున్నతిలో ఐఏఎస్ అధికారి సంపత్‌కుమార్; విద్యారంగంలో ఎం.ఎన్.రావు; చలన చిత్ర విభాగంలో కె.రాఘవేంద్రరావు; రంగస్థలంలో గుమ్మడి గోపాలకృష్ణ; వైద్య సేవల్లో డాక్టర్ ఎం.గోపీచంద్; సామాజిక సేవలో వంశీరామరాజు; క్రీడల విభాగంలో వెన్నం జ్యోతి సురేఖకు అవార్డులు ప్రదానం చేశారు.      » అక్కినేని ఫౌండేషన్ ఛైర్మన్ తోటకూర ప్రసాద్.
డిసెంబరు - 19 
¤ కేంద్ర సాహిత్య అకాడమీ దిల్లీలో 22 భాషల్లో పురస్కారాలను ప్రకటించింది. తెలుగులో 'మన నవలలు - మన కథానికలు' రచనకు ప్రముఖ తెలుగు రచయిత, విమర్శకుడు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ఉత్తమ విమర్శకుడిగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.      » ఆయన కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులుగా పని చేస్తున్నారు.      » ఈ పురస్కారాలను మార్చి 9న ప్రదానం చేయనున్నారు. 
డిసెంబరు - 27
¤ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని హైదరాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి అమితాబ్ బచ్చన్‌కు ప్రదానం చేశారు.