డిసెంబరు - 2014 క్రీడలు


డిసెంబరు - 1
¤ అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా బంగ్లాదేశ్ బౌలర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం రికార్డు సృష్టించాడు.    » మీర్పూర్‌లో జింబాబ్వేతో జరిగిన అయిదో వన్డేలో తైజుల్ ఈ ఘనత సాధించాడు.    » అయిదు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
డిసెంబరు - 3 
¤ ముంబయిలో నిర్వహించిన దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీలో ఈస్ట్‌జోన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 24 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై విజయం సాధించింది.
డిసెంబరు - 4 
¤ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో 2015 లో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం జాతీయ సెలక్షన్ కమిటీ 30 మంది ప్రాబబుల్స్‌ను ప్రకటించింది.    » జనవరి 7న ఈ ప్రాబబుల్స్‌ను 15 మంది సభ్యుల జట్టుకు కుదిస్తారు. ఫిబ్రవరి 14న ప్రపంచకప్ ఆరంభమవుతుంది.    » ఈ 30 మంది ప్రాబబుల్స్‌లో గత ప్రపంచకప్ ఆడినవారిలో నలుగురికే చోటు దక్కడం గమనార్హం. వారు: మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్.భారత ప్రాబబుల్స్బ్యాట్స్‌మన్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, మనీష్ పాండే, మురళీ విజయ్.పేస్ బౌలర్లు: ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, షమీ, ఉమేష్, ఆరోన్, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్ని, మోహిత్ శర్మ, అశోక్ దిండా.స్పిన్నర్లు: అశ్విన్, రసూల్, కరణ్ శర్మ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.వికెట్ కీపర్లు: మహేంద్రసింగ్ ధోని, రాబిన్ ఉతప్ప, సంజు శామ్సన్, వృద్ధిమాన్ సాహా. 
డిసెంబరు - 6 
¤ బంగ్లాదేశ్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాలెంజ్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సిక్కిరెడ్డి, ప్రద్య్న గాద్రె జంట మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది.
డిసెంబరు - 13 
¤ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఓటమి పొందింది.    » భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 256 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా తొలి టెస్టులో మరే ఆటగాడు ఇన్ని పరుగులు చేయలేదు.¤ తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టు 39 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.    » సానియా మీర్జా, రోహన్ బోపన్న, మోన్‌ఫిల్స్, అనా ఇవనోవిచ్, సెడ్రిక్ పియోలిన్, రోజర్ ఫెదరర్, పీట్ సంప్రాస్, ఫాబ్రిక్ సాంతోరో ఇండియన్ ఏసెస్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. 
డిసెంబరు - 15
¤ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి లండన్ క్లాసిక్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
    » ఆరుగురు ఆటగాళ్ల రౌండ్ రాబిన్ టోర్నీలో తొలి నాలుగు గేమ్‌లనూ డ్రాగా ముగించిన ఆనంద్ తప్పక గెలవాల్సిన చివరి గేమ్‌లో బ్రిటిష్ గ్రాండ్ మాస్టర్ మైకేల్ ఆడమ్స్‌ను ఓడించడం ద్వారా విజేతగా నిలిచాడు. ఈ విజయానికి 3 పాయింట్లు, నాలుగు డ్రాలకు ఒక్కోపాయింట్ చొప్పున ఆనంద్ మొత్తం ఏడు పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు.
డిసెంబరు - 17 
¤ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని తిరస్కరించిన భారత బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఏడాదిపాటు నిషేధం విధించింది. ఇందుకు మద్దతుగా నిలిచిన భారత బాక్సింగ్ జట్టు విదేశీ కోచ్ ఫెర్నాండెజ్‌ను రెండేళ్లు నిషేధించింది.
    » ఆమెపై 100 స్విస్ ఫ్రాంక్‌ల జరిమానాను కూడా 
విధించింది.
డిసెంబరు - 18
¤ క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్ 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ ప్రపంచ కప్ ఫైనల్ జరగనుండటం అయిదోసారి. ఈ టోర్నీని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్వహించనుంది.    » 2017 మహిళల వన్డే ప్రపంచ కప్‌కు కూడా ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ టోర్నీ ఫైనల్‌ను కూడా లార్డ్స్‌లోనే నిర్వహించనున్నారు.    » 2017 పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక కూడా ఇంగ్లండే.¤ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఇచ్చే 'ప్రపంచ ఛాంపియన్ అవార్డు - 2014'ను టెన్నిస్ తారలు నొవాక్ జకోవిచ్, సెరెనా విలియమ్స్ గెలుచుకున్నారు.    » ఈ పురస్కారం అందుకోవడం జకోవిచ్‌కు ఇది నాలుగోసారి.
డిసెంబరు - 20 

¤ బ్రిస్బేన్‌లో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది.
    » మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్మిత్, ఆస్ట్రేలియా.
¤ 'కబడ్డీ ప్రపంచకప్ - 2014' విజేతలుగా భారత పురుషుల, మహిళల జట్లు నిలిచాయి. బాదల్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల జట్టు 45-42తో పాకిస్థాన్‌ను, మహిళల జట్టు 36-27తో న్యూజిలాండ్‌ను ఫైనల్లో ఓడించి వరుసగా పురుషుల జట్టు అయిదోసారి, మహిళల జట్టు నాలుగోసారి విజేతలుగా నిలిచాయి.¤ ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభ టైటిల్‌ను అట్లెటికొ డి కోల్‌కత కైవసం చేసుకుంది. ఫైనల్లో 1-0 తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది.    » ఫైనల్ మ్యాచ్‌ను ముంబయిలో నిర్వహించారు.    » కోల్‌కత జట్టు యజమాని సౌరవ్ గంగూలి. కేరళ జట్టు యజమాని సచిన్ టెండుల్కర్.
డిసెంబరు - 21
¤ వెస్టిండిస్ వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా పేసర్ జాసన్ హోల్డర్ నియమితుడయ్యాడు. ప్రస్తుత వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్న డ్వేన్ బ్రావో స్థానంలో ఈ నియామకం జరిగింది.
¤ స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు క్లబ్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది
.

    »
 క్లబ్ స్థాయి ఫుట్‌బాల్‌లోని అన్ని గొప్ప టైటిల్స్‌ను దక్కించుకున్న రియల్ మాడ్రిడ్ ఈ టైటిల్‌ను తొలిసారి చేజిక్కించుకుంది
.
    » మొరాకోలో జరిగిన ఫైనల్లో రియల్ మాడ్రిడ్ 2-0తో సాన్ లోరెంజో (అర్జెంటీనా)పై నెగ్గింది
.
    » ఈ ఏడాది రియల్ మాడ్రిడ్ సాధించిన నాలుగో ట్రోఫీ ఇది. ఛాంపియన్స్ లీగ్, కోఫా డెల్‌రే, యూరోపియన్ సూపర్ కప్ టైటిల్స్‌ను ఇప్పటికే గెలిచింది
.
¤ బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో చెన్‌లాంగ్ (చైనా), తాయ్ జుయింగ్ (చైనీస్ తైపీ) వరుసగా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు
.
    » ఈ టోర్నీలో భారత్‌కు చెందిన సైనా, శ్రీకాంత్ సెమీస్‌లోనే నిష్కృమించారు
.
¤ భారత్ గోల్ఫ్ క్రీడాకారుడు అర్జున్ అత్వాల్ 
దుబాయ్ఓపెన్ అంతర్జాతీయ గోల్ఫ్ టైటిల్‌ ను నెగ్గాడు.
¤ ఆసియా ల్యూజ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు శివకేశవన్ రజతం సాధించాడు
.
    » జపాన్‌లో జరిగిన ఈ పోటీలో మంచుతో కూడిన 1326 మీటర్ల ట్రాక్‌పై శివ కేశవన్ 49.934 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు
.
    » వరుసగా అయిదు వింటర్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కేశవన్‌కు మొత్తం మీద ఆసియా పోటీల్లో ఇది ఆరో పతకం
.
డిసెంబరు - 22
¤ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ 2015 వన్డే ప్రపంచ కప్ ప్రచారకర్తగా ఎంపికయ్యాడు. ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డున్న సచిన్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
    » సచిన్ ఈ బాధ్యత చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. 2011 ప్రపంచకప్ ప్రచారకర్తగా కూడా ఆయనే వ్యవహరించాడు
.
    » ప్రపంచకప్‌లో 56.95 సగటుతో అత్యధికంగా 2,278 పరుగులు చేసిన సచిన్ 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు
.
¤ అండర్ - 16 ప్రపంచ యూత్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ పసిడి పతకం సాధించింది. హంగేరీలో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత్ 3.0 - 1.0 తో టర్కీని ఓడించింది
.
¤ 2014 - 15 సంవత్సరానికి కాంట్రాక్టులు పొందే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. గ్రేడ్ - ఏ లోని ఆటగాళ్లకు బీసీసీఐ ఏడాదికి కోటి రూపాయలు చెల్లిస్తుంది. గ్రేడ్ - బి ఆటగాళ్లకు రూ.50 లక్షలు, గ్రేడ్ - సి ఆటగాళ్లకు రూ.25 లక్షలు చెల్లిస్తుంది
.
    » గ్రేడ్ - ఏ: ధోని, కోహ్లి, సురేష్ రైనా, అశ్విన్, భువనేశ్వర్
.
    » గ్రేడ్ - బి: ప్రజ్ఞాన్ ఓజా, విజయ్, ఛటేశ్వర పుజారా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, రోహిత్ శర్మ, అజింక్య రహానె, అంబటి రాయుడు, మహ్మద్ షమి
.
    » గ్రేడ్ - సి: వరుణ్ ఆరోన్, వృద్ధిమాన్ సాహా, స్టువర్ట్ బిన్నీ, పంకజ్ సింగ్, వినయ్ కుమార్, మోహిత్‌శర్మ, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, అక్షర్ పటేల్, మనోజ్ తివారీ, రాబిన్ ఉతప్ప, కర్ణ్‌శర్మ, సంజు శాంసన్, కుల్‌దీప్ యాదవ్, అమిత్ మిశ్రా, కేఎల్ రాహుల్.
డిసెంబరు - 27
¤ భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి వరుసగా రోండో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నాడు.
డిసెంబరు - 30
¤ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడు.
    » ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టు 'డ్రా' గా ముగిసిన తర్వాత ధోని తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీసీసీఐ ప్రకటించింది
.
    » 60 టెస్టుల్లో నాయకత్వం వహించిన ధోని 27 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 18 ఓడిపోగా మరో 15 డ్రా గా ముగిశాయి
.
    » కెరీర్ మొత్తం మీద 90 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ధోని 144 ఇన్నింగ్స్‌లో 4876 పరుగులు చేశాడు. సగటు 38.09. సెంచరీలు 6, అర్ధ సెంచరీలు 33 చేశాడు. అత్యధిక స్కోరు 224, క్యాచ్‌లు 256. స్టంప్‌లు 38 చేశాడు.