డిసెంబరు - 3
|
¤ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఛైర్మన్, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) బ్రెయిన్ మోనిహన్ భారత పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. » అధిక వృద్ధికి అవకాశాలున్న భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని బ్రెయిన్ ప్రకటించారు. » ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికాకు భారత్‌లోని ముంబయి, దిల్లీ, కోల్‌కత, చెన్నై, బెంగళూరులో శాఖలున్నాయి.
|
డిసెంబరు - 11
|
¤ దిల్లీలో వార్షిక సమావేశంలో భాగంగా భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. » వ్యూహాత్మక భాగస్వాముల మధ్య సహకార వృద్ధి కోసం ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ విస్తృత చర్చలు జరిపారు. » భారత్, రష్యాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేలా 2035 నాటికి భారత్‌లో రష్యా కనీసం 12 అణు రియాక్టర్లను నిర్మించనుంది. ఆధునిక హెలీకాప్టర్లనూ తయారు చేయనుంది. ఈ మేరకు ఇరు దేశాలు 20 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చమురు, గ్యాస్, రక్షణ పెట్టుబడులు, వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించే ఇతర కీలక రంగాలపై ఒప్పందం చేసుకున్నాయి.
|
డిసెంబరు - 12
|
¤ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా ప్రధాని సెర్జీ అక్సీనోవ్ భారత్‌లో పర్యటించడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో కూడా తీవ్రంగా స్పందించారు. » ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ఘటనపై భారత్ స్పందన సరిగా లేదని పెట్రో పొరొషెంకో విమర్శించారు. » రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.
|
డిసెంబరు - 19
|
¤ భారత పర్యటన నిమిత్తం దిల్లీకి వచ్చిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. |
|
|