హీలియం కనుగొన్నది మన గుంటూరులోనే...తెలుసా ?



హీలియంను ఎప్పుడు కనుగొన్నారు? ఎక్కడ కనుగొన్నారు?

- ఈ ప్రశ్నలకు చాలా మంది రకరకాల దేశాల పేర్లు చెబుతారు. 
హీలియాన్ని మన గుంటూరులోనే ఒక విదేశీ శాస్త్రవేత్త కనుగొన్నాడనే విషయం 
తెలిసిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. సరిగ్గా 1986లో ఇదే రోజున (ఆగస్టు 18వ తేదీన) 
హీలియాన్ని ప్రముఖ శాస్త్రవేత్త పియర్‌ జాన్సన్‌ కనుగొన్నాడు.

1868 ఆగస్ట్‌ 18న గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఈ గ్రహణం 

అనూహ్యంగా అసాధారణంగా దాదాపు 10 నిమిషాల సేపు ఉంది. ఆ రోజు ప్రముఖ 
శాస్త్రవేత్త పియర్‌ జాన్సన్‌ కూడా గుంటూరులోనే ఉన్నాడు. 
ప్రస్తుతం ఆర్‌ అగ్రహారంగా అందరూ పిలిచే రామచంద్రాపుర అగ్రహారం అనే ప్రాంతంలోని 
ఒక చెరువు గట్టు మీద నుంచి ఈ సూర్యగ్రహణాన్ని తిలకించాడు. 
ఈ సూర్య గ్రహణాన్ని చూసిన తర్వాతే ఆయన హీలియం వాయువు గురించి తన
 ప్రతిపాదనను ప్రపంచానికి తెలియజేశాడు. 

ఎవరీ జాన్సన్‌....?
పియర్‌ జాన్సన్‌ ప్యారిస్‌కు చెందిన వ్యక్తి. గణితం, భౌతిక శాసా్త్రలను అభ్యసించాడు. 

అదే విధంగా స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌లో ఆర్కిటెక్‌ విద్యనభ్యసించాడు. అయితే అతని 
దృష్టంతా పరిశోధనలపై ఉండేది. 

దీంతో అతను తొలిసారి ప్యారిస్‌ విడిచి 1857లో పెరూ వెళ్లారు. అక్కడ అయస్కాంత 
తరంగాలను వరుస క్రమంలో పెట్టడంలో కీలక భూమిక పోషించారు. అనంతరం 1861-62 
నుండి 1864 వరకు ఇటలీ, స్విజ్జర్లాండ్‌ దేశాల్లో సూర్య తరంగాలపై అధ్యయనం చేశారు. 

ఆ తరువాత సూర్యగ్రహణం సమయంలో సూర్యుని చుట్టూ ఉన్న వాయువులను 
కనుగొనేందుకు ఆయన మద్రాస్‌ రాషా్ట్రనికి వచ్చారు. అప్పుడు గుంటూరు జిల్లా 
ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఉంది. దీంతో సూర్యగ్రహణం గుంటూరు నుండి బాగా 
కనిపిస్తుందని ఇక్కడి శాస్త్రవేత్తలు చెప్పడంతో ఆయన 1868 ఆగస్ట్‌ నెలలో గుంటూరు 
వచ్చారు. 

ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారనేది తెలియకపోయినా ఆగస్ట్‌ 18న గుంటూరు 
నుండే సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుని చుట్టూ హీలియం వాయువు 
ఉన్నట్లు గుర్తించారు. 

హీలియం అంటే...
ఒక రంగు, రుచి, వాసన లేని హానికరంగాని తటస్థమైన, ఒకే అణువు కలిగిన రసాయనిక 

మూలకమే హీలియం. అన్ని పరిస్థితుల్లోనూ ఇది వాయువుగానే ఉండటం దీని ప్రత్యేకత.
1868లో జాన్సన్‌ గుంటూరులో సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి చుట్టూ ఒక స్పెక్ట్రమ్‌
 లైన్‌ను కనుగొన్నాడు. 

అది హీలియం మూల కణాన్ని సూచించే స్పెక్ట్రం లైన్‌. సముద్రలోతుల్లో శ్వాస పీల్చడానికి, 
బెలూన్లను ఉబ్బించడానికి, సిలికాన్‌ వెఫర్స్‌ తయారు చేయడానికి, అర్క్‌ వెల్డింగ్‌లోనూ, 
ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాల్లోనూ ఈ హీలియం వాడతారు. 

క్వాంటమ్‌ మెకానిక్స్‌ అధ్యయనం చేసే పరిశోధకులకు హీలియం ఉపయోగపడుతుంది. 

భారత దేశ కోర్టులు
భారత దేశ ఎలక్షన్ కమీషన్
మీకు తెలుసా ?
దేశాలు - మారిన పేర్లు
ప్రపంచ నగరాలు - వాడుక పేర్లు
వివిధ ప్రదేశాలు - నామాంతరాలు
ఏనుగు పిల్ల "తల్లి కడుపు" లో ఎన్ని నెలలు ఉంటుంది ?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
నరదిష్టి అనేది నిజంగా ఉందా?
ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?