ప్రపంచంలో అతి చిన్నదేశం ( శ్రీలంక కాదు ) ఏది?



    భూభాగంలో చూసినా, పాలనా యంత్రాంగంలో చూసినా ప్రపంచంలోనే అతి చిన్న 
దేశం వాటికన్‌ సిటీ. ఈ దేశపు వైశాల్యం 110 ఎకరాలు. అంటే మన దేశంలో 
ఓ భూస్వామికి ఇంత కంటే ఎక్కువే భూమి ఉంటుంది. జనాభా 800 నుండి 
850 వరకు ఉంటుంది. 


అసలు ఇంత చిన్న దేశం ఎలా ఏర్పడిందో తెలుసా? 1870 సంవత్సరంలో రోమ్‌ నగరాన్ని 
ఇటలీకి రాజధానిగా ప్రకటించారు. 

ఇది పోప్‌కు ఇష్టం లేదు. ఇటలీ రాజుకు, పోప్‌కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. 
తర్వాత ఎప్పటికో అంటే 1929 లో వారిద్దరికీ రాజీ కుదిరి, వాటికన్‌ని ప్రత్యేక దేశంగా 
ప్రకటించారు. ఇక్కడ కేథలిక్కు క్రైస్తవ మత గురువు పోప్‌ నివాసం ఉంటారు. 
ఇది ఇటలీ రాజధాని రోమ్‌ మధ్యలో ఉంటుంది. 
ఈ దేశానికి ప్రస్తుతం బెనెడిక్ట్‌ 16 పోప్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇంటి ఓనర్స్ పైన ఉండాలా? కింద ఉండాలా?
అద్దె ఇళ్ళకు వాస్తు చూడాలా?
మృత సముద్రం (Dead Sea)గురించి మీకు తెలుసా ?
నీటిలో మేకు మునుగుతుంది ఓడ తేలుతుంది ఎందుకు?
పంచ వర్ష ప్రణాలికలు
విపత్తు నిర్వహణ
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు
మహామహులు