ఆకాశంలో కనిపించే చంద్రుడి కంటే భూమి పెద్దది. మనం నివశించే భూమి కంటే
సూర్యుడు ఇంకా పెద్దగా ఉంటాడు. అయితే ఆకాశంలో మినుకు మినుకుమంటూ
కనిపించే చిన్న చిన్న నక్షత్రాలు నిజానికి సూర్యుడి కంటే పెద్దగా ఉంటాయి.
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి ఇతర గ్రాహాలు చాలా తిరుగుతుంటాయి. దీన్ని
సౌర కుటుంబం అంటారు. ఇలాంటి సౌర కుటుంబాలు పాలపుంతలో అనేకం ఉంటాయి.
ఈ పాలపుంతలో లక్షల కొద్దీ నక్షత్రాలుంటాయి. ఇవి ఒక్కొక్కటీ వందల, వేల మైళ్ల
దూరంలో ఉంటాయి.
దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. ఒక్క కాంతి సంవత్సరం
అంటే 6,000,000,000,000 మైళ్లు. కాంతి సంవత్సరం ఒక సంవత్సర కాలంలో తొమ్మిది
వందల నలభై కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
కాంతి ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు (షుమారుగా) వేగంతో ఒక సంవత్సరం పాటు శూన్యంలో
ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతి సంవత్సరము అని అంటారు
కాంతి వేగము ఒక సెకనుకు 3 లక్షల కిలో మీటర్ల లెక్కన నిముషానికి 180 లక్షక కిలోమీటర్లు,
గంటకు 108 కోట్ల కిలో మీటర్ల దూరం, రోజుకు 2592 కోట్ల కిలో మీటర్ల దూరం, సంవత్సరానికి
9 లక్షలా 50 వేల కోట్ల కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని కాంతి సంవత్సరం
అని అంటారు.
ఒక కాంతి సంవత్సరం వీటితో సమానం:
9,460,730,472,580.800 కి.మీ
5,878,625,373,183.61 మైళ్ళు
63,241 అంతరిక్షమానాలు "Astronomical Units (AU)
ఇతర కాంతి సంవత్సరాలు
సంవత్సరం : విధము | సంవత్సరం (రోజులు) | కాంతి సంవత్సరం (కి.మీ.) | కాంతి సంవత్సరం (మైళ్ళు) |
---|---|---|---|
జూలియన్ సంవత్సరం (IAU) | 365.25 | 9,460,730,472,580,800 | 5,878,625,373,184 |
గ్రెగోరియన్ సంవత్సరం | 365.2425 | 9,460,536,207,068,020 | 5,878,504,662,190 |
1900.0 సగటు అక్షాంశ సంవత్సరం (ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ల ఆధారంగా) | 365.242198781 | 9.460 528 404 88×1015 | 5,878,499,814,135 |
2000.0 సగటు అక్షాంశ సంవత్సరం | 365.242190419[2] | 9.460 528 188 28×1015 | 5,878,499,679,546 |
మనిషి ముఖాన్ని చూసి అతని మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చా ? |
మనిషి ఎప్పుడు చనిపోయాడో లెక్కించే 'సూక్ష్మ' గడియారం! |
నాట్యమాడే ఉపగ్రహాలు మీకు తెలుసా? |
పుట్టగొడుగుల (మష్రూమ్) ఉత్పత్తి |
పేపర్ నాప్కిన్స్ తయారి పరిశ్రమ ...? |
మంగళవారం పనిని మొదలు పెట్టకూడదా? |
నిద్ర లేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభప్రధం అవుతుంది |