భారతదేశ ప్రధానమంత్రుల్లో లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన 'విశ్వాసతీర్మానం' సమయంలో తనకు తాను ఓటు వేసుకోలేకపోయిన ప్రధానమంత్రి? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





అనేక రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన, నియంత్రణకు సంబంధించిన పత్యేక నిబంధనలు భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్‌లో ఉన్నాయి?
జ: అయిదవ

 అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధన ఏది?
జ: నిబంధన- 29

 రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సాంస్కృతిక, విద్యాయపరమైన హక్కులు కల్పించారు?
జ: నిబంధనలు - 29, 30

మతం ప్రాతిపదికన భారతీయ పౌరుడికి ప్రభుత్వ పదవిని తిరస్కరిస్తే అతడికి ఏ ప్రాథమిక హక్కును లేకుండా చేసినట్లవుతుంది?
జ: సమానత్వపు హక్కు

ప్రాథమిక హక్కుల సిద్ధాంతం దేన్ని సూచిస్తుంది?
జ: పరిమిత ప్రభుత్వం

మతం లాంటి అంశాల మీద వివక్షను నిషేధించడం (భారత రాజ్యాంగం నిబంధన-15) దేని కింద వర్గీకరించిన ప్రాథమిక హక్కు?
జ: సమానత్వపు హక్కు

 భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతిభద్రతలను ఎక్కడ పేర్కొన్నారు?
జ:  రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు

 భారత రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది?
జ: గనుల్లోనూ, చమురు క్షేత్రాల్లోనూ శ్రమను, భద్రతను క్రమబద్ధం చేయడం

 భారత రాజ్యాంగం నిబంధన 164(1) ప్రకారం మూడు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి మంత్రి ఉండాలి. ఇతనే  షెడ్యూల్డ్ కులాల, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కూడా అదనపు బాధ్యతలు వహిస్తాడు. ఈ నిబంధన పరిధిలోలేని రాష్ట్రం ఏది?
జ:  పంజాబ్

భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలో ప్రతి రాష్ట్రానికి చెందిన కార్యనిర్వహణ అధికారాన్ని కేంద్ర కార్యనిర్వహణాధికారానికి భంగం కలగకుండా ఉండే నిబంధన ఏది?
జ:  నిబంధన - 257

 భారత రాజ్యాంగ నిబంధన-340 ఎవరి అభివృద్ధిని పరిశీలించడానికి, కమిషన్ నియామకానికి వీలు కల్పిస్తుంది?
జ: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు

 భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను ఏ నిబంధన ద్వారా విధిస్తారు?
జ: నిబంధన-356

 రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అంటే, ఆ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తారు?
జ: రాష్ట్ర గవర్నర్

పార్లమెంటు ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తిని మంత్రిమండలి సభ్యుడిగా నియమించవచ్చు. అయితే ఎంతకాలం లోపల పార్లమెంటు ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి?
జ: 6 నెలలు

 భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎలక్టోరల్ కాలేజిలో చేరనిది-
జ: శాసన మండలికి ఎన్నికైన సభ్యులు

 ఏ పరిస్థితుల్లో రాష్ట్రపతి స్వీయ విచక్షణ మేరకు వ్యవహరిస్తారు?
జ:  పునః పరిశీలన నిమిత్తం ఒక ప్రతిపాదనను మంత్రిమండలికి తిప్పి పంపడం

 రాష్ట్రపతి ఎన్నికలో, లోక్‌సభ సభ్యుల ఓటు విలువ-
జ: ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించే ఓట్ల సంఖ్యను బట్టి మారుతుంది

 భారతదేశ ప్రధానమంత్రుల్లో లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన 'విశ్వాసతీర్మానం' సమయంలో తనకు తాను ఓటు వేసుకోలేకపోయిన ప్రధానమంత్రి? 
జ: మన్మోహన్ సింగ్

 రిజర్వ్‌డ్ పార్లమెంటరీ స్థానాలు అత్యధికశాతం ఉన్న రాష్ట్రం-
జ:  ఉత్తరప్రదేశ్

 ఏ విధానం ద్వారా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు?
జ: ఏక బదలాయింపు ఓటు విధానం

రాజ్యసభలో గరిష్ఠంగా ఎంతమంది సభ్యులుండవచ్చు?
జ:  250

బడ్జెట్‌మీద పార్లమెంటరీ నియంత్రణకు సంబంధించి సరికానిది ఏది?
జ: బడ్జెట్ తయారీలో పార్లమెంటుకు ప్రాధాన్యం ఉండదు

 తాజా పరిశీలన కోసం వెనక్కి పంపకుండా రాష్ట్రపతి తన ఆమోదం తెలిపే బిల్లు ఏది?
జ: ఆర్థిక బిల్లు

 భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల గరిష్ఠ సంఖ్య ఎంతకు మించరాదు?
జ:  20

అతిపెద్ద పార్లమెంటరీ కమిటీ ఏది?
జ: అంచనాల కమిటీ


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment