జనరల్ నాలెడ్జ్ బిట్స్
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆర్థిక గణాంక వివరాలు సేకరించేది?జ: కేంద్ర గణాంక సంస్థ
S & P 500 అనేది దేనికి సంబంధించింది?
జ: పెద్ద కంపెనీల స్టాక్ సూచీ
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
జ: జెనీవా
ప్రపంచంలో పశుగణం అత్యధికంగా ఉన్న దేశం ఏది?
జ: భారత్
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు?
జ: బి.ఆర్. అంబేద్కర్
భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్‌కు నాయకత్వం వహించింది ఎవరు?
జ: పెతిక్ లారెన్స్
భారత రాజ్యాంగాన్ని దేని/ఎవరి ద్వారా అమల్లోకి తెచ్చారు?
జ: రాజ్యాంగ పరిషత్
రాజ్యాంగ పరిషత్ కేంద్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ
భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగబద్ధమైన సలహాదారు ఎవరు?
జ: డాక్టర్.బి.ఎన్. రావు
'భారత రాజ్యాంగపరిషత్‌ను 1946లో ప్రొవిన్షియల్ అసెంబ్లీలు ఎన్నుకున్నాయి': ఈ వాక్యం సరైనదా కాదా?
జ: సరైనదే
రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎవరు?
జ: సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆచార్య జె.బి కృపలాని, కె.ఎం.మున్షీ
స్వతంత్ర భారతదేశంలో తోలి విదేశాంగ శాఖ మంత్రి ఎవరు?
జ: లాల్‌బహదూర్ శాస్త్రి
రాజ్యాంగ పరిషత్ కార్యాలయం సలహా విభాగం ఎవరి నాయకత్వంలో 1947 అక్టోబరులో భారత రాజ్యాంగం మొదటి ముసాయిదాను సిద్ధం చేసింది?
జ: బి.ఎన్. రావ్
భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుంచి భారతీయ సమాఖ్య పథకాన్ని గ్రహించింది?
జ: కెనడా
భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగ వ్యవస్థను అనుసరిస్తుంది?
జ: యునైటెడ్ కింగ్‌డమ్
భారతీయ సమాఖ్యకు అమెరికా సమాఖ్యకు సాధారణమైన లక్షణం-
జ: రాజ్యాంగం అన్వయానికి సమాఖ్య సుప్రీంకోర్టు
పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వాస్తవమైన రాజ్యాధికారాలు ఎవరికి ఉంటాయి?
జ: ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి
లౌకికవాదం (Secularism) అంటే-
జ: ఏదైనా నిర్ణీత మత విశ్వాసానికి అనుకూలం కాని రాజకీయ, సామాజిక తత్వ విధానం
సమాఖ్య రాజ్య లక్షణం-
జ: అధికార పరిధిని అతిక్రమించకుండా కొన్ని రక్షణలతో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రాజ్యాంగం అధికారాలను విభజిస్తుంది
భారతదేశం సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఎంచుకోడానికి కారణం-
జ: భాషా, ప్రాంతీయ వైవిధ్యం
1946 డిసెంబరు 3న రాజ్యాంగ పరిషత్‌లో భారత రాజ్యాంగ ప్రవేశికకు ప్రాతిపదికైన లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినవారు ఎవరు?
జ: పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
ఏదైనా కర్మాగారం లేదా గనిలో ఉపాధి పొందడానికి కనీస వయసు ఎంత?
జ: 14 సంవత్సరాలు
భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి షరతులు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది?
జ: పార్లమెంటు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment