సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ఎప్పుడు ప్రారంభించారు?
(1980)
రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభమైన తేదీ?
(నవంబరు1, 2011)
గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహించేదెవరు?
(సర్పంచ్)
77వ రాజ్యాంగసవరణ చట్టం దేనికి సంబంధించినది?
(పంచాయతీలు)
ఆపరేషన్ ఫ్లడ్ పథకం దేనికి సంబంధించినది?
(పాలు)
రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణం అందించడానికి ప్రారంభించిన పథకం?
(స్త్రీనిధి)
ఏకగవాక్ష పద్ధతి(సింగిల్ విండో విధానం)ని ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు?
(ఎన్టీరామారావు)
సీతాఫలాలు ఎక్కువగా ఏ జిల్లాలో పండుతాయి?
(మహబూబ్‌నగర్)
2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న జిల్లా?
(రంగారెడ్డి)
2011 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అధిక అక్షరాస్యత ఉన్న జిల్లా?
(హైదరాబాద్)
ఉపాధి హామీ పథకాన్ని తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు?
(మహారాష్ట్ర)
ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం ఎప్పుడు ప్రారంభించారు?
(1976)
తేనె టీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?
(ఎపికల్చర్)
రాష్ట్రంలో 108 సర్వీసులను ప్రారంభించిన సంవత్సరం?
(2005)
2011లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న జిల్లా?
(చిత్తూరు)
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ దేని నుంచి వెలువడుతుంది?
(నీరు)
కిరణజన్య సంయోగక్రియ జరిగే కణాంగం ఏది?
(హరితరేణువు)
రాత్రి సమయంలో మొక్కల నుంచి ఏ వాయువు వెలువడుతుంది?
(కార్బన్ డై ఆక్సైడ్)
శ్వాసక్రియలో భాగంగా అన్ని జీవులు విడుదల చేసే వాయువు ఏది?
(కార్బన్ డై ఆక్సైడ్)
కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే ఆహార పదార్థాలు ఏవి?
(కార్బోహైడ్రేట్లు)
పొలంబడి పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
(తూర్పు గోదావరి)
రైత్వారీ విధానం ప్రవేశపెట్టినదెవరు?
( థామస్ మన్రో)
. ఆంధ్రప్రదేశ్‌కు అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న పన్ను ఏది?
( అమ్మకం పన్ను)
జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?
(హైదరాబాద్)
రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ పథకాన్ని 2004లో ఏ జిల్లాలో ప్రారంభించారు?
(గుంటూరు)
రాజీవ్ యువకిరణాలు పథకం ఎప్పుడు ప్రారంభించారు?
(ఆగస్టు20, 2011)
డ్వాక్రా, వెలుగు పథకాలను విలీనం చేసి ఏర్పాటు చేసిన కొత్త పథకం?
(ఇందిర క్రాంతి పథం)
ఆంధ్రప్రదేశ్‌లో భూమి హక్కుల రికార్డుల చట్టం ఎప్పుడు చేశారు?
( 1971)
సాంద్ర, వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో అమలు చేశారు?
(పశ్చిమగోదావరి)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు చట్టరూపం దాల్చింది?
(2005)
.ఓవర్ డ్రాఫ్ట్ పద్ధతిలో బ్యాంకు నిల్వ దేన్ని చూపిస్తుంది. ?
(క్రెడిట్ నిల్వ)
ఆర్థిక నివేదికలు దేనిలో అంతర్భాగాలు ?
(అకౌంటింగ్)
జంట పద్దు విధానాన్ని కనిపెట్టింది ఎవరు?
(లూకా పాసియులి)
మలి పద్దు పుస్తకాన్ని ఏమంటారు ?
(ఆవర్జా)
ఆవర్జా అంటే ఏమిటి ?
(అన్ని ఖాతాలకు సంబంధించిన సంపుటి)