భారతదేశంలో దీర్ఘకాలంగా ఇంచు మించు శూన్యంగా వున్న ప్రాంతం ఏది?- సోషల్‌ సైన్సెస్‌- డియస్సి ప్రత్యేకం



 భారతదేశంలో దీర్ఘకాలంగా ఇంచు మించు శూన్యంగా వున్న ప్రాంతం ఏది? 
- లడక్‌

 శీతాకాలపు అత్యల్ప పగటి ఉష్ణోగ్రత ఎక్కడ నమోదు అయింది?
- శ్రీనగర్‌

 పర్వత ప్రాంత శీతోష్ణస్థితి ప్రాంతం ఎచ్చట వున్నది?
- ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌లోని రాష్ట్ర
ఉత్తర భాగాలు.

 స్టెప్పీ రకపు శీతోష్ణస్థితి ప్రాంతం ఎచ్చట వున్నది? 
- రాజస్థాన్‌ తూర్పు తీర ప్రాంతం, దక్షిణ పంజాబ్‌, గుజరాత్‌లోని ఉత్తర చివరభాగం.

 ఆర్ధ్ర ఉష్ణమండల శీతోష్ణస్థితి ఎచ్చట వున్నది?
- కలకత్తా, పాట్నా. లక్నో ప్రాంతాలు.

 ఆయనరేఖ ప్రాంత అడవుల శీతోష్ణస్థితి ఎచ్చట వుంది? 
- అస్సాం, అరుణాచ ల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మహారాష్ట్రలోని పశ్చిమప్రాంతం

 వాతావరణ స్థితి అంటే ...
- రోజుకిగాని, కొన్ని దినాలకుగాని సంబంధించిన శీతోష్ణస్థితి అంశాలను సూచిస్తే దానిని వాతావరణ
 స్థితి అంటారు.

 సముద్రమట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ఏ మేరకు ఉష్ణోగ్రత తగ్గుతూ వుంటుంది?
- సముద్ర మట్టం నుండి ప్రతి వెయ్యి అడుగులకు 3.3. చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది.

ఉష్ణోగ్రత విలోమత అంటే ఏమిటి?
- ఒక్కొక్కప్పుడు భూమికి సమీపంలో వున్న గాలి చల్లగా వుండి, ఎత్తుగా వున్న ప్రదేశాల్లో 
   గాలివేడిగా వుండటాన్ని ఉష్ణోగ్రత విలోమత అంటారు.

 సమభారరేఖలు అని వేనిని అంటారు?
- సమాన వాతావరణ పీడనం వున్న ప్రదేశాలన్నింటిని కలుపుతూ గీసిన రేఖలను 
   సమభారరేఖలు అంటారు.

 సమవర్షపాత రేఖలని వేటిని అంటారు?
- సమ వర్షపాతర వున్న వివిధ ప్రాంతాలను కలిపే ఊహారేఖలను సమవర్షపాత రేఖలంటారు.

 నేల అని దేనిని పరిగణించవచ్చు?
- భూమి ఉపరితలంమీద ఉన్న పలు చని పొరను (ముఖ్యంగా 25 సెం.మీ. నుండి 
   35 సెం.మీ. నేలగా పరిగణించ వచ్చు)

 భారతదేశంలో వున్న నేలలను ఎన్ని వర్గాలుగా విభజించారు?
- ఎనిమిది. (1- ఒండ్రుమట్టినేలలు, 2-ఎడారినేలలు, 3-క్షార సంబంధ మైన (చవిటి) 
  నేలలు, 4-ఇసుక నేలలు, 5-నల్లరేగడినేలలు,6.ఎర్ర నేలలు, 7. రాతి నేలలు, 8. కొండ నేలలు.

 నేలలు అధ్యయనశాస్త్రాన్ని ఏమంటారు?
- ఐడాలజి

 గంగా, సింధూనది మైదానాలలోని నేలలను ఎన్ని రకాలుగా విభజించారు?
- నాలుగు (1- ఒండ్రుమట్టినేలలు, 2- క్షార సంబంధమైన (చవిటి)నేలలు, 3- ఎడారినేలలు,
    4-ఇసుకనేలలు)

 ఎర్రనేలలు ఎక్కడ ఎక్కువగా వున్నాయి?
- తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలోని ఆగేయ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని
    ఈశాన్య ప్రాంతం

 ఎర్రనేలలు ఏ శిలలు శిథిలం అవటం వల్ల ఏర్పడినాయి? 
- ఇన్‌-సిటా

 నల్లరేగడి నేలలు ఎచ్చట వున్నాయి?
- మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళ నాడు, ఉత్తరప్రదేశ్‌

 ఏ శిలలు శిథిలం కావటం వల్ల నల్ల రేగడి నేలలు ఏర్పడతాయి? 
- బెసాల్ట్‌

 నల్లరేగడి నేలలు ఏ పంటకు శ్రేష్టమై నవి? 
- ప్రత్తి, గోధుమ

 నల్లరేగడి నేలలు దేశం మొత్తంమీద ఎంతమేరకు వ్యాపించి వున్నవి?
- 4,46,000 చ.కి.మీ.

 భారతదేశంలో నల్లరేగడి నేల ఏ దేశపు నల్లరేగడి నేలతో సరితూగుతుంది?
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు- అరిజోనా)

 ఒండ్రునేలలు ఎచ్చట వున్నాయి?
- అస్సాం నుండి పంజాబ్‌ వరకు గంగా, సింధుమైదాన ప్రాంతంలో, తూర్పుతీర ప్రాంతంలో 
   ఎక్కువగా వున్నాయి.

 ఎర్ర రాతి నేలలు ఎక్కడ వున్నాయి?
- మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో

 అధిక స్థాయి ఎర్రరాతినేలలు ఎక్కడ వుంటాయి?
- భూగర్భంలో బాక్సైట్‌ నిల్వ వున్న ప్రదేశాలలో

 అధిక స్థాయి ఎర్రరాతినేలలు ఏ పంటకు అనువైనవి? 
- చిరుధాన్యాలు

 ఎడారి నేలలు ఎచ్చట వున్నాయి?
- ఆరావళి పర్వతాలకు సింధునది లోయకు మధ్యవున్న ప్రాంతం

 ఏ నేలలో క్షారగుణాలు అధికంగా వుంటాయి? 
- చవిటినేలల్లో

 హిమాలయ పర్వత ప్రాంతపు నేలలు ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
మూడు (1-పర్వతాలకు దిగువనున్న నేల (లేదా) టెరైనేల, 2-పర్వతాల మీద నున్న
    నేలలు, 3-సున్నపురాయి డోలమైట్‌ నేలలు)

 ముస్సోరి నైనిటాల్‌ పర్వత ప్రాంతాల్లో ఏ రకపు నేలలు వున్నాయి?
- సున్నపురాయి డోలమైట్‌ నేలలు.

నేలలో భూసారం ఎంత లోతు వరకు వుంటుంది?
- 15 సెం.మీ. నుండి 30 సెం.మీ. లోతు వరకు

 ఒండ్రునేలలు అతి తక్కువ వున్న రాష్ట్రం ఏది? 
- మధ్యప్రదేశ్‌

 చిత్తడి నేలలు ఎచ్చట గలవు?
- ఒరిస్సా తీరప్రాంతం, పశ్చిమబెంగాల్‌ లోని సుందరవన ప్రాంతం, ఉత్తర బీహార్‌, తమిళనాడు
    తీరపు ఆగేయ ప్రాంతం

మనదేశంలో మృత్తిక క్షయానికి ప్రధాన కారణం ఏమిటి?
- అధిక వర్షపాతం ఫలితంగా వచ్చే వరదలు.

 మృత్తిక క్షయం ఏ రాష్ట్రంలో ఎక్కువగా వున్నది? 
- మధ్యప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడు, 
   పంజాబ్‌, మహారాష్ట్రల లోని కొన్ని ప్రాంతాలు.

 మృత్తికక్షయం ఎన్ని రకాలుగా జరుగు తుంది? 
- రెండు. 1.పొర క్రమక్షయం, 2.గంట్ల క్రమక్షయం

 పొర క్రమక్షయం ఏఏ రాష్ట్రాలలో వున్నది? 
-అస్సాం, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌

 గంట్ల క్రమక్షయం ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా వున్నది?
- బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌

 లేట్రైట్‌ నేలలు ఎట్లు ఏర్పడతాయి?
- ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో, శిలలు శైధిల్యం చెంది ఇనుము, అల్యూమినియం హైడ్రేట్‌
   శేష పదార్ధంగా లేట్రైట్‌ నేలలు ఏర్పడతాయి.

లేట్రైట్‌ నేలలు ఏ పంటలకు అను కూలం? 
- తేయాకు, జీడిమామిడి

 భారతదేశంలో సాగవుతున్న భూమిలో ఎన్ని హెక్టార్ల భూమి కోతకు గురి అగు చున్నది?
- 110 మిలియన్‌ హెక్టార్లు

 భూసారం దేనిమీద ఆధారపడి వుంటుంది? 
- భూమిలోని వివిధ పోషక పదార్ధాల శాతం మీద