నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (ఎన్.ఎ.టి.ఒ.) లోని ఏ సభ్య దేశం 2008లో నాటోలో తిరిగి సభ్యత్వం తీసుకుంది?
జవాబు: ఫ్రాన్స్
దేశంలో అతిపెద్ద లైబ్రరీగా పేరొందిన నేషనల్ లైబ్రరీ ఏ నగరంలో ఉంది?
జవాబు: కోల్‌కతా
కిందివాటిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.) లేని నగరాన్ని గుర్తించండి?
చెన్నై, ముంబయి, అహ్మదాబాద్, ఢిల్లీ
జవాబు: అహ్మదాబాద్
న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ (ఎన్.పి.టి.) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జవాబు: 1970
కింది ప్రాంతాల్లో వేటిని కలిపి ఆస్ట్రలేషియాగా పిలుస్తారు? (ఆస్ట్రలేషియాకు మరో పేరు ఓసినియా)
1) ఆస్ట్రేలియా 2) న్యూజిలాండ్
3) న్యూగినియా 4) పసిఫిక్ దీవులు
5) టాస్మానియా
జవాబు: 1, 2, 3, 4, 5
శకయుగం ఎప్పుడు ప్రారంభమైంది?
జవాబు: క్రీ.శ. 78
రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబరు 9 నుంచి 23 వరకు నిర్వహించారు. చివరి సమావేశం 1949 నవంబరు 14 నుంచి 26 వరకు నిర్వహించారు. భారత రాజ్యాంగ రచనా కాలంలో (1946 డిసెంబరు 9 -1949 నవంబరు 26) రాజ్యాంగ సభ మొత్తం ఎన్ని సమావేశాలు నిర్వహించింది?
జవాబు: 11
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్.ఎ.సి.ఒ.)ను ఎప్పుడు స్థాపించారు?
జవాబు: 1992
2009 సంవత్సరాన్ని ఏ సార్క్ సభ్య దేశం ఇంగ్లిష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది?
జవాబు: శ్రీలంక
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసి యేషన్ (ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు: జ్యూరిచ్
దేశంలోనే తొలి సంపూర్ణ పారిశుద్ధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది? (టోటల్ శానిటైజేషన్ క్యాంపెయిన్‌లో భాగంగా రాష్ట్రంలోని 60 శాతం గ్రామీణ గృహాలు పూర్తి పారిశుద్ధ్యం సాధించాయి)
జవాబు: సిక్కిం
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలో దేన్ని ఏప్రిల్ 7, 1948న జెనీవా కేంద్ర కార్యాలయంగా ఏర్పాటు చేశారు?
జవాబు: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది?
జవాబు: వారణాసి, ఉత్తరప్రదేశ్
. 'కామిల్' అనే అద్దాలు పొదిగిన వస్త్రాలను ఏ సంప్రదాయ నృత్యంలో ఉపయోగిస్తారు?
జవాబు: మణిపురి
గడియారాల తయారీ అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
జవాబు: హోరాలజీ
మొదటి అంతరిక్ష పర్యటకుడిగా రికార్డు సృష్టించిన అమెరికా వాసి ఎవరు?
జవాబు: డెన్నిస్ టిటో
తపాలా రంగంలో వినిపిస్తున్న పి.ఎ.ఎల్. పూర్తి రూపం ఏమిటి?
జవాబు: పర్సనల్ అడ్రస్ లొకేటర్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment