వేసవికాలంలో ఏ వర్ణాలతో ఉన్న గొడుగును ఉపయోగించాలి? ఇనుప సీల తుప్పుపట్టడం వల్ల - దాని బరువు పెరుగుతుందా ? లేక తగ్గుతుందా ? - జనరల్ నాలెడ్జ్ బిట్స్



జనరల్ నాలెడ్జ్ బిట్స్ 
 రేడియోధార్మిక మూలకం చర్యాశీలతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
జ:  బెకరల్

ఒక లోలక గడియారం సముద్రమట్టంలో సరైన సమయం చూపే విధంగా ఏర్పాటు చేశారు. ఆ గడియారాన్ని సముద్రమట్టం కంటే ఎత్తయిన కొండ ప్రాంతానికి తరలించారు. కొండ ప్రాంతం మీద సరైన సమయం చూపడానికి  ఏమి చేయాలి?
జ:  లోలకం పొడవును తగ్గించాలి

 ఒక బంతిని పైకి విసిరితే స్థిరంగా ఉండేది ఏది?
జ:  త్వరణం

 సమానవేగంతో ఉన్న ప్రోటాన్, ఎలక్ట్రాన్‌ను ఏకరూప అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రసరించడానికి అనుమతించారు. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది?
జ:  ప్రోటాన్‌కు, ఎలక్ట్రాన్‌కు సమాన, వ్యతిరేకమైన బలాలు ఉంటాయి.

 నాజిల్‌తో బోలుగా ఉన్న గాలి గొట్టమే సిరంజి. ఈ సిరంజి ద్రవాన్ని పీల్చుకోడానికి కారణం-
జ:  తలతన్యత ప్రభావం

 సితార తీగలో ఏ రకం ప్రకంపనాలు ఉత్పత్తి అవుతాయి?
జ:  స్థిర తిర్యక్

DC కరెంటును నియంత్రించేది ఏది?
జ:  రెసిస్టెన్స్

 వికిరణాల్లో గరిష్ఠ శక్తిని తీసుకుపోయే వికిరణాలు ఏవి?
జ:  గామా కిరణాలు

  ఉత్తమ విద్యుద్వాహకం ఏది?
జ:  మానవశరీరం

 మ్యూచువల్ ఇండక్షన్ సూత్రం ఆధారంగా పనిచేసే సాధారణ సాధనం ఏది?
జ:  ట్రాన్స్‌ఫార్మర్

 ఏ నిత్యత్వ నియమంపై ఆధారపడి రాకెట్ పనిచేస్తుంది?
జ:  కోణీయ ద్రవ్యవేగం

సంపూర్ణ అంతర పరావర్తనం ఎందులో కనిపిస్తుంది?
జ:  వెలుగుతున్న ట్యూబ్‌లైట్

ఏ పదార్థాల్లో ధ్వని అత్యంత నెమ్మదిగా పయనిస్తుంది?
జ:  కొయ్య

 హైడ్రోజన్ కేంద్రకాలు సంలీనమై డ్యుటీరియం ఏర్పడి, అధిక పరిమాణంలో శక్తి విడుదలవుతుందని గుర్తించినవారు-
జ:  ఫెర్మి


 ఒకే పదార్థంతో చేసిన వివిధ పరిమాణాల్లో ఉన్న నాలుగు తీగలను, ఒకే పరిమాణం ఉన్న భారంతో విడివిడిగా సాగదీస్తే వాటిలో ఏది గరిష్ఠంగా సాగుతుంది?
ఎ)  1 మీ. పొడవు, 2 మి.మీ. వ్యాసం ఉన్న తీగ      
బి)  2 మీ. పొడవు, 2 మి.మీ. వ్యాసం ఉన్న తీగ
సి)  3 మీ. పొడవు, 1.5 మి.మీ. వ్యాసం ఉన్న తీగ    
డి)  1మీ. పొడవు, 1 మి.మీ. వ్యాసం ఉన్న తీగ

జ:  3 మీ. పొడవు, 1.5 మి.మీ. వ్యాసం ఉన్న తీగ


 ఆప్టిక్ ఫైబర్‌లను ప్రధానంగా ఏ రంగంలో ఉపయోగిస్తారు?
జ:  కమ్యూనికేషన్

 అత్యధికంగా చొచ్చుకుపోయే కిరణాలు-
జ: y-కిరణాలు

 సౌర వర్ణపటంలో నల్లటి గీతలకు కారణం-
జ:  సూర్యుడి బాహ్య పొరలు, అనురూప తరంగదైర్ఘ్యాలను శోషించుకోవడం

 పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్‌లను, ప్రోటాన్‌లను పట్టి ఉంచేది-
జ:  వినిమయ బలాలు

 X - కిరణాల తరంగదైర్ఘ్యం-
జ:  1 ఆంగ్‌స్ట్రామ్

న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా ఉపయోగించేది-
జ:  గ్రాఫైట్

 క్రయోజెనిక్ ఇంజిన్‌లను ఎందులో ఉపయోగిస్తారు?
జ:  రాకెట్ టెక్నాలజీ

వేసవికాలంలో ఏ వర్ణాలతో ఉన్న గొడుగును ఉపయోగించాలి?
జ:  పై భాగాన తెలుపు, లోపలి భాగాన నలుపు

 ద్రవ్యాన్ని సృష్టించడం కానీ నాశనం చేయడం కానీ జరగదని వివరించే నియమం-
జ:  ద్రవ్యరాశి నిత్యత్వ నియమం

. ద్రవ్యరాశి-శక్తి సంబంధం దేని ఫలితం?
జ:  శక్తి క్షేత్ర సిద్ధాంతం

 ధ్వని వేగం దేనిలో గరిష్ఠంగా ఉంటుంది?
జ:  నీరు

 టేప్ రికార్డర్‌లు, ఇతర ధ్వని వ్యవస్థలపై ముద్రించే 'డాల్బీ B' లేదా 'డాల్బీ C' అనే పదం దేన్ని సూచిస్తుంది?
జ:  నాయిస్ రిడక్షన్ సర్క్యూట్

గృహాల్లో ఉపయోగించే ఫ్లోరోసెంట్ ట్యూబ్‌లైట్‌పై ముంద్రించి ఉండేది-
జ:  6500 K

కిందివాటిలో ఉత్తమ, అధమ ఉష్ణవాహకాల సరైన జత-
    ఎ)  వెండి (Ag) - సీసం (Pb)          బి)  రాగి (Cu)- అల్యూమినియం (Al)
    సి) వెండి (Ag)- బంగారం (Au)      డి) రాగి (Cu)-బంగారం (Au)
జ:  వెండి (Ag) - సీసం (Pb)

బట్టలను శుభ్రంచేసే సబ్బులు, డిజర్టెంట్లలోని సర్పోక్టంట్స్ అణువులు మురికిని ఏ విధంగా తొలగిస్తాయి?
జ:  కొన్ని సముచ్ఛయాలుగా ఏర్పడి, సముచ్ఛయాల మధ్య భాగంలో మురికిని బయటికి తీయడం ద్వారా
 వాహక తీగ విశిష్ట నిరోధం వేటిపై ఆధారపడుతుంది?
జ:  తీగ పొడవు, తీగ అడ్డుకోత వైశాల్యం, తీగ పదార్థం

నెయిల్ పాలిష్‌ను తొలగించే పదార్థంలో ఉండేది-
జ:  ఎసిటోన్

వెండి, బంగారాన్ని వేరు చేయడానికి ఉపయోగించే ఆక్వారియా ఏ ఆమ్లాల మిశ్రమం?
జ:  గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, గాఢ నైట్రిక్ ఆమ్లం

HOలో కరిగించినప్పుడు బుసకొట్టే ధ్వని ఇచ్చేది-
జ:  సున్నపురాయి

 ఇనుప సీల తుప్పుపట్టడం వల్ల-
జ:  దాని బరువు పెరుగుతుంది

 న్యూక్లియర్ రియాక్టర్‌లో ఉపయోగించే భారజలం-
జ:  అణుభారం 20 amu ఉన్న నీరు

 అద్దకం, టానింగ్ పరిశ్రమల్లో రసాయనంగా ఉపయోగించేది-
జ:  మెగ్నీషియం సల్ఫేట్

స్ట్రేంజర్ గ్యాస్ అని దేన్ని అంటారు?
జ:  గ్జీనాన్

 గనుల్లో చాలా వరకు పేలుళ్లకు కారణమయ్యే వాయువుల జంట ఏది?
జ:  మీథేన్, గాలి

 కింది వాటిలో అత్యంత తేలికైన, అత్యంత భారమైన లోహ జంట ఏది?
      ఎ) లిథియం, పాదరసం                    బి) లిథియం, ఓస్మియం
      సి) అల్యూమినియం, ఓస్మియం        డి)అల్యూమినియం, పాదరసం
జ:  లిథియం, ఓస్మియం

ఫ్లింట్ గ్లాస్‌ని వేటి నుంచి  రూపొందిస్తారు?
జ:  ఇసుక, ఎర్ర సీసం, పొటాషియం కార్బోనేట్

గాజు స్థితిని సరిగ్గా నిర్వచించేది ఏది?
జ:  అతిశీతల ద్రవం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment