కంప్యూటర్‌ వైరస్‌ అంటే ఏమిటి?




కంప్యూటర్ల ద్వారా రకరకాల పనులను చేయించేందుకు మనకు కొన్ని 'ప్రోగ్రాం'లు అవసరమవుతాయి. 

వీటినే మనం సాఫ్ట్‌వేర్లు అని అంటున్నాం. ఈ ప్రోగ్రామ్స్‌ అనేక సాఫ్ట్‌వేర్‌లని 
ఈ రంగానికి చెందిన నిపుణులు తయారుచేసి అందుబాటులోకి తెస్తారు. 

అయితే... సినిమాల్లో హీరోలతో పాటు విలన్లూ ఉన్నట్లే, కంప్యూటర్లతో చక్కగా
 పనిచేయించే ఈ మంచి ప్రోగ్రామ్స్‌ని పాడుచేసే యాంటీ ప్రోగ్రామ్స్‌ని లేక చెడ్డ 
ప్రోగ్రామ్స్‌ని కొంతమంది రూపొందిస్తుంటారు. 

ఇలాంటి చెడ్డ ప్రోగ్రామ్‌లనే వైరస్‌లు అని అంటుంటారు. 

ఈ వైరస్‌లు ఇంటర్‌నెట్‌లోని ఏదైనా వెబ్‌సైట్‌ ద్వారా గానీ, సాఫ్ట్‌వేర్‌ ద్వారా గానీ,
 ఇ - మెయిల్ ద్వారా గానీ, లేదా సీడీ లాంటి సాధనం ద్వారా మనం దేన్నయినా 
మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడుగానీ, ఇంకా ఇలాంటి అనేక మార్గాల
 ద్వారా మన కంప్యూటర్‌లోకి ఆటోమేటిగ్గా ప్రవేశించవచ్చు. 

లేదా ఒకోసారి మనకు తెలియకుండా మనమే స్వయంగా వాటిని డౌన్‌లోడ్‌
 చేసుకోవచ్చు. 

ఏమైతేనేం మన కంప్యూటర్‌కి వైరస్‌ సోకితే అది మనకు చాలా రకాలుగా 
ఇబ్బందిని కలిగిస్తుంది. వైరస్‌ కారణంగా మన కంప్యూటర్‌ ఉన్నట్టుండి పనిచేయడం
 మానేయొచ్చు. అప్పటిదాకా మనం కంప్యూటర్‌లో స్టోర్‌ చేసుకుని ఉన్న ఫైల్స్‌ 
అన్నింటిని గానీ, లేదా వాటిలో కొన్నింటిని గానీ వైరస్‌ తుడిచిపెట్టేయవచ్చు. 

కంప్యూటర్‌ పనిచేసే వేగం బాగా తగ్గిపోవడం, దాని పనితీరు దెబ్బతినడం, దానిలోని
 ప్రోగ్రామ్స్‌ పనిచేయకపోవడం, డిస్క్‌లో ఖాళీ స్థలం ఉన్నప్పటికీ అవి ఉన్నట్లుగా
 మనకు చూపకపోవడం ... వంటి ఎన్నో సమస్యలకు వైరస్‌లు కారణమవుతాయి.

వైరస్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా కొన్ని లక్షల కంప్యూటర్ల పనితీరు 
దెబ్బతిని, కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం సంభవిస్తోంది. 

ఒరిజినల్‌ సాఫ్ట్‌వేర్‌లను వాడటం, వైరస్‌లను ఫిల్టర్‌ చేసే ఏర్పాట్లను చేసుకోవడం, 
పీసీ వాడకానికి ఓ పాస్‌వర్డుని పెట్టుకోవడం, మీ పీసీని, దాని అనుబంధ పరికరాలని 
ఎవరికంటే వారికి ఇవ్వకుండా ఉండటం వంటి కొన్ని చర్యల ద్వారా మీ కంప్యూటర్‌ని 
వైరస్‌ల బారినపడకుండా కాపాడుకోవచ్చు.

కంప్యూటర్ గురించి మరింత తెలుసుకోవడానికి 



ఇంకా చదవండి :నరదిష్టి అనేది నిజంగా ఉందా?
ఏడు వారాల నగలు అంటే ఏమిటి ?
అమావాస్య నాడు ముగ్గులు వేయకూడదా?
కొవ్వొత్తులు పరిశ్రమ ...!
ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటె ప్రమాదమా...?