ఎడారులు గురించి తెలుసుకుందాం ?


సహారా ఎడారి :
ప్రపంచంలో అతి పెద్ద, అత్యుష్ణ ఎడారి ఉత్తర ఆఫ్రికాలో ఉంది.

లిబియా ఎడారి : 
ఉత్తర ఆఫ్రికాలో ఉంది. పెట్రోలియం, సహజవాయువు నిల్వలు ఆపారం.

 అరేబియా ఎడారి
ఈజిప్టులో ఉంది. నైలు నది లోయ సరిహద్దుగా ఉంది.

న్యూబియన్‌ ఎడారి : 
సూడాన్‌లో ఉన్న అత్యుష్ణ, పొడి ఎడారి.

 కలహారి ఎడారి : 
నైరుతి ఆఫ్రికాలో ఉంది. సాధారణంగా ఎర్రమట్టితో ఉంటుంది.

 నమీబ్‌ ఎడారి : 
నమీబియా తీరంలో ఉన్న అత్యుష్ణ అతి శీతల ప్రాంతం. వజ్రాలు, టంగస్టన్‌ నిల్వలు 
సమృద్ధిగా ఉన్నాయి.

 అరిజోన ఎడారి : 
ఉత్తర అమెరికాలోని అరిజోన, నెవెడాల మధ్య ఉన్న అత్యుష్ణ ఎడారి.

థార్‌ ఎడారి : 
భారత్‌, పాకిస్తాన్‌లలో ఉన్న అత్యుష్ణ ఎడారి.

 సోనోర ఎడారి : 
ఉత్తర అమెరికాలోని అతిపెద్ద ఎడారి మెక్సికోలో ఉంది.

అటకామా ఎడారి : 
ప్రపంచంలోని పొడి ఎడారుల్లో ముఖ్యమైనది. ఉత్తర చిలీలో ఉంది. నైట్రేట్‌ ఉత్పత్తికి ప్రసిద్ధం.

 పెటగోనియా ఎడారి : 
దక్షిణ అమెరికాలో ఉన్న అతిపెద్ద ఎడారి. అర్జెంటీనాలో ఉంది. సమశీతోష్ణ ఎడారి.

గిబ్బన్‌ ఎడారి : 
పశ్చిమ ఆస్ట్రేలియాలో దక్షిణాన ఉంది.

 గ్రేట్‌ శాండే ఎడారి : 
ఆస్ట్రేలియా వాయువ్య ప్రాంతంలో ఉంది. కానిన్‌ బేసిన్‌గా సుప్రసిద్ధం.

.విక్టోరియా ఎడారి : 
దక్షిణ ఆస్ట్రేలియాకు ఉత్తరంగా ఉన్న పాక్షిక ఎడారి ఇది.

.లోపార్న్‌ ఎడారి : 
చైనాలో ఉన్న సమశీతోష్ణపు ఎడారి. ఇక్కడ చైనా అణు పరీక్షలు నిర్వహిస్తుంది.

.మంగోలియా ఎడారి : 
ప్రపంచంలో అతిపెద్ద సమశీతోష్ణపు ఎడారి చైనా, మంగోలియా మధ్య ఉంది.

తక్లామకాన్‌ ఎడారి : 
చైనా వాయువ్య ప్రాంతంలో ఉన్న సమశీతోష్ణపు ఎడారి బౌద్దారామాలకు ఆలవాలం.

సింప్సన్‌ ఎడారి : 
ఉత్తర ఆస్ట్రేలియా ఆగేయ ప్రాంతంలో ఉంది.

.స్టుర్బ్‌ ఎడారి : 
దక్షిణ ఆస్ట్రేలియా, న్యూసౌత్‌ వేల్స్‌, క్వీన్‌లాండ్స్‌ల మధ్య ఉంది.

.రాబల్‌ఖలి ఎడారి : 
సౌదీ అరేబియాకు దక్షిణాన పెట్రోలియం నిల్వలలో సమృద్ధమైన ప్రాంతం.


ఇంకా :
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు
 భారతదేశంలోని ప్రధాన సరస్సులు
ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు
ప్రసిద్ధ కట్టడాలు - అవి ఉండే ప్రదేశాలు
భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి