మన శరీరంలో కోట్లాది సూక్ష్మక్రిములు నివసిస్తుంటాయనేది సైన్స్ రుజువు చేసింది.
వీటిల్లో మనకు మేలు చేసేవీ, హాని చేసేవీ రెండూ ఉంటాయి.
ఇవి మనిషి ఎప్పుడు చనిపోయాడో అనేది నిర్ధారించటానికీ ఉపయోగపడతాయట!
మనిషి చనిపోయిన తర్వాత శరీరం కుళ్లిపోవటం మొదలవుతుంది.
ఈ సమయంలో బ్యాక్టీరియాలోనూ మార్పులు తలెత్తుతాయి.
'సూక్ష్మక్రిమి గడియారం'గా భావించే దీని ఆధారంగా చనిపోయిన సమయాన్ని
గుర్తించొచ్చని తమ అధ్యయనంలో తేలిందని కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయానికి చెందిన
జెస్సికా మెట్‌కాఫ్ పేర్కొన్నారు.
మరణాలకు సంబంధించిన కేసుల్లో చనిపోయిన సమయాన్ని తెలుసుకోవటం చాలా కీలకం.
అయితే, ప్రస్తుత పద్ధతులు పూర్తిగా నిర్ధారించేవిగా లేవన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా
తాము అత్యాధునిక పరిజ్ఞానం సాయంతో ఎలుకల మృతదేహాల్లోని సూక్ష్మక్రిముల జన్యువుల
క్రమాన్ని క్షుణ్ణంగా విశ్లేషించామన్నారు.
దీంతో ఎలుకలు చనిపోయిన 48 గంటల తర్వాత కూడా నాలుగు రోజులు అటూ ఇటూగా
మరణ సమయాన్ని సరిగ్గా గుర్తించామని తెలిపారు.
చనిపోయాక 34 రోజుల తర్వాత ఈ సమయం మరింత కచ్ఛితంగా ఉందని, మూడు
రోజుల తర్వాతనైతే పూర్తి కచ్ఛితంగా ఉందన్నారు.
ఇంకా :
పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?
ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?
భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు?
తలస్నానం ఏరోజు చేయాలి?
శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు?