ఇంటర్‌నెట్, వైఫై అవసరం లేకుండా ఇంటర్నేషనల్ కాల్స్ - మీకు తెలుసా?

    

*రింగో... స్మార్ట్ ఇంటర్‌నేషనల్ కాలింగ్ యాప్

ముంబై: రింగో... స్మార్ట్ ఇంటర్‌నేషనల్ కాలింగ్ యాప్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. 
ఈ రింగో యాప్‌తో ఇంటర్‌నెట్, వైఫై లేకుండానే ఇంటర్‌నేషనల్‌కాల్స్ చేసుకోవచ్చు. 
16 దేశాల్లో విజయవంతమైన ఈ యాప్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. 
ఈ రింగో యాప్ కారణంగా ఇంటర్నేషనల్ కాలింగ్‌లో 90% పొదుపు చేయవచ్చు. 
తమ రింగో యాప్‌తో ప్ర పంచంతో భారతీయుల కమ్యూనికేషన్ విషయంలో పెనుమార్పు 
వస్తుందన్న ధీమాను రింగో సీఈఓ భవిన్ తురకియా వ్యక్తం చేశారు. ఇంటర్‌నెట్, వైఫై అవసరం లేదుఇతర ఓటీటీ వాయిస్ యాప్‌ల వలె రింగో కాల్స్‌కు ఇంటర్నెట్, వైఫై, డేటా  అవసరం లేదని వివరించారు. భారత్‌లోని రింగో యూజర్, ఇంగ్లాండ్‌లోని వ్యక్తికి ఫోన్ చేయాలనుకున్నట్లైతే, రింగో భారత 
యూజర్‌కు లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్‌లోని యూజర్‌కు కూడా 
లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. ఈ ఇరువురిని కేరియర్ సర్క్యూట్ల ద్వారా అనుసంధానం 
చేస్తుందని వివరించారు.  ఏడాదికి భారతీయులు 200 కోట్ల డాలర్లు విదేశీ కాల్స్ కోసం 
వెచ్చిస్తున్నారని భవిన్ పేర్కొన్నారు.  ఇది వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ల కంటే 70 శాతం తక్కువని, 
స్కైప్, వైబర్‌తో పోల్చితే 25% తక్కువని తెలిపారు.

ఆధారం : సాక్షి  Updated: January 15, 2015