అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే కలప దేన్నుంచి లభిస్తుంది? - బిట్స్


 1.     మొక్కలోని ఏ భాగాల నుంచి చాకోలెట్ తయారవుతుంది?
     ఎ) విత్తనాలు     
     బి) వేర్లు
     సి) కాండం   
     డి) పుష్పాలు
 
 2.     కింది వాటిలో కాండం?
     ఎ) బంగాళాదుంప 
     బి) అల్లం
     సి) కందగడ్డ 
    డి) పైవన్నీ
 
 3.     బార్లీ శాస్త్రీయ నామం..?
     ఎ) సికెట్ సిరీల్స్
     బి) హార్టియం వల్గేర్
     సి) జియామేస్     
     డి) అవినా సటైవా
 
 4.    ఫాక్స్ టెయిల్ మిల్లెట్ అని దేన్ని పిలు స్తారు?
     ఎ) జొన్న 
    బి) రాగి
     సి) సజ్జ 
     డి) కొర్ర
 
 5.     కాల్షియం ఎక్కువగా ఎందులో లభి స్తుంది?
     ఎ) రాగి  
     బి) గోధుమ
     సి) జొన్న 
     డి) మొక్కజొన్న
 
 6. ఆపిల్ రసం నుంచి తయారయ్యే మత్తు పానీయం?
     ఎ) ఫెన్నీ  
     బి) సిడర్
     సి) మీడ్
     డి) పల్క్
 
 7.     ఆల్కహాల్ శాతం ఎందులో ఎక్కువ?
     ఎ) బీర్  
     బి) వైన్    
     సి) సిడర్  
     డి) రమ్
 
 8.   సిట్రస్ ఫలం కానిది?
 ఎ) నిమ్మ 
 బి) నారింజ
 సి) బత్తాయి   
 డి) ఉసిరి
 
 9.     అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే కలప దేన్నుంచి లభిస్తుంది?
     ఎ) బాంబాక్స్     
      బి) సాలిక్స్
     సి) ఆంథోసెఫాలస్ 
     డి) పైవన్నీ
 
 10. హిర్సుటు, ఆర్బోనియం, హెర్బెసియం అనేవి ఏ జాతికి చెందినవి..?
     ఎ) పత్తి    
     బి) నిమ్మ
     సి) కొబ్బరి    
     డి) దానిమ్మ
 
 11. గ్రేట్ మిల్లెట్ అని దేనిని అంటారు?
 ఎ) రాగి     
బి) సజ్జ
 సి) జొన్న     
డి) మొక్కజొన్న
 
 12. కొకైన్ అనే మత్తు పదార్థం మొక్కలోని ఏ భాగం నుంచి లభిస్తుంది?
     ఎ) పత్రాలు    
     బి) ఫలం
     సి) విత్తనం     
     డి) వేరు
 
 13. సర్పగంథ నుంచి లభించే సర్పెంటైన్, రిసర్టైన్ అనే రసాయనాలను దేని చికిత్స లో వాడతారు?
     ఎ) ర్యుమటాయిడ్ ఆర్థ్రైటిస్
     బి) అధిక రక్తపోటు
     సి) క్యాన్సర్     
     డి) క్షయ
 
 14. పుష్పంలోని ఏ భాగం నుంచి కుంకుమ పువ్వు లభిస్తుంది..?
     ఎ) కీలం     
    బి) కీలాగ్రం
     సి) ఆకర్షక పత్రాలు 
      డి) రక్షక పత్రాలు
 
 15.    కాలిఫ్లవర్ రూపాంతరీకరణను ఏమం టారు..?
     ఎ) పుష్పం  
     బి) మొగ్గ
     సి) పుష్ప విన్యాసం
     డి) పత్రం
 
 16. డ్రూప్ అనే ఫల రకానికి ఉదాహరణ?
     ఎ) మామిడి 
    బి) గుమ్మడికాయ
     సి) బొప్పాయి 
    డి) నిమ్మకాయ
 
 17. ఇనుము దేనిలో ఎక్కువగా లభిస్తుంది?
     ఎ) పాలకూర 
      బి) తోటకూర
     సి) గోంగూర 
      డి) బచ్చలకూర