లారీ ముందు వైపు ఒక్క టైరు ఉంటే వెనుక వైపు నాలుగు టైర్లు ఉంటాయి. ఎందుకు ?


లారీల వంటి భారీ వాహనాల వెనక టైర్లను మీరెప్పుడైనా చూశారా? 

ముందు వైపు ఒక్క టైరు ఉంటే వెనుక వైపు నాలుగు టైర్లు ఉంటాయి. 

చిన్న వాహనాలనైతే పెట్రోలు ఇంజనుతో నడిపిస్తారు. వీటి ఇంజన్ని ముందు 
టైర్ల ద్వారా వాహనాన్ని ముందుకు తీసుకెళ్తారు. 

అదే ఎక్కువ లోడుతో ఉన్న పెద్ద పెద్ద లారీలను డీజిల్‌ ఇంజనుతో నడిపిస్తారు. 
వాహనం పెద్దదిగా ఉండడం వల్ల వెనుక టైర్లను ముందుకు నెట్టే పద్ధతిలో ఇంజన్‌ 
ఉంటుంది. 

వాహనం చిన్నదైనా, పెద్దదైనా టైర్లు రోడ్డుమీద ఒత్తిడి, ఘర్షణ తీసుకురావడం వల్ల 
టైర్లు ముందుకు వెళ్తూ, రోడ్డును వెనక్కు నెడతాయి. 

రోడ్డుమీద ఎంత బలంగా ఒత్తిడి కలిగిస్తే వాహనం అంత వేగంగా ముందుకు వెళ్తుంది. 

పెద్ద వాహనాలకు ఎక్కువ టైర్లు ఉండడం వల్ల ఎక్కువ పట్టు వస్తుంది. 

ఫలితంగా ఎక్కువ వేగంగా ముందుకు వెళ్తుంటాయి.