నీటిలో మేకు మునుగుతుంది ఓడ తేలుతుంది ఎందుకు?


నీటిపై ఒక వస్తువు తేలియాడాలంటే ఆ వస్తువు నీటి మీద కలిగించే బలం, అది 
తొలగించిన నీరు ఆ వస్తువుపై కలిగించే బలానికి సమానంగా ఉండాలి. 

నీటిలో మేకు వేసినప్పుడు మేకు బరువు, అది తొలగించిన నీటి బరువుకన్నా 
అధికంగా ఉండి మేకు మునుగుతుంది. 

అదే మేకును పల్చటి రేకులా సాగదీసి అంచులు మడిచి నీటిలో వేస్తే పైకి తేలుతుంది.
 ఇక్కడ మేకు బరువు ఏ మాత్రం మారలేదు కానీ రేకు లాగా చేయడం వల్ల అది నీటిపె 
ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. 

రేకును పైకి నెట్టే నీటి పరిమాణం పెరిగి నీరు కలిగించే బలం కూడా పెరుగుతుంది. ఇదే 
సూత్రం ఓడకు కూడా వర్తిస్తుంది. 

దాని అడుగు భాగం వెడల్పుగా ఉండడం, అది నీటిపై కలిగించే బలం... తొలగించిన నీరు ఓడపై కలిగించే బలం సమానంగా ఉండడం వల్ల ఓడ నీటిపై తేలుతూ ఉంటుంది.