మనుషులు చూడలేనంత చీకటిలో పిల్లులు బాగానే చూడగలవు.
కారణం మనకు, పిల్లులకు మధ్య కంటి నిర్మాణంలో ఉండే వ్యత్యాసమే.
పిల్లి ముఖపరిమాణాన్ని బట్టి చూస్తే వాటి కళ్లు పెద్దవిగా కనబడతాయి.
పిల్లి తన కనుగుడ్లను బాగా వెడల్పు చేసి చూడగలదు. దాని కనుగుడ్డు అమరిక
ఎక్కువ కాంతిని చూసేలా వుంటుంది.
కాంతి దాని కనుగుడ్డుపై ప్రసరించినప్పుడు అది మనకులాగా చెదరదు.
పైగా మనుషుల కంటిలో రంగులను, కాంతిని చూడగలిగే భాగం కంటే పిల్లుల
కనుగుడ్డులో కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువ.
వీటిని రాడ్స్ అంటారు. వీటివల్లనే అవి మనకంటే తక్కువ కాంతిలో చూడగలదు.
ఎక్కడో మారుమూల చీకటిలో వున్న ఎలుకలను కూడా చక్కగా వేటాడి పట్టగలదు.