శ్రీ డా . వై.యస్.రాజశేఖర్ రెడ్డి







                         



  డా వై.యస్.రాజశేఖర్ రెడ్డి (యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి)
» ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి.
» పదవీ కాలం 2004-2009.

 »జూలై 8, 1949 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని 
సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు

తల్లిదండ్రులు :
జయమ్మ, రాజారెడ్డి.

భాగస్వామి:
విజయలక్ష్మి

సంతానము :
»వై.యస్. జగన్మోహన్ రెడ్డి , షర్మిల

విద్యాభ్యాసం:
»ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది

»ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వ
విద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. 

»శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్.వి.ఆర్.ఆర్), తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా
 పొందాడు.

»తరువాత కొద్దిరోజులపాటు జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో 
వైద్య అధికారిగా పనిచేశాడు

»ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 
70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది.

రాజకీయ జీవితం:

» కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. 
»పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు.

పదవులు:

   
» 1975: యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం.
   » 1980: తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా 
                 నియామకం.
   
» 1982: రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రి పదవి లభించింది.
    »1982: రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం.
    »1983: పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు (1985 వరకు).
    »1998: రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం (2000 వరకు).
    »1999: శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.
   » 2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
   » 2009: రెండోపర్యాయం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.

విజయాలు:

    
»1978: పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినాడు.
    »1983: పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం.
    »1985: పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ విజయం.
    »1989: కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లొకసభ సభ్యుడిగా విజయం.
    »1991: కడప నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు.
   » 1996:కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించాడు.
    »1998: కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు.
    »1999: పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు.
   » 2004: పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయసాధించాడు.
   » 2009: పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా 
              గెలుపొందడం ఆరవసారి.
»తెలుగు దేశం నేత ప్రస్తుత విభజన ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు 
నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు.
»మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో 
ఆయన రాజకీయ యుద్ధమే చేశారు
»రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు

వివాదాలు, విమర్శలు:

»వైఎస్సార్ హయంలో బాక్సైట్ గనులను అడ్డగోలుగా, కీలక చట్టాలను తుంగలో
 తొక్కి మరీ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినట్లు కేంద్ర గిరిజన శాఖ మంత్రి కిశోర్ 
చంద్రదేవ్ ఆరోపించారు

»వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ కు వైఎస్ చాలా అనుకూలంగా
 వ్యవహరించారని సీబీఐ పేర్కొంది.వాన్‌పిక్ ప్రాజెక్టుతో పాటు షిప్‌యార్డ్, ఒంగోలులో 
గ్రీన్‌ఫీల్డ్ ఏర్ పోర్టుతో పాటు భారీ ఎత్తున అసైండ్, ప్రభుత్వ భూములను కట్టబెట్టడం, 
స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ, సీనరేజి ఫీజుల మినహాయింపు వంటి అక్రమ
 ప్రయోజనాలెన్నింటినో నిమ్మగడ్డ కంపెనీలకు కల్పించారాని తెలిపింది

»ఇదివరకు ఏ ముఖ్యమంత్రిపై రాని అవినీతి విమర్శలు వైఎస్సార్ పై వచ్చాయి

మరణం:

»ముఖ్యమంత్రి హోదాలో ఆయన  సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు
 బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరు‌ తో సంబంధాలు 
తెగిపోయాయి

»ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ 
ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో 
మరణించారు.

ఇంకొన్ని పోస్టులు :
»శ్రీ నారా చంద్రబాబునాయుడు
»మహామహులు
»భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు
»గ్రంథాలు – రచయితలు (భారతదేశంలో...)
»ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?