»భూమ్మీద ప్రతీ గ్రాము మట్టిలో సగటున నాలుగు కోట్ల బ్యాక్టీరియాలు, శుభ్రమైన తాగే నీటిలో ప్రతి పది మిల్లి లీటర్లకు కోటి చొప్పున బ్యాక్టిరియాలు ఉన్నాయి. |
»మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతు, వృక్ష జాతుల జనాభాకన్నా బ్యాక్టీరియాలే అధికం. ప్రతీ మనిషిలోనూ సుమారు 10 లక్షల కోట్ల మానవజీవ కణాలు ఉండగా, ప్రతి వ్యక్తి శరీరంమీద ఉండే బ్యాక్టీరియాల సంఖ్య వాటికి పదిరెట్లు ఎక్కువ. |
»మనం బతికున్నంత కాలం శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ వీటిమీద సైన్యంలా దాడిచేస్తూ మనల్ని కాపాడుతుంది. బ్యాక్టిరియాల సంఖ్య ఈ మోతాదుకు మించితే అనారోగ్యం కలుగుతుంది. |
»మనం
చేతులు కడుక్కోవడం అంటే బయటి బ్యాక్టిరియాను తొలగించుకోవడమే. జంతువుల్లో కూడా
వాటివాటి రక్షణ వ్యవస్థ ఉంటుంది. అవి మురికిలోనూ మలినప్రాంతాల్లోనూ బతికే
పరిస్థితి సహజంగా ఉండడం వలన పరిణామక్రమంలో వాటికున్న రక్షణ వ్యవస్థ మనకన్నా
సమర్ధంగా ఉంటుంది. »పైగా వాటి శరీర నిర్మాణంలో ఉన్న తేడాలు కూడా జంతువులకు అదనపు రక్షణ వ్యవస్థను సమకూరుస్తాయి. అయితే మురికి, మలినాలు ఎక్కువైతే జంతువులు కూడా రోగాల బారిన పడక తప్పదు. |
»ఈ భూమి
ఏర్పడ్డ కొన్ని కోట్ల సంవత్సరాలకు భూమి మీద జీవలక్షణాలున్న కణాలు ఏర్పడ్డాయి.
అవే వైరస్‌లు, బ్యాక్టీరియాలుగా రూపొందాయి. జీవకణం ఆధారం లేకుంటే వైరస్‌లు ఏమీ
వృద్ది చెందలేవు కాబట్టి అవి బ్యాక్టీరియా కణాల్ని కూడా కబళిస్తాయి. »ఈ విధంగా ప్రపంచంలోవైరస్‌లు లేని ప్రాణి లేదు. వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పాటు మన పరిసరాలలో మనకు వ్యాధుల్ని కలిగించే ఏకకణ జీవులు, బహుకణ జీవులు |
చాలానే
ఉన్నాయి. ఇంకా తెలుసుకోండి : >విపత్తు నిర్వహణ >మీకు తెలుసా ? >మహామహులు >భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు |