సౌత్‌వెస్ట్ ఆఫ్రికా కొత్త పేరేమిటి? - తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్



జనరల్ నాలెడ్జ్ బిట్స్ 
 1920లో మహాత్మాగాంధీ స్థాపించిన విద్యాపీఠ్‌విశ్వవిద్యాలయాన్ని 2009 ఫిబ్రవరిలో 
మార్టిన్ లూధర్ కింగ్-3, ఆయన భార్య అన్‌డ్రియా వాటర్స్ సందర్శించారు. ఈ విశ్వవిద్యాలయం 
ఎక్కడ ఉంది? 
జ:  అహ్మదాబాద్
భారత జాతీయపుష్పం తామరపువ్వు శాస్త్రీయనామం ఏది?
జ:  నెలుంబో నూసిఫెరా గెర్టన్
 కిందివారిలో రెండు లోక్‌సభలకు స్పీకర్‌గా పనిచేసిన వారిని గుర్తించండి-
1. ఎం. అనంతశయనం అయ్యంగార్
2. బలరామ్ జాకర్
3. జి.ఎం.సి.బాలయోగి
4. శివరాజ్‌పాటిల్
జ:  1, 2, 3
నాలుగు దక్షిణ భారత రాష్ట్రాల్లో అత్యధికంగా లోక్‌సభ, రాజ్యసభ సీట్లు ఉన్న రాష్ట్రం ఏది?
జ:  ఆంధ్రప్రదేశ్

నేషనల్ రిసెర్చ్ లేబోరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది?
జ:  లక్నో
 భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్.) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ:  అక్టోబరు 1, 2000
దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన సాయుధ దళాల ట్రిబ్యునల్‌కు తొలి ఛైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:  జస్టిస్ అశోక్‌కుమార్ మాధుర్
ఇటీవల ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పదవి పొందిన భారత మాజీ క్రికెటర్ ఎవరు?
జ:  కపిల్‌దేవ్
లైఫ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్.ఐ.సి.) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
జ:  ముంబయి
 ఏ ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకం గెలుచుకోలేదు?
జ:  బార్సిలోనా ఒలింపిక్స్
 భారత రాజ్యాంగానికి హృదయం, ఆత్మ అని బి.ఆర్.అంబేద్కర్ దేన్ని వర్ణించారు?
జ:  రాజ్యాంగ పరిహార హక్కు 
 అథ్లెట్స్ ఫుట్ వ్యాధిని కలుగజేసేది?
జ:  ఫంగస్

కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి
1. భారతదేశ మొదటి మూకీచిత్రం రాజాహరిశ్చంద్ర.
2. భారతదేశ మొదటి 3డి చిత్రం మైడియర్ కుట్టిచేతన్.
3. ఇన్సూరెన్స్ చేసిన మొదటి భారత చిత్రం తాళ్.
4. భారతరత్న అవార్డు పొందిన మొదటి సినీనటి మీనాకుమారి.
జ:  1, 2, 3
 లింగరాజస్వామి ఆలయం ఎక్కడ ఉంది?
జ:  భువనేశ్వర్
 భగవద్గీతను మొదటిసారి ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు?
జ:  ఛార్లెన్స్ విల్కిన్స్
సంస్థలు - అవి ఉన్న ప్రదేశాల జతల్లో సరైనవి గుర్తించండి.
1. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ - లక్నో
2. సెంటర్ ఫర్ డి.ఎన్.ఎ. ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ - హైదరాబాద్
3. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ - చండీగఢ్
4. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ - న్యూఢిల్లీ
జ:  1, 2, 3, 4


విశ్వవిద్యాలయాలు, కళాశాలల అధ్యాపకుల వేతన సవరణపై ఇటీవల ఏ కమిటీని నియమించారు?
జ:  జి.కె.చద్దా కమిటీ
భారతదేశంలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఒక వ్యక్తి వ్యాపార వేత్తగా ఎదిగాడు. ఈ కథతో భారతదేశానికి చెందిన అరవింద్ అడిఘా రచించిన 'వైట్ టైగర్' పుస్తకానికి 2008 సంవత్సర బుకర్ బహుమతి లభించింది. 'వైట్‌టైగర్' పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ ఏది?
జ:  అట్లాంటిక్ బుక్స్
'వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్' (ప్రపంచ అభివృద్ధి నివేదిక) పేరిట ఏ సంస్థ ఏటా ఒక నివేదికను ప్రచురిస్తుంది?
జ:  ప్రపంచ బ్యాంకు
 భారతదేశం అత్యధికంగా ఏ దేశంతో విదేశీ వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది?
జ:  అమెరికా
2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
జ:  పశ్చిమబెంగాల్
 వ్యక్తులు - సంబంధిత పారిశ్రామిక రంగాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
1. కిరణ్‌కార్నిక్                       - సాఫ్ట్‌వేర్
2. బ్రిజ్‌మోహన్‌లాల్ ముంజల్ - ఆటోమొబైల్
3. కిరణ్ మజుందార్‌షా             - బయోటెక్నాలజీ
4. సునీల్ మిట్టల్                    - టెలికామ్
జ:  1, 2, 3, 4

'స్కాట్‌లాండ్ ఆఫ్ ద ఈస్ట్'గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
జ:  మేఘాలయ
ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి సరైనవి గుర్తించండి
1) మార్చి 21   - ప్రపంచ అటవీ దినోత్సవం
2 మార్చి 22    - ప్రపంచ నీటి దినోత్సవం
3. ఏప్రిల్ 22     - ప్రపంచ ధరిత్రి దినోత్సవం
4. డిసెంబరు 7 - సాయుధదళాల పతాక దినోత్సవం
జ:  1, 2, 3, 4
సౌత్‌వెస్ట్ ఆఫ్రికా కొత్త పేరేమిటి?
జ:  నమీబియా
 ప్రపంచ ద్రవ్య వ్యవస్థను సంస్కరించడానికి అవసరమైన సూచనలు చేసేందుకు ఐక్యరాజ్యసమితి నియమించిన హైపవర్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ నియమితులయ్యారు. ఆయన ఏ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ఛైర్మన్? (ఆసియా దేశాల నుంచి ఎన్నికైన ఏకైక సభ్యుడిగా ప్రభాత్ రికార్డు సృష్టించారు).
జ:  కేరళ
వాషింగ్‌మెషిన్‌ను ఎవరు కనుక్కున్నారు?
జ:  అల్వాజె ఫిషర్

రాష్ట్రంలోని ప్రాజెక్టులు - పేర్లకు సంబంధించిన సరైన జతలను గుర్తించండి?
1. ప్రాణహిత చేవెళ్ల                - బాబా సాహెబ్ అంబేద్కర్
2. తెలుగుగంగ                     - నందమూరి తారకరామారావు
3. శ్రీశైలం కుడిగట్టుకాలువ    - దామోదరం సంజీవయ్య
4. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి  - బాబూ జగ్జీవన్‌రాం
జ:  1, 2, 3, 4

 మంజిత్ బవా (మరణించారు) ఏ రంగంలో ప్రసిద్ధుడు?
జ:  చిత్రలేఖనం

 గాంధీసాగర్ డ్యామ్ ఏ ప్రాజెక్టులో భాగంగా ఉంది?
జ:  చంబల్ ప్రాజెక్టు

దేశాలు - పార్లమెంట్లకు సంబంధించి సరైన జతలను గుర్తించండి?
1. నెదర్లాండ్స్   - స్టేటిన్ జనరల్
2. ఉక్రెయిన్      - సుప్రీమ్ కౌన్సిల్
3. పోలాండ్       - సెజ్మ్
4. జపాన్          - డైట్

జ:  1, 2, 3, 4

గ్రంథాలు-రచయితలకు సంబంధించి సరైనవి గుర్తించండి?
1. రీకన్సిలేషన్: ఇస్లామ్, డెమొక్రసీ అండ్ ద వెస్ట్ - బెనజీర్ భుట్టో
2. మోహన్‌దాస్: ఎ ట్రూ స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్, హిజ్‌పీపుల్ అండ్ యాన్ ఎంపైర్ - రాజ్‌మోహన్ గాంధీ
3. ఇండియా ఆఫ్టర్ గాంధీ: ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమొక్రసీ - రామచంద్ర గుహ
4. ఎన్‌చాన్‌ట్రెస్ ఆఫ్ ఫ్లోరెన్స్ - సల్మాన్ రష్దీ
జ:  1, 2, 3, 4 

మొదటి అంతరిక్ష పర్యాటకుడిగా డెనిస్ టిటో రికార్డు సృష్టించాడు. మొదటి అంతరిక్ష పర్యాటకురాలిగా చరిత్ర సృష్టించిన మహిళ ఎవరు?
జ:  అనేష్ అన్సారీ

పర్యావరణ పరిరక్షణకోసం 'గ్రీన్ ట్యాక్స్'ను విధించిన తొలి దేశం ఏది?
జ:  న్యూజిలాండ్

జస్టిస్ లిబర్‌హాన్ కమిషన్ దేనికి సంబంధించింది?

జ:  అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత

నదీతీర నగరాలకు సంబంధించి సరైనవి గుర్తించండి?
1. వాషింగ్టన్ డి.సి.  - పొటామక్
2. బెర్లిన్                 - స్ప్రీ
3. పారిస్                - సీన్
4. మాడ్రిడ్              - మాన్జనేర్స్

జ:  1, 2, 3, 4 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment