రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్నికైనట్లు ప్రకటించిన అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడంటే ? -జనరల్ నాలెడ్జ్ బిట్స్



జనరల్ నాలెడ్జ్ బిట్స్
భారత రాజ్యాంగం పేర్కొనని పదవి- 
జవాబు:  ఉప ప్రధానమంత్రి

విస్తీర్ణపరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం ఏది? 
జవాబు:  లడఖ్

 భారత రాజ్యాంగానికి సంబంధించి అత్యున్నత న్యాయపరమైన ట్రిబ్యునల్ ఏది? జవాబు: సుప్రీంకోర్టు

 భారతీయ న్యాయవ్యవస్థ అధికార పరిధుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏ అధికార పరిధిలోకి వస్తుంది? 
జవాబు: అప్పిలేట్ అధికార పరిధి

సుప్రీంకోర్టులో నేరుగా దాఖలు చేయకూడని కేసులు ఏవి? 
జవాబు:  ఒకరి ఆస్తిని బలవంతంగా మరొకరు ఆక్రమించిన కేసులు

 సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియామకం కావడానికి నిర్ణయ ప్రమాణం కానిది ఏది? జవాబు: 55 సంవత్సరాల వయసు ఉండటం

సుప్రీంకోర్టు 'న్యాయపరమైన సమీక్ష' విధి అంటే ఏమిటి? 
జవాబు: చట్టాలు రాజ్యాంగబద్ధమైన న్యాయసమ్మతిని పరిశీలించే అధికారం

 భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు ఒకటికి మించిన రాష్ట్రాల మీద అధికార పరిధి ఉంది?
జవాబు: 3

భారతీయ న్యాయ వ్యవస్థలో ప్రజాప్రయోజన వ్యాజ్య (పిల్) ప్రవేశ పెట్టినప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
జవాబు:  పి.ఎన్. భగవతి

 ముంబయి హైకోర్టుకు బెంచి లేని స్థలం ఏది?
జవాబు:  పూణె

 సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది?
జవాబు: భారత పార్లమెంటు

రాష్ట్ర గవర్నర్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు, కొత్త గవర్నర్‌ను నియమించేవరకు అతని విధులను ఎవరు నిర్వహిస్తారు?
జవాబు: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

 భారత రాజ్యాంగ నిబంధన 371-ఎ ప్రకారం ఏ రాష్ట్ర గవర్నర్‌కు రాష్ట్ర సొంత భద్రతలకు సంబంధించి ప్రత్యేక బాధ్యత ఉంది?
జవాబు: నాగాలాండ్

 రాష్ట్ర శాసన మండలిని సృష్టించే లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
జవాబు:  రాష్ట్ర శాసనసభ సిఫార్సు మేరకు పార్లమెంటుకు

 రాష్ట్ర గవర్నర్‌కు సంబంధించిన అంశాలు ఏవి?  
జవాబు: ¤  గవర్నర్ పూర్వఆమోదం లేకుండా ద్రవ్య బిల్లును రాష్ట్ర శాసన వ్యవస్థలో ప్రవేశపెట్టకూడదు. 
      ¤  శాసన వ్యవస్థ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.
     ¤  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు

రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్నికైనట్లు ప్రకటించిన అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడంటే-
జవాబు: అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎన్నికలో పోటీపడినట్లు

. రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల గరిష్ఠ సంఖ్య?
జవాబు:   500

 రాష్ట్రంలో శాసన మండలిని రద్దుచేయాలని పార్లమెంటుకు సిఫార్సు చేసేది ఎవరు?
జవాబు:  సంబంధిత రాష్ట్ర శాసన సభ

 రాజ్యాంగ పరిధిలో అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి?
జవాబు:  కేంద్ర ప్రభుత్వం

 ఏ విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రత్యేకంగా మున్సిపల్ సంబంధాలుగా పేర్కొన్నారు?
జవాబు: ప్రణాళిక ప్రక్రియలో రాష్ట్రం మీద కేంద్ర నియంత్రణ

 రాజకీయ పార్టీకి గుర్తింపునిచ్చేది-
జవాబు:  ఎన్నికల సంఘం

 ఏ సంస్కరణల నిమిత్తం, భారత ప్రభుత్వం వీరప్ప మెయిలీ అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది?
జవాబు: పరిపాలన సంస్కరణలు

ప్రభుత్వం నిధులు సమకూర్చే ఎన్నికలు ఏ దేశాల్లో జరుగుతాయి?
జవాబు: జర్మనీ, ఆస్ట్రియా

ఏ వ్యవస్థకు నిర్ణయించిన సభ్యుల సంఖ్యకు జరిగే ఎన్నిక నిమిత్తం పట్టభద్రులు, ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటవుతుంది?
జవాబు: రాష్ట్ర శాసన మండలి

 ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి?
జవాబు:  2

 రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఎవరు?
జవాబు:  ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు, ఫలితాల ప్రకటనలకు బాధ్యత వహించే అధికారి

 భారత రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్‌ను ఎన్నో సవరణ ద్వారాచేర్చారు?
జవాబు: మొదటి సవరణ

 భారత ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు?
జవాబు: రాష్ట్రపతి

పంచాయితీరాజ్ వ్యవస్థలో ఏయే స్థాయిలుండాలని బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచించింది?
జవాబు:  గ్రామ, సమితి, జిల్లా స్థాయిలు

పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం-
జవాబు: ప్రజాస్వామ్య అధికారాన్ని వికేంద్రీకరించడం

 పంచాయితీరాజ్ వ్యవస్థకు గరిష్ఠ ఆదాయ వనరు ఏది?
జవాబు: ప్రభుత్వ గ్రాంట్లు

 పంచాయితీరాజ్ వ్యవస్థలో ఎవరికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పిస్తారు?
జవాబు: అందరికీ

 గ్రామ పంచాయితీలకు ఆదాయ వనరు కానిది?
జవాబు: ఆస్తిపన్ను

 భారత రాజ్యాంగ నిబంధనల్లో, గ్రామ పంచాయితీలను ప్రత్యేకంగా చేయాలనే నిబంధన-
జవాబు:  నిబంధన - 40

 పంచాయితీరాజ్‌ను పటిష్టం చేసే అంశానికి సంబంధించిన భారత రాజ్యాంగ సవరణ
జవాబు:  73

 పంచాయితీరాజ్ వ్యవస్థల్లో బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన వ్యవస్థ ఏది?

జవాబు: గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీ, సమితి స్థాయిలో పంచాయితీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment