హుస్సేన్‌సాగర్‌ తవ్వించినదెవరు? - బిట్స్


 1510 నాటికి బహుమనీ రాజ్యం ఎన్ని స్వతంత్ర రాజ్యాలుగా చీలిపోయింది.
- ఐదు (బీరారు, బీదర్‌, బీజాపూర్‌, గోల్కొండ, అహ్మద్‌నగర్‌).

గోల్కొండలో కుతుబ్‌షాహి రాజ్యాన్ని స్థాపించినది? 
- సుల్తాన్‌ కులీ

 సుల్తాన్‌ కులీ ఏ తెగకు చెందినవాడు? 
-మధ్య ఆసియాకు చెందిన కారాకుయున్‌ (కర్రిగొర్రె)

 సుల్తాన్‌ కులీకి 1490లో 4వ మహ్మద్‌ షా ఇచ్చిన బిరుదు 
- కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌

 సుల్తాన్‌ కులీ మహ్మద్‌ షా కొలువులో ఖవాస్‌ఖాన్‌ బిరుదు పొందినట్లు తెలియజేసేది 
- తారిక్‌ ఇక్బురియా

కులీకి గోల్కొండ ఎప్పుడు జాగీరుదారైంది? 
- 1495

గోల్కొండకు ఆ పేరు ఎందుకు వచ్చింది?
- ఈ కొండపై గోవులను ఎక్కువగా మేపడంవల్ల

చాళుక్య యుగంలో గోల్కొండను ఏమని పిలిచేవారు? 
- మంగళవరం

1363 ప్రాంతంలో గోల్కొండను ఏమని పిలిచేవారు? 
- మహమ్మద్‌నగరం

 కులీ కుతుబ్‌ షా ఎప్పుడు స్వతంత్రుడయ్యెను? 
- 1518.

 తీరాంధ్రానికై కులీ కుతుబ్‌ షా ఎవరెవరితో యుద్ధాలు జరిపాడు
- ప్రతాపరుద్ర గజపతి, శ్రీ కృష్ణదేవరాయలు.

 గోల్కొండ ప్రజలతో 'బడే మాలిక్‌'గా పిలువబడిన నవాబు?
- సుల్తాన్‌ కులీ

 ఖమ్మం మెట్టు దగ్గర సుల్తాన్‌ కులీ చేతిలో ఓడిపోయింది? 
- సీతాపతి

 చరిత్రలో సీతాపతి ఏ పేర్లతో పిలువబడెను? 
- సీతాబుఖాన్‌, చిత్తాపుఖాన్‌

 సీతాపతి ఎవరి సామంతుడు? 
- గజపతి.

 కులీ కుతుబ్‌ షా పాలనాకాలం 
- 1518-1543

 కుమారుడి చేతిలో హత్యకు గురైన గోల్కొండ నవాబు 
- కులీ కుతుబ్‌ షా

 సుల్తాన్‌ కులీ (కులీ కుతుబ్‌ షా)ను హత్య చేసి అధికారంలోకి వచ్చినది? 
- జంషీద్‌

 అమర్‌ ఉల్‌ ఉమ్రా బిరుదు ఎవరిది? 
- కులీ కుతుబ్‌ షా

 కులీ కుతుబ్‌ షా ఏ యేడాది హత్యకు గురయ్యాడు? 
- 1543. 

 1575లో హుస్సేన్‌సాగర్‌ తవ్వించినదెవరు? 
- ఇబ్రహీం కుతుబ్‌ షా

 జంషీద్‌ రాజ్య పాలనా కాలం 
- 1543-1550

 జంషీద్‌కు భయపడి అళియ రామరాయల ఆశ్రయం కోరిన కులీ కుతుబ్‌షా కుమారుడు?
- మాలిక్‌ ఇబ్రహీం

 జంషీద్‌ ఎప్పుడు మరణించాడు? 
- 1550.

 జంషీద్‌ తర్వాత సింహాసనం అధిష్టించినది? 
- జంషీద్‌ కొడుకు సుభాన్‌

 సుభాన్‌ను తొలగించిన వెంటనే సింహాసనాన్ని ఆక్రమించినది 
- మాలిక్‌ ఇబ్రహీం

 మాలిక్‌ ఇబ్రహీం పాలనాకాలం 
- 1550-1580

 ఇబ్రహీం వివాహం చేసుకున్న నైజాం షా కుమార్తె? 
- బీబీ జుమాలిని

 కుతుబ్‌ షా వంశస్తుల్లో మొదటిసారిగా 'షా' బిరుదు పొందినది ఎవరు? 
- ఇబ్రహీం కుతుబ్‌ షా 

 1565లో జరిగిన తళ్లికోట యుద్ధంలో బహమనీ సైన్యాలకు నాయకత్వం వహించినది?
- ఇబ్రహీం కుతుబ్‌ షా

 1579లో కొండవీడు, మచిలీ పట్నాలను ఆక్రమించిన ఇబ్రహీం సేనాని 
- హైదర్‌ ఉల్‌ ముల్క్‌ 

ఇంకా :
భారత కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత మంత్రి మండలి
ముఖ్యమైన వ్యక్తులు - జీవిత చరిత్ర
ఆధునిక భారత దేశ చరిత్ర
భారత పార్లమెంట్
భారత రాజ్యాంగం - సవరణలు
భారత రాజ్యాంగం - చట్టాలు
భారత రాజ్యాంగ పరిషత్