కంప్యూటర్‌ కాన్ఫిగరేషన్‌ను తెలుసుకునేదెలా?


ఎక్కువమంది కంప్యూటర్‌ వినియోగదారులకు తమ పీసీ కాన్ఫిగరేషన్‌ ఎంతో తెలియదు. 
కంప్యూటర్‌ ఉపయోగించేవారికి తమ పీసీ కాన్ఫిగరేషన్‌ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. 
ముఖ్యంగా తమ పీసీలోని ప్రాసెసర్‌, ర్యామ్‌, హార్డ్‌డిస్క్‌లకు సంబంధించి పూర్తి వివరాల 
పట్ల అవగాహన ఉండాలి. 

ఎందుకంటే కంప్యూటర్‌ పనితీరు ముఖ్యంగా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంటుంది. 
ప్రాసెసర్‌, ర్యామ్‌ వివరాలు తెలుసుకోవాలంటే 'మై కంప్యూటర్‌'పై మౌస్‌తో రైట్‌ క్లిక్‌ 
చేసిగానీ, 'కంట్రోల్‌ ప్యానెల్‌'లోకి లాగిన్‌ అయిగానీ తెలుసుకోవచ్చు. 

మై కంప్యూటర్‌పై డబుల్‌ క్లిక్‌ చేస్తే వచ్చే విండోలోని హార్డ్‌డిస్క్‌ ఐకాన్లపై రైట్‌ క్లిక్‌ చేసి
 ప్రాపర్టీస్‌లోకి వెళితే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి
 వచ్చిన తర్వాత దాని బ్యాండ్‌విడ్త్‌ కూడా బాగా పెరిగింది. నిమిషాల వ్యవధిలోనే 
కావాల్సినంత డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోగలుగుతున్నాం. 

అయితే.. కొన్ని సందర్భాల్లో డౌన్‌లోడింగ్‌ వేగం నెమ్మదిస్తుంటుంది. దీనికి కారణం 
ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గడం కావొచ్చు లేదా వినియోగదారుని అవగాహన లోపం వల్లనైనా 
కావచ్చు. 

అంటే కంప్యూటర్‌ రక్షణకు తగు చర్యలు తీసుకోకపోవడం అని చెప్పొచ్చు. 
డౌన్‌లోడింగ్‌ వేగాన్ని మెరుగు పరచుకోవాలంటే... ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌ సర్వీస్‌ 
ప్రొవైడర్‌ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్‌ 
సమయంలో ఇతర అప్లికేషన్లను డెస్క్‌టాప్‌పై తెరిచి ఉంచకూడదు. 

దీనివల్ల నెట్‌ వేగం మందగిస్తుంది. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని 
ముందుగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వేగంగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు డౌన్‌లోడ్‌ 
ఇన్‌స్టాలర్‌ వంటి అప్లికేషన్ల నుండి ప్రయత్నించడం మంచిది. ఈ ఫీచర్స్‌ డౌన్‌లోడింగ్‌ను 
వేగవంతం చేస్తాయి.