అర్థరాత్రి సూర్యుడు కనిపించే దేశం ఏది ? ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన తొలిసారి ఎప్పుడు విధించారు? - వి.ఆర్‌.వో., వి.ఆర్‌.ఏ. పరీక్షల ప్రత్యేకం





 ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన తొలిసారి  ఎప్పుడు విధించారు?
1973

 ఇటీవల 'ఈ-కోర్టులో ప్రవేశపెట్టిన రాష్ట్రం?
గుజరాత్‌

 రాష్ట్రంలో బొగ్గును తవ్వితీస్తున్న కంపెనీ?
సింగరేణి కాలరీస్‌

 కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకునే కార్బన్‌ సింక్స్‌గా ఉపయోగపడేవి?
గడ్డినేలలు

 దేశంలో అత్యధిక మురికివాడలుగల రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్‌

 దేశంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహం ఎక్కడ ఉంది?
చిదంబరం

 కనిష్కుడి కాలంలోని శిల్పకళ?
గాంధారకళ

 అష్టదిగ్గజాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
శ్రీకృష్ణదేవరాయలు

 గౌతమబుద్ధుడు మొదటిసారిగా జ్ఞానబోధ చేసిన ప్రదేశం?
మృగదావనం (సారనాధ్‌)

 కృష్ణానదిలోయలో ఆవిర్భవించిన కళ? 
అమరావతి కళ

 సర్పలేఖనం అంటే... 
ఎడమనుంచి కుడికి తర్వాత కుడినుంచి ఎడమకు రాయడం

 ముద్రారాక్షసం గ్రంథకర్త?
విశాఖదత్తుడు

 గుప్తుల రాజధాని?
 పాటలీపుత్రం

 నృత్తరత్నావళి అనే నాట్యశాస్త్ర గ్రంథ రచయిత?
జాయపసేనాని

 విచిత్ర చిత్తుడు, చిత్రకారపులి అనే బిరుదులు కల పల్లవరాజు?
  
మహేంద్రవర్మ

 లిథోస్‌ అంటే?
  
శిల

 విషవత్తులు అంటే?
రేయింబవళ్ళు సమానంగా ఉండేరోజులు (మార్చి-21, సెప్టెంబర్‌-23)

 ఆల్ప్స్‌ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?
ఐరోపా

 అతి పెద్ద దీవుల సముదాయం?
  
ఇండోనేషియా

 అర్థరాత్రి సూర్యుడు కనిపించే దేశం ఏది ? 
నార్వే

 ఆఫ్రికాఖండాన్ని చీకటిఖండం అని పిలవడానికి కారణం?
19వ శతాబ్దం వరకు ఆఫ్రికా ఖండం గురించి మిగతా ప్రపంచానికి తెలియకపోవడం

 యూరప్‌లో పొడవైన నది?
వోల్గా

 ఆసియాలో అతి పెద్ద రైల్వే వ్యవస్థ?
భారత రైల్వే వ్యవస్థ

 రూకరీలు అంటే? 
పెంగ్విన్‌ పక్షుల సమూహాలు

గోధుమలను అధికంగా ఉత్పత్తి చేసే దేశం?
అమెరికా




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment