చెరుకును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? నల్ల మిరియాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? - భారతదేశంలో ప్రధాన పంటలు - జనరల్ నాలెడ్జ్ బిట్స్


జనరల్ నాలెడ్జ్ బిట్స్ 
భారతదేశంలో ప్రధాన పంటలు

ఉపసంహార రుతుపవనాల ప్రభావం ఏ రాష్ట్రాల్లో ఎక్కువ?
జవాబు :  తమిళనాడు

ఏ రాష్ట్రంలో శీతాకాలంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది?
జవాబు:  తమిళనాడు

కనిష్ఠ (-28.30సెం.) గరిష్ఠ (150సెం.) ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశమేది?
జవాబు:  లేహ్

 భారతదేశంలోని శీతోష్ణస్థితి ఏ రకానికి చెందింది?
జవాబు:  ఉపఆయన రేఖా రుతుపవన శీతోష్ణస్థితి

 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తులనాత్మకంగా అత్యల్ప సగటు రుతుపవన వర్షపాతం ఉండే ప్రదేశం-
జవాబు:  పశ్చిమ ఉత్తరప్రదేశ్

ఉపాధి కోసం ఆయా కాలాల్లో 'వలసపోవడం (Transhumance)' అనేది-
జవాబు:  పర్వతాల ఎగువ, దిగువ ప్రాంతాలకు జంతువులతో సహా ఆయా రుతువుల ప్రకారం ప్రజలు వలసపోవడం

చెరుకులో సుక్రోజ్ ఎప్పుడు తగ్గుతుంది?
జవాబు:  మొక్క పెరిగే సమయంలో అధిక వర్షపాతం ఏర్పడినప్పుడు

పోడు వ్యవసాయం ముఖ్యమైన లక్షణం-
జవాబు:  సాగు భూమిని మార్చడం

భూసారాన్ని మెరుగుపరిచేది-
జవాబు:  సజీవంగా ఉన్న వానపాములను చేర్చడం

మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటి?
జవాబు:  ఒకే సమయంలో రెండు పంటలు పండించడం

భారతదేశంలోని ఏ ప్రాంతాల్లో మూడు వరి పంటలు పండిస్తారు?
జవాబు:  బ్రహ్మపుత్ర లోయ

 ''ప్రపంచంలో అత్యంత పెద్ద పట్టు ఉత్పత్తిదారు భారతదేశం'': ఇది సరైన వాక్యమా కాదా?
జవాబు: సరైన వాక్యం కాదు

భారతదేశంలోని పొగాకు ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు-
జవాబు:  ఆంధ్రప్రదేశ్, గుజరాత్

 భారతదేశంలో సహజ రబ్బరుకు సంబంధించి అతిపెద్ద ఉత్పత్తిదారైన రాష్ట్రం-
జవాబు:  కేరళ

ఉకాయ్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
జవాబు:  తపతి

భారతదేశంలో రబీ సీజన్‌లో పండే పంటలు ఏవి?
జవాబు:  గోధుమ, బార్లీ, పప్పులు

 నగదు పంటకు ఒక ఉదాహరణ-
జవాబు:  రబ్బరు

తేయాకు తోటకు అనువైన నేల-
జవాబు:  ఆమ్లయుత నేల

 నల్ల మిరియాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
జవాబు:  కేరళ

 భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో ప్రధానమైన రాష్ట్రాలు ఏవి?
జవాబు:  తమిళనాడు, గుజరాత్

 ''డార్జిలింగ్ టీకి మంచి వాసన, మంచి లిక్కర్ ఉంటాయి'': ఈ వాక్యం సరైనదా  కాదా?
జవాబు:  సరైంది.

 అధిక వర్షపాతం, పుష్కలమైన సూర్యకాంతి, నెమ్మదైన వాలు ప్రాంతం, మంచి నీటిపారుదల సదుపాయం ఉన్న నేల అనే లక్షణాలు ఏ పంటకు అత్యంత అనుకూలమైనవి?
జవాబు:  తేయాకు

ప్రపంచంలో జనుము ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
జవాబు:  బంగ్లాదేశ్

భూసారాన్ని పునరుద్ధరించడానికి, కాపాడడానికి సాధారణంగా వేసే పంట-
జవాబు:  పప్పుధాన్యాలు

 కొంత భూమిని కాల్చడం ద్వారా చెట్లను తొలగించి కొంతకాలంపాటు సాగుచేసే వ్యవసాయం-
జవాబు:  పోడు వ్యవసాయం

 ఏ పంట సాగుకు నిరంతరాయమైన 'సెమి ఆక్వాటిక్' పరిస్థితి అవసరం ఉంటుంది?
జవాబు:  వరి

 అత్యధిక పరిమాణంలో కాఫీని పండించే రాష్ట్రం-
జవాబు:  కర్ణాటక

 దేశంలో కాఫీని పండించని రాష్ట్రం ఏది?
జవాబు:  ఆంధ్రప్రదేశ్

 అత్యధికంగా ఆవనూనెను ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
జవాబు:  మహారాష్ట్ర

 చెరుకును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
జవాబు:  ఉత్తరప్రదేశ్

 సంవత్సరంలో కేవలం రెండు నెలలపాటు పలచగా వర్షపాతం ఉన్న ప్రాంతానికి అత్యంత అనుకూలమైన పంట-
జవాబు:  పప్పుధాన్యాలు

 'గోల్డెన్ ఫైబర్' అని దేన్ని అంటారు?
జవాబు:  జనుము

 దేశంలో అత్యధికంగా లిగ్నైట్ బొగ్గును ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
జవాబు:  తమిళనాడు

 దేశంలో చమురుక్షేత్రాల్లో అతి ప్రాచీనమైంది, ఇంకా ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రం ఏది?
జవాబు:  దిగ్బోయ్

 ప్రపంచ మార్కెట్‌లో భారతదేశానికి ఏ ఉత్పత్తి విషయంలో బంగ్లాదేశ్ ప్రధానమైన పోటీదారుగా ఉంది?
జవాబు:  జనుము

 ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో  భారతదేశ స్థానం-
జవాబు: తొమ్మిది

 సింగ్భమ్ దేనికి ప్రసిద్ధి?
జవాబు:  రాగి, ఇనుము

 భారతదేశంలో అధిక థోరియంతో మోనజైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం-
జవాబు:  కేరళ

భారతదేశంలో అతిపెద్ద బొగ్గు నిల్వలు ఎక్కడ కనిపిస్తాయి?
జవాబు:  జార్ఖండ్

తపోవన్, విష్ణుగడ్ జలవిద్యుత్ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జవాబు:  ఉత్తరాఖండ్

 ఓంకారేశ్వర్ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న నది-
జవాబు  నర్మద

 నామ్‌చిక్-నాచ్‌టెక్ బొగ్గు గనులున్న రాష్ట్రం ఏది?
జవాబు:  అరుణాచల్‌ప్రదేశ్


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment