వేసవికాలంలో క్రిస్మస్ పండగ జరుపుకునే దేశం ఏది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





 ధ్రువాల దిశలో సాధారణంగా ఉష్ణోగ్రత తగ్గడానికి కారణం ఏమిటి?
జవాబు: మనం ధ్రువ ప్రాంతాలవైపు వెళ్తున్న కొద్దీ యూనిట్ ప్రాంతం ఒక్కింటికి భూ ఉపరితలంపై పడే సౌరశక్తి తగ్గిపోతుంది

జెట్ ప్రవాహాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి-
జవాబు: జెట్ ప్రవాహాలు శీతాలకాలంలో బాగా రూపొందుతాయి, జెట్ ప్రవాహాలు తరుచూ డోలనాలను రూపొందిస్తాయి, జెట్ ప్రవాహాలు మన ఉపరితల వాతావరణాన్ని గొప్పగా ప్రభావితం చేస్తాయి

వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేయని అంశం ఏది?
జవాబు:  అవపాతం

 రాత్రిపూట మైదానాల కంటే ఎడారులు చల్లగా ఉండటానికి కారణం-
జవాబు: మట్టికంటే ఇసుక త్వరగా ఉష్ణాన్ని వికిరణం చెందిస్తుంది

తక్కువ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో జాతులు కనిపించే ప్రాంతం-
జవాబు: ఆర్ధ్ర సతతహరిత భూమధ్యరేఖా ప్రాంతం అడవులు

తూర్పు యూరప్ కంటే పశ్చిమ యూరప్‌లో వేసవి కాలం కొంచెం వేడిగా ఉండటానికి కారణం ఏమిటి?
జవాబు: కవోష్ణ సముద్ర ప్రవాహ ప్రభావం

పండ్ల తోటల సాగులో మధ్యధరా ప్రాంతం ప్రత్యేకతను సాధించడానికి కారణం-
జవాబు: ఎగుమతి నిమిత్తం పండ్లను ఎండబెట్టడానికి, ప్యాక్ చేయడానికి సుదీర్ఘమైన వేసవికాలం అనువుగా ఉండటం

ప్రపంచంలో 'బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్‌'గా పేర్కొనే ప్రాంతం ఏది?
జవాబు: సమశీతోష్ణ మండల పచ్చిక భూములు

 కింది వాటికి సంబంధించి మధ్యధరా శీతోష్ణస్థితిలో కనిపించని లక్షణం ఏది?
జవాబు: వేసవిలో అపతీర వ్యాపార పవనాలు వీయడం

 కింది ఆవరణ వ్యవస్థల్లో భూతలం మీద అత్యధిక ప్రాంతంలో విస్తరించింది ఏది?
జవాబు: సముద్ర ఆవరణ వ్యవస్థ

 కింది ప్రాంతాల్లో వేటాడటం, ఆహార సేకరణకు ప్రాబల్యం వహించిన ప్రాంతం?
జవాబు:  ఉష్ణ మండలారణ్యం

కింది శీతోష్ణస్థితి అంశాల్లో భౌమ ఆవరణ వ్యవస్థ మీద కనిష్ఠస్థాయి ప్రభావం చూపే అంశం-
జవాబు:  పవనం

మధ్యధరా ప్రాంతం శీతోష్ణస్థితి రకం ఏ ప్రాంతంలో ఉంటుంది?
జవాబు:  దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ ప్రాంతం

 కిందివాటిలో శీతోష్ణస్థితిని నిర్ధారించే అంశం కానిది-
జవాబు:  రేఖాంశం

 వర్షారణ్యాన్ని తొలగించినట్లయితే ఉష్ణమండల నేలల్లో ఏం జరుగుతుంది?
జవాబు: కీలకమైన పోషక వలయానికి అంతరాయం ఏర్పడి మృత్తికా లీచింగ్‌కు దారితీస్తుంది

 బాక్సైట్‌ను అత్యధికంగా ఉత్పత్తిచేసే దేశం-
జవాబు:  ఆస్ట్రేలియా

 ప్రపంచంలో అత్యధిక ప్రాంతాన్ని ఆక్రమించిన అంశం ఏది?
జవాబు: పశుపాలన

ద్రాక్ష పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన సహజ ప్రాంతం-
జవాబు:  మధ్యధరా ప్రాంతం

సంవహన వర్షపాతంలో కనిపించని లక్షణం-
జవాబు:  సన్ననిజల్లు

 ప్రపంచంలో న్యూస్‌ప్రింట్‌ను అత్యధికంగా సరఫరా చేసే అటవీ రకం ఏది?
జవాబు: కోనిఫెర్రస్ అడవి

 కింది వాటిలో 27º సెంటిగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత, 200 సెం.మీ. మించిన వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది?
జవాబు: సింగపూర్

వేసవికాలంలో క్రిస్మస్ పండగ జరుపుకునే దేశం ఏది?
జవాబు:  ఆస్ట్రేలియా

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment