జపాన్‌లో తరచు భూకంపాలు రావడానికి కారణం? - జనరల్ నాలెడ్జ్ బిట్స్






 ప్రపంచంలో అతిపెద్ద ఎడారి-
జవాబు: సహారా

 ప్రపంచంలో అత్యధికమైన వేడి ఉన్న ప్రాంతం-
జవాబు: అజిజియా (లిబియా)

ఉష్ణ మండల వర్షారణ్యాలు దట్టంగా, వైవిధ్యంగా ఉండటానికి కారణం-
జవాబు: సంవత్సర మొత్తం మీద తేమ, కవోష్ణ ఉష్ణోగ్రత పుష్కలంగా ఉండటం

టేకు, సాల వృక్షాలకు ప్రసిద్ధమైన అడవులు ఏవి?
జవాబు: ఉష్ణ మండల అర్ధ్ర ఆకురాల్చే అడువులు

నైట్రేట్‌ల నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచిన ఎడారి ఏది?
జవాబు: అటకామా

 జంతు, వృక్ష జాతులు అత్యధిక సాంద్రతలో ఉన్న ప్రాంతాలు:
జవాబు: ఉష్ణ మండల ఆర్ధ్ర అరణ్యాలు

పొడవాటి వృక్షరహితమైన గడ్డిలాంటి పామ్స్ (తాటి జాతులు) లక్షణంగా ఉన్న ప్రాంతాలు?
జవాబు: పంపాస్

 మధ్యధరా భూములను తరచూ ప్రపంచంలోని ఏ భూములుగా పేర్కొంటారు?
జవాబు: ఉద్యాన భూములు

టైగా మేఖ వేటి మధ్య విస్తరించి ఉంది?
జవాబు: రుతుపవన శీతోష్ణస్థితి, టండ్రా

 సంవత్సరం మొత్తం మీద వర్షపాతం ఉండని ప్రాంతం?
జవాబు: టండ్రా ప్రాంతం

 ఉష్ణ మండలారణ్య శీతోష్ణస్థితి రకం లక్షణం ఏది?
జవాబు: భారీ వర్షం, సంవత్సమంతటా అధిక ఉష్ణోగ్రతలు

గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు?
జవాబు: చాంబర్లీన్, మౌల్టన్

ఆస్ట్రేలియాలో వేసవి వర్షాలు స్థూలంగా ఎలా తగ్గుతాయి?
జవాబు: ఉత్తరం నుంచి దక్షిణానికి

 సంవత్సరమంతా అతిశీతల ఉష్ణోగ్రతతో అత్యున్నత పొడి వాతావరణం ఉన్న మండలం
జవాబు: టండ్రా

 ప్రపంచంలో హాట్ డెజర్ట్ ఎక్కడ ఉంది?
జవాబు: హార్స్ లాటిట్యూడ్

 రసాయన శైథిల్యానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులున్న ప్రాంతాలు ఏవి?
జవాబు: వేడి, తేమ ప్రాంతాలు

 కిందివాటిలో రసాయన శైథిల్య ప్రక్రియను సూచించేది?
జవాబు: హైడ్రేషన్, జలవిశ్లేషణ

 కింది వాటిలో అగ్ని పర్వత ఉత్పత్తి లక్షణం?
జవాబు: కాల్డెరా

ఉష్ణోగ్రతలలోని మార్పులకు శిలలు లోనైనప్పుడు ఏర్పడే శైథిల్యం?
జవాబు: యాంత్రిక శైథిల్యం

శైథిల్యం కారణంగా శిల, పొరలు పొరలుగా తొలగిపోవడాన్ని ఏమంటారు?
జవాబు: విదళనం

వికోషేకరణ ప్రక్రియలు భూ ద్రవ్యరాశులను ఉపరితల స్థాయికి తగ్గించకపోవడానికి కారణం-
జవాబు: భూ చలనాలు భూ ద్రవ్యరాశిని పైకి లేపడం

 పర్వతాలమీద హిమానీ, నద క్రమయక్షం వల్ల ఏర్పడిన బౌల్ ఆకారంలోని గుంటను ఏమంటారు?
జవాబు: హిమగర్భం

ఎడారి ప్రాంతంలోని అవశిష్ఠ పర్వతాన్ని ఏమంటారు?
జవాబు: ఇన్‌సెల్‌బర్గ్

 కిందివాటిలో రసాయన శైథిల్యంలో ఉండేవి?
జవాబు: ద్రావణం, ఆక్సీకరణం, క్షయకరణం

 కింది పలక చలనాల్లో, సముద్ర మధ్య కటకానికి కారణం?
జవాబు: అపసరణ చలనం

 భూపటలంలో కొంత భాగం మునిగిపోవడం వల్ల ఏర్పడిన భ్రంశం వెంబడి ఉన్న నిలువు సమాంతర కూడ్యాలతో ఉన్న లోయను ఏమంటారు?
జవాబు: విధీర్ణలోయ (Rify Velley)

 కింది భూస్వరూప ప్రక్రియల్లో, హిమానీ నదుల కృషికి సంబంధం ఉన్న ప్రక్రియ-
జవాబు: పెకిలించడం

 ప్రాథమిక భూకంప తరంగానికి సబంధించి సరైన లక్షణం-
జవాబు: అనుదైర్ఘ్యం, సంపీడన తరంగం, ధ్వని తరంగాలకు సమానంగా ఉంటుంది, ఘన పదార్థాల ద్వారా వేగంగానూ, ద్రవాల ద్వారా నెమ్మదిగాను ప్రయానిస్తుంది

 నదీ క్రమక్షయ ద్వారా ఎత్తయిన ప్రాంతాలన్నిటీని దాదాపు మైదాన ప్రాంతం స్థాయికి తగ్గించడాన్ని ఏమంటారు?
జవాబు: ప్లెనీ మైదానం

 ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పీఠభూమి
జవాబు: పామీర్

 భూకంప అధికేంద్రం-
జవాబు: భూ ఉపరితలానికి లంబంగా ఉన్న కేంద్రం నుంచి ఉపరితలానికి అత్యంత సమీపంగా ఉన్న స్థానం

 జపాన్‌లో తరచు భూకంపాలు రావడానికి కారణం-
జవాబు: జపాన్ భూపటలానికి చెందిన రెండు పలకల సమాగమం అయ్యేస్థానంలో ఉండటం

 భూకంపాలు రావడానికి కారణం?
జవాబు: భూ తలానికి కింద ఉష్ణ అగ్నిపర్వత ప్రావారం మీద తేలాడే భూ పలకల చలనం

భూ పటలం లోపల చలనాన్ని అధ్యయనం చేసే శాస్త్రం-
జవాబు: భూకంప శాస్త్రం (సిస్మాలజీ)

 భూకంపం వల్ల ఏర్పడే అతిపెద్ద సముద్రతరంగమైన సునామీ ఏ తీరాల వెంట వస్తుంది?
జవాబు: జపాన్

 భూకంపాల తీవ్రతను దేనితో మాపనం చేస్తారు?
జవాబు:  రిక్టర్ స్కేల్

 ఆల్ఫ్స్ పర్వతాలు ఏయే దేశాల్లో విస్తరించి ఉన్నాయి?
జవాబు: ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియా

 కింది జలసంధుల్లో అంతర్జాతీయ దిన రేఖకు అత్యంత సమీపంలో ఏ జలసంధి ఉంది?
జవాబు:  మలక్కా

 మాల్తా ఉన్న సముద్రం-
జవాబు: మధ్యధరా సముద్రం



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment