మృత సముద్రం లో ఇలా నీటిపైన తెలవచ్చు |
»డెడ్ సీ అని పిలిచే మృత సముద్రం మిగతా సముద్రాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద కొలనులాగా ఉంటుంది. |
»సుమారు 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఇజ్రాయిల్, జోర్దాన్ దేశాల మధ్య విస్తరించి ఉంది. |
»ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న సరస్సు. దీంట్లో సముద్రాలలో కన్నా లవణీయత పదిరెట్లు ఎక్కువ |
»అంటే ఉప్పు వంటి అనేక లవణాల గాఢత విపరీతంగా ఉండడం వల్ల ఇందులో చేపలు, తిమింగలాలు, నాచు, కోరల్స్ వంటి పెద్ద జీవజాతులు బతకలేవు. |
»అందుకే దీన్ని మృత సముద్రం అన్నారు. కేవలం తక్కువ స్థాయిలో కొన్ని బ్యాక్టీరియాలు, ఫంగస్ జీవులు ఉంటాయి. |
»మృత సముద్రంలో ఉప్పు శాతం విపరీతంగా ఉండడం వల్ల ఈ నీటి సాంద్రత 1.24 గ్రా ఉంటుంది. |
»అందుకే మనుషులు తదితర జీవులు మునగవు. ఈత కొట్టవలసిన అవసరం లేకుండానే నీళ్లలో తేలవచ్చు. |
»మనుషులు మునగనంత మాత్రాన మిగతా వస్తువులు కూడా మునగవని అనుకోవడానికి లేదు. |
»ప్లవన సూత్రాల ప్రకారం ద్రవాల సాంద్రత కన్నా వస్తువుల సాంద్రత ఎక్కువయితే ఆ వస్తువులు ఆ ద్రవంలో మునుగుతాయి. |
»తక్కువయితే
తేలుతాయి. కాబట్టి 1.24 గ్రా కన్నా ఎక్కు సాంద్రత ఉన్న ఇనుము, రాళ్లు వంటివి
తప్పకుండా మునుగుతాయి. ఇంకా తెలుసుకోండి: |
» ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు » ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు » భారతదేశంలోని ప్రధాన సరస్సులు » ప్రపంచంలోని ప్రధాన సరస్సులు » భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి |