గర్భధారణ జరిగిన 12వ వారానికి ఏర్పడేది ? - పదో తరగతి పరీక్షల ప్రత్యేకం



     ap ssc board కోసం చిత్ర ఫలితం

1. స్త్రీలలో ఫలదీకరణం జరిగే భాగం ?
 -ఫాలోఫియన్‌ నాళం

2. గర్భధారణ జరిగిన 12వ వారానికి ఏర్పడేది ? 
- జరాయువు

3. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే మార్పుల చక్రాన్ని ఏమంటారు ? 
- రుతుచక్రం

4. గ్రాఫియన్‌ పుటిక నుంచి అండం విడుదల కావడాన్ని ఏమంటారు ? 
- అండోత్సర్గం

5. స్త్రీ బీజకోశంలోని సంచుల్లాంటి నిర్మాణాలను ఏమంటారు ? 
- స్త్రీ బీజకోశ పుటిక

6. భారత ప్రభుత్వం బాల్య వివాహాల అదుపు చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ? 
- 1978

7. మానవుల్లో గర్భావధి కాలం ? 
- సుమారు 40 వారాలు

8. యాంత్రిక అఘాతాల నుంచి పిండానికి రక్షణనిచ్చేవి ? 
- ఉల్బం, ఉల్బక ద్రవం

9. పుటిక పగలడాన్ని, తర్వాత అది కార్పస్‌ లూటియమ్‌గా మారడాన్ని ప్రోత్సహించేది ? 
లుటినైజింగ్‌ హార్మోన్‌

10. ఈస్ట్రోజెన, ప్రొజెస్టిరాన్‌లను ఉత్పత్తి చేసేది ? 
-కార్పస్‌ ల్యూటియం

11. పగిలిన పుటికను ఏమని పిలుస్తారు ?
 -కార్పస్‌ ల్యూటియం

12. శుక్రకణాలు చలించడానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసేవి ? 
-మైటోకాండ్రియా

13.ల్యూటినైజింగ్‌ హార్మోనును ఉత్పత్తి చేసే నిర్మాణం ? 
- పీయూష గ్రంథి

14. ఫోలికిల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోనును ఉత్పత్తి చేసే నిర్మాణం ? 
- పీయూష గ్రంథి

15.శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్రకణాలు దేనిలోకి ప్రవేశిస్తాయి ? 
- శుక్రనాళికలు

16. శుక్రోత్పాదిక నాళికలు గల అవయవం ?
 -ముష్కాలు

17. ముష్కం ఏ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే నిర్మాణం ?
 - పురుష

18. రుతుచక్రాన్ని అదుపు చేసే హార్మోనులు ఏ గ్రంథి పూర్వలంబిక నుంచి ఉత్పత్తి అవుతాయి?
 - పీయూష

19. భ్రూణం, గర్భాశయం కుండ్యానికి దేని ద్వారా అంటి పెట్టుకుంటుంది ? 
- జరాయువు

20. ముష్కాలు ఉత్పత్తి చేసే హార్మోన్లు ? 
- టెస్టోస్టిరాన్‌

21. మలేరియా జ్వరానికి వాహకాలు ?
 - దోమలు

22. హెపటైటిస్‌ జ్వరానికి వాహకాలు ?
 - మానవులు

23. కలుషితమైన మేతను తినడం వల్ల పశువులకు వచ్చే వ్యాధి ? 
- మ్యాడ్‌-కొ

24. శోషరస నాళాలు, శోషరస గ్రంథుల వాపు వల్ల వచ్చే వ్యాధి ? 
- బోదవ్యాధి

25. జీవ శాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లు గల పదార్థాలు ? 
- మాంసం, గుడ్లు, పాలు

26.అయోడిన్‌ లోపం వల్ల కలిగేది ? 
- గాయిటర్‌

27. 20డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద కొవ్వు ఏ రూపంలో ఉంటుంది ? 
- ఘన

28. ఎక్కువ మొత్తాల్లో ఫ్లోరిన్‌ తీసుకోవడం వల్ల ?
- ఫ్లోరోసోసిస్‌ ఏర్పడుతుంది

29. ప్రకృతిలో గల అమైనో ఆమ్లాల సంఖ్య ?
 - 24






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment