జనవరి - 2
¤ గోదావరీ నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా కేంద్ర జల సంఘంలో సీనియర్ ఇంజినీర్‌గా ఉన్న రామ్ శరణ్‌ను కేంద్రం నియమించింది.
» ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకు మొదటి ఛైర్మన్‌గా నియమితులైన అగర్వాల్ డిసెంబరు 31న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో రామ్ శరణ్‌ను కేంద్రం నియమించింది.
జనవరి - 5
¤ కోల్ ఇండియా సీఎండీగా సుతీర్థ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించారు.
¤ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)గా 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఎం.సత్యవతి బాధ్యతలు స్వీకరించారు.
» డీజీసీఏగా ఒక మహిళ నియమితులవడం ఇదే ప్రథమం. ఆమె ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
జనవరి - 8
¤ ఉత్తరప్రదేశ్‌లో ఇసుక దందా, అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరించినందుకు సస్పెన్షన్‌కు గురైన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖలో ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్‌డీ)గా నియమించారు.
జనవరి - 10
¤ అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ కంపెనీకి ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన థామస్ కురియన్ (48 సంవత్సరాలు) నియమితులయ్యారు. ఈయన ఒరాకిల్‌లో 1996లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ డెవలప్‌మెంట్)గా చేరారు.
» కురియన్ కేరళకు చెందినవారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు.
¤ కొత్తగా ఏర్పాటైన 'నీతి ఆయోగ్' ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి సింధుశ్రీ ఖుల్లార్ నియమితులయ్యారు. ఈమె గతంలో అప్పటి ప్రణాళిక సంఘం కార్యదర్శిగా పని చేశారు.
» ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన 'నీతి ఆయోగ్' సీఈవోగా ఆమెను ఒప్పంద ప్రాతిపాదికపై నియమించారు. ఏడాదిపాటు ఆమె ఈ పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు.
జనవరి - 12
¤ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చీఫ్, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త ఏఎస్ కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
» కిరణ్‌కుమార్ గతంలో అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశారు. కర్ణాటకకు చెందిన ఆయన 1975లో ఇస్రోలో చేరారు. భాస్కర ఉపగ్రహం విజయవంతం కావడంలోనూ కీలక పాత్ర పోషించారు.
జనవరి - 16
¤ భారత నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ దిల్లీలో బాధ్యతలు స్వీకరించారు.
» వి.ఎస్.సంపత్ స్థానంలో ఈయన నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన బ్రహ్మ దిల్లీలోని నిర్వచన్ సదన్‌లో బాధ్యతలు చేపట్టారు.
» ఈ పదవిలో ఆయన సుమారు మూడు నెలల పాటు కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న పదవీ విరమణ చేయనున్నారు.
జనవరి - 17
¤ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) సభ్యురాలిగా హైదరాబాద్‌కు చెందిన మెర్ల శ్రీషా నియమితులయ్యారు.
» అయిదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.
జనవరి - 19
¤ కేంద్ర సెన్సారు బోర్డు కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రఖ్యాత చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. లీలా శాంసన్ రాజీనామాతో కేంద్రం నిహలానీని నియమించింది.
» ఈయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
» బోర్డు ఛైర్‌పర్సన్‌తోపాటు 9 మంది కొత్త సభ్యులను కూడా కేంద్రం నియమించింది.
» తెలుగు నటి జీవిత రాజశేఖర్, మిహిర్ భూటా, ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ బరి, రమేష్ పతంగే, జార్జి బేకర్, డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది, వాణి త్రిపాఠి టికూ, ఎస్వీ శేఖర్, అశోక్ పండిత్ కొత్త సభ్యులుగా నియమితులయ్యారు.
¤ ఆంధ్రప్రదేశ్‌లో 20 సూత్రాల పథకం అమలు, పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఎల్లా శ్రీనివాస శేష సాయిబాబును ప్రభుత్వం నియమించింది.
» కేబినెట్ మంత్రికి సమానమైన హోదాను ఈయనకు కల్పించింది. రెండేళ్లపాటు సాయిబాబు ఈ పదవిలో కొనసాగుతారు.
జనవరి - 22
¤ వొడాఫోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా సునీల్ సూద్ నియమితులయ్యారు.
» ఈయన ఏప్రిల్ 1న మార్టిన్ పీటర్స్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.
జనవరి - 25
¤ కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా కె.దుర్గాప్రసాద్ నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
జనవరి - 29
¤ ప్రముఖ సంగీత విద్వాంసుడు శేఖర్‌సేన్ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
¤ భారత విదేశాంగ కార్యదర్శిగా డాక్టర్ ఎస్. జైశంకర్ బాధ్యతలు చేపట్టారు.
» సుజాతా సింగ్ స్థానంలో ఈయన నియమితులయ్యారు.
» 1977 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఫ్ఎస్ అధికారి చైనా, అమెరికాలతోపాటు సింగపూర్, చెక్ రిపబ్లిక్‌లలోనూ రాయబారిగా సేవలందించారు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment