(-) . సింధుపై అరబ్బులు ఎప్పుడు విజయం సాధించారు?
జవాబు: క్రీ.శ. 712
(-) . కింది ఢిల్లీసుల్తానుల్లో 'వైరుధ్యాల మిశ్రమం'గా చరిత్రకారులు ఎవరిని పేర్కొన్నారు?
జవాబు: మహమ్మద్ తుగ్లక్
(-) . అల్ బెరూనీ ఎవరితోపాటు భారతదేశానికి వచ్చాడు?
జవాబు: గజనీ మహమ్మద్
(-) . భారతదేశంలో మొదటి ముస్లిం పాలకుడు ఎవరు?
జవాబు: మహమ్మద్ ఘోరీ
(-) . ఢిల్లీ సల్తనత్‌కు సంబంధించి, దివాన్-ఇ-అమీర్ కాహ్ (వ్యవసాయశాఖ)ను ఎవరు ఏర్పాటు చేశారు?
జవాబు: మహమ్మద్ బిన్ తుగ్లక్
(-) . ఢిల్లీ సల్తనత్‌లో 'ముస్తాఫ్ మమాలిక్' కృషి దేనికి సంబంధించింది?
జవాబు: ఆడిటింగ్
(-) . ప్రపంచంలోనే అతిపెద్ద గుమ్మటాల్లో ఒకటిగా పేర్కొంటున్న చారిత్రక స్మారక స్థూపం ఎక్కడ ఉంది?
జవాబు: గోల్‌గుంబజ్(బీజాపూర్)
(-) . తైమూర్ ఎవరికాలంలో భారతదేశంపై దండెత్తి వచ్చాడు?
జవాబు: నసీరుద్దీన్ మహమ్మద్
(-) . మధ్యయుగ భారతదేశ పాలకులకు సంబంధించి, కింది వాక్యాల్లో ఏది సరైంది?
జవాబు: ఫిరోజ్ తుగ్లక్ ప్రత్యేకమైన బానిసల విభాగాన్ని ఏర్పాటు చేశాడు
(-) . భారతదేశంలో మొదటి స్వతంత్ర టర్కిష్ రాజ్యానికి పూనాది వేసింది-
జవాబు: కుతుబుద్దీన్ ఐబక్
(-) . పౌర పాలన ప్రక్రియలో భాగంగా ఎవరు మొదట తన సామ్రాజ్యాన్ని 'ఇక్తాలు'గా విభజించారు?
జవాబు: ఇల్తుత్‌మిష్
(-) . పర్షియా నుంచి వచ్చిన అబ్దుల్ రజాక్ హంపీని సందర్శించినప్పుడు దక్షిణ భారతదేశంలో విజయనగర పాలకుడు ఎవరు?
జవాబు: రెండో దేవరాయలు
(-) . కిందివారిలో 'చౌగన్ (పోలో)' ఆడుతూ మరణించిన పాలకుడెవరు?
జవాబు: కుతుబుద్దీన్ ఐబక్
(-) . మధ్యయుగ ఉత్తర భారతదేశంలో రాచరికపు ఆదాయానికి సంబంధించి ప్రధానమైన వనరు ఏది?
జవాబు: జిజియా
(-) . ఎక్కడ నుంచి అపారమైన సంపద దోచుకున్న తర్వాత అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు?
జవాబు: దేవగిరి
(-) . సల్తనత్ కాలంలోని టంకం, షష్గని, జిటల్ నాణేలను ఏ లోహాలతో తయారు చేశారు?
జవాబు: వెండి, వెండి, రాగి
(-) . అనేకసార్లు దక్కన్‌ను జయించిన అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనా నాయకుడు ఎవరు?
జవాబు: మాలిక్ కఫూర్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment