మహామహులకు చెమటలు పట్టించిన సామాన్యుడు అరవింద్ కేజ్రివాల్




మహామహులకు  చెమటలు పట్టించిన సామాన్యుడు అరవింద్ కేజ్రివాల్

arvind kejriwal కోసం చిత్ర ఫలితం
::  అరవింద్ కేజ్రివాల్ భారతీయ సామాజికవేత్త మరియు రాజకీయ నాయకుడు.
:: అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో  ఆగష్టు 16, 1968 జన్మించాడు.గోబింద్ రామ్ కేజ్రివాల్ ను గీతా దేవికి పుట్టిన మూడు పీల్లలలో పెద్ద వాడు. ఐ.ఐ.టీ. ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు.
:: ఇంజనీరింగ్ పూర్తవగానే టాటా స్టీల్ కంపెనీలో, జేరాడు.  తరువాత  మానేసాడు. అప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్షలు వ్రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. డిల్లీలోని ఆదాయపు పన్ను కార్యాలయంలో జాయింట్ కమీషనర్ ఉద్యోగంలో చేరారు.
:: 1999 డిసెంబర్ లో కేజ్రివాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే ,పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ఢిల్లీలోని ప్రజలకు పన్నులు, విద్యుత్తు, ఆహార పంపిణి విషయాల గురించి అవగాహన కలిగించడం లో సహాయం చేశారు.
:: సమచార హక్కు చట్టం వినియోగించి ఢిల్లీ లోని ప్రభుత్వ సంస్థలలో అవనినీతిని వెలికితీశారు

jan lokpal bill కోసం చిత్ర ఫలితం
:: అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే తో కలిసి జన లోక్ పాల్ బిల్లు బిల్లు కోసం పోరాడారు.

arvind kejriwal with anna hazare కోసం చిత్ర ఫలితం
:: 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీ ని ఢిల్లీలో స్థాపించారు. 2013 డిసెంబర్ 4 న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి గా పనిచేసిన షీలా దీక్షిత్ పై 25,864 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు
:: ఢిల్లీ 2013 అసెంబ్లి ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనిన ప్రధమ ఎన్నికలు. ఎన్నికల కమీషన్ నుంచి పొందిన "చీపురు కట్ట" గుర్తు పై పోటిచేసారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక హామీలు ప్రకటించారు. ఈ ఎన్నికలలో 70 సీట్లకు గాను 28 సీట్లు సాధించి సంచలనం సృష్టించారు. 32 స్థానాలు సాదించిన బిజెపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించటంతో, లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 8 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇచ్చింది.
aap కోసం చిత్ర ఫలితంaap కోసం చిత్ర ఫలితం        aap కోసం చిత్ర ఫలితం
:: ఆయన 28 డిసెంబర్ 2013 – 14 ఫిబ్రవరి 2014 వరకు డిల్లి  ముక్యమంత్రిగా ఉన్నారు
:: జన్ లోక్‌పాల్ బిల్లు ఢిల్లీ అసెంబ్లీలో ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ 49 రోజుల తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు
:: 2014 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి పార్లమెంటు బరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పై అరవింద్ కేజ్రివాల్ పోటిపడ్డాడు
:: ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తప్పుకున్న కేజ్రీవాల్ వారణాసిలో భాజపా ప్రధాని నరేంద్రమోడీకి పోటీగా బరిలోకి దిగారు. కానీ ఆయన చేతిలో 3,71,784 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు

:: అరవింద్ కేజ్రీవాల్ 2012 లో స్వరాజ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు.
అరవింద్ కేజ్రివాల్ కు ఎన్నో బిరుదులు లభించాయి 
2004:  అశోకా ఫెలో అవార్డు
2005:ఐఐటి కాన్పూర్ నుండి సత్యాంద్ర కే దుబే మెమోరియల్ అవార్డు
2006: రామన్ మెగసెసే పురస్కారం
2006: సంఘ సేవ లో ఇండియన్ అఫ్ ది ఇయర్
2009: ప్రత్యేక అల్యుమినుస్ అవార్డు, IIT ఖరగ్పూర్  ప్రఖ్యాత నాయకత్వం
2009: ఫెలోషిప్ మరియు గ్రాంట్ Association for India's Development.
2010: పాలసి చేంజ్ ఏజెంట్ అఫ్ ది ఇయర్, ఎకనామిక్స్ టైం అవార్డు అరుణా రాయ్ తో కలిసి
2011: ఎన్.డి.టి.వి ఇండియన్ అఫ్ ది ఇయర్ అన్నా హజారే తో కలిసి 
2013: సిఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ అఫ్ ది ఇయర్ రాజకీయ విభాగం 
2014 టైమ్ పత్రిక "టైం100"పోల్ విజేత

:: వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే ఒరిగిపోయిందని సామెత. ఢిల్లీ ఎన్నిక ఫలితం ఆ సామెతను ఇంత గొప్పగా నిరూపిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అనుకూల మీడియా దన్నుతో, అపారమైన కార్పొరేట్‌ అర్థబలం, ఆర్‌ఎస్‌ఎస్‌ అంగబలం అండతో మోడీ అజేయుడు, అప్రతిహతుడు అంటూ బిజెపి శ్రేణులు కొన్ని మాసాలుగా అదేపనిగా ఊదరగొడుతూ వచ్చాయి. అటువంటి మోడీ అజేయుడు, అప్రతిహతుడు కాదని దేశ రాజధానిలోని సామాన్యపౌరుడు ఈ ఫలితం ద్వారా చాటిచెప్పాడు. 

:: 2015  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ అఖండ విజయం సాఢించింది. మూడుసార్లు ఢిల్లీలో విజయం సాధించామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ అడ్రస్‌ సైతం గల్లంతయింది. గత సారి 8 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి డకౌట్‌ అయ్యింది. చాలా చోట్ల దానికి డిపాజిట్లు సైతం దక్కలేదు. అవినీతిని అరికట్టడమే ప్రధాన ఎజెండాగా కలిగిన కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమాద్మీ ప్రభుత్వం రాజీనామా చేసి సరిగ్గా ఏడాదికి తిరిగి అదే రోజు అంటే ఫిబ్రవరి 14న తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడం విశేషం


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment