ఎలక్ట్రాన్‌ ను కనుగొన్నది ఎవరు ?



jj thomson కోసం చిత్ర ఫలితం


-ఎలక్ట్రాన్‌ను కనుగొన్నందుకు JJ థామ్సన్‌కు 1906లో నోబెల్ బహుమతి లభించింది. ఈ ఎలక్ట్రాన్‌కు ఋణావేశం ఉంటుందని అమెరికాకు చెందిన మిల్లికాన్ ప్రయోగాత్మకంగా నిర్ధారించాడు. దీనికి మిల్లికాన్‌కు 1923లో నోబెల్ బహుమతి లభించింది. 

-ఎలక్ట్రాన్ ఆవేశం విలువ e- = 1.602 x 10-19 కూలూంబ్‌లు
-ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి విలువ me = 9.11 x 10-31 kg
-ఎలక్ట్రాన్ విశిష్టావేశం విలువ (e/m)ను JJ థామ్సన్ కనుగొన్నాడు. 
-e/m = 1.759 x 1011 కూలూంబ్/కి.గ్రా.

-కదులుతున్న ఎలక్ట్రాన్లకు, రేఖీయ ద్రవ్యవేగం, గతిజ శక్తులు ఉంటాయని విలియం క్రూక్స్ అనే శాస్త్రవేత్త నిరూపించాడు. 

-ఎలక్ట్రాన్‌కు వ్యతిరేకమైన కణాన్ని పాజిట్రాన్ అంటారు. ఎలక్ట్రాన్‌కు సమానమైన ద్రవ్యరాశి ఉండే పాజిట్రాన్‌కు ధనావేశం ఉంటుంది. ఈ పాజిట్రాన్‌ను కనుగొన్నందుకు కార్ల్ D అండర్సన్ (అమెరికా)కు 1936లో నోబెల్ బహుమతి లభించింది.

-ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి చాలాతక్కువగా ఉంటుంది. దీనివల్ల పదార్థంలో ఎక్కువ లోతుకు చొచ్చుకొని వెల్లగలుగుతుంది. కాబట్టి ప్లాటినం, టంగ్‌స్టన్, మాలిబ్డినమ్ వంటి ధృడమైన లోహాల్లోకి ఎలక్ట్రాన్లు చొచ్చుకొని పోయి X-కిరణాలను ఉత్పత్తి చేస్తాయి. 



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment