X - కిరణాలు (X - Rays)




x-కిరణాలు (x-rays) 
x-ray founder కోసం చిత్ర ఫలితం

1895లో జర్మనీకి చెందిన విల్‌హెల్మ్ రాంట్‌జెన్ అనే శాస్త్రవేత్త x-కిరణాలను కనుగొన్నాడు. ఇందుకుగాను ఆయనకు 1901లో నోబెల్ బహుమతి లభించింది. భౌతికశాస్త్రంలో మొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త రాంట్‌జెన్. 

-x-కిరణాల తరంగధైర్ఘ్యం 0.001Ao (ఆంగ్‌స్ట్రామ్ యూనిట్)ల నుంచి 100Ao ల వరకు ఉంటుంది. క్వాంటం సిద్ధాంతం ప్రకారం X- కిరణాలు చాలా శక్తివంతమైనవి. అయితే వీటికి ఎటువంటి ఆవేశం, ద్రవ్యరాశి ఉండవు. ఇవి ఒకరకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే.

-x-కిరణాలు కాంతి వేగానికి సమానంగా ప్రయాణిస్తాయి. అంటే కాంతి వేగం C = 3 X 108 మీ/సెకన్
-X-కిరణాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి...

i. కఠిన X - కిరణాలు (Hard X-rays)
ii. మృదు X - కిరణాలు (Soft X-rays)

కఠిన X - కిరణాలు 
-ఈ కిరణాల తరంగ ధైర్ఘ్యం 0.01Aoల వరకు ఉంటుంది. అంటే వీటి తరంగధైర్ఘ్యం తక్కువగా ఉండి ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి.
x-rays కోసం చిత్ర ఫలితం x-rays కోసం చిత్ర ఫలితం
-ఇవి మెత్తగా ఉండే మాంసం, ధృడంగా ఉండే ఎముకలు, లోహాలు, లోహాల మిశ్రమాల గుండా చొచ్చుకొని పోతాయి. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, దేశ సరిహద్దుల్లో, ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయడానికి, పెద్ద పెద్ద బాయిలర్లు, లోహాలతో తయారు చేసిన పైపులు, డ్యాముల్లో ఏర్పడిన రంధ్రాలను, పగుళ్లను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు.
x-rays కోసం చిత్ర ఫలితం
మృదు X - కిరణాలు 
-ఈ కిరణాల తరంగధైర్ఘ్యం 10Ao నుంచి 100Aoల వరకు ఉంటుంది. వీటి శక్తి తక్కువగా ఉండి, మెత్తగా ఉండే శరీర భాగాల ద్వారా మాత్రమే చొచ్చుకొని పోతాయి. కానీ ఎముకల వంటి ధృడమైన భాగాల నుంచి ప్రయాణించలేవు. 

-జీర్ణాశయ భాగాలను X - కిరణాలతో ఫొటో తీయడానికి ముందు ఆ రోగికి బేరియం మీల్స్ అనే రసాయనిక ద్రావణాన్ని తాగిస్తారు. ఇది X - కిరణాలను కావలసిన చోట కేంద్రీకరిస్తుంది. 
-వీటిని ఉపయోగించి రోగనిర్ధారణ చేయడాన్ని రేడియోగ్రఫీ అని, చికిత్స చేయడాన్ని రేడియో థెరపీ అంటారు. 
subramanya chandrasekharan కోసం చిత్ర ఫలితం
-X - కిరణాలతో పనిచేసే చంద్ర X - ray టెలిస్కోప్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు రోదసీలోకి ప్రయోగించి విశ్వ ఆవిర్భావ రహస్యాలను తెలుసుకుంటున్నారు. దీనికి ప్రఖ్యాత భౌతిక ఖగోళశాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖరన్ గౌరవార్దం చంద్ర X-ray టెలిస్కోప్ అని పేరుపెట్టారు.







0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment